Begin typing your search above and press return to search.

మ‌నుషుల్లో క్రూర‌త్వం ఎంతో చెప్పేశారు

By:  Tupaki Desk   |   14 Jan 2018 6:03 AM GMT
మ‌నుషుల్లో క్రూర‌త్వం ఎంతో చెప్పేశారు
X
నిజంగా నిజం. మ‌నిషి స్వార్థానికి ప‌శువులు ప‌డుతున్న అవ‌స్థ ఎంతో తెలిస్తే షాక్ తినాల్సిందే. ప్ర‌కృతిలో అన్ని జీవుల మాదిరే మ‌నిషి కూడా. కాకుంటే.. మిగిలిన జీవుల‌తో పోలిస్తే.. మేధ‌స్సు ఉన్న మ‌నిషి మిగిలిన వాటిపై త‌న అధిక్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నాడు. బ‌లమైనోడే రాజు అన్న‌ట్లుగా ప్ర‌కృతిలో మ‌నిషి వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. త‌నకు తోడుగా నిలిచే మొక్క‌లు.. జంతువులు అన్నింటిని త‌న అవ‌స‌రాల‌కు వాడేస్తున్నాడు. అవ‌న్నీ త‌న కోస‌మేన‌న్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. విన‌టానికి వింత‌గా ఉన్నా ఇది నిజం.

ప్ర‌కృతిలో అంద‌రూ స‌మానంం. కానీ.. మేధ‌స్సున్న మ‌నిషి అందుకు అంగీక‌రించ‌డు. కానీ.. గ‌తంలోకి తొంగి చూస్తే.. ఒక‌ప్పుడు మ‌నిషి ప్ర‌కృతిలో తాను ఒక భాగ‌మ‌ని న‌మ్మ‌టం క‌నిపిస్తుంది. త‌న అవ‌స‌రం కోసం ప‌శువుల్ని.. చెట్ల‌ను వాడుకున్నా.. త‌న వంతుగా వాటికి చేయాల్సినంత చేయూత‌ను ఇవ్వ‌టం క‌నిపిస్తుంది. చెట్ల‌ను ప‌క్క‌న పెడితే.. ప‌శువుల సంగ‌తి చూద్దాం. ప‌శువుల్ని ఆర్థిక ఆస‌రా కోసం నాడు పెంచినా.. త‌మ‌కు సాయంగా నిలిచిన ప‌శువుల విష‌యంలో మ‌నిషి మ‌న‌సుతో ఆలోచించేవాడు. డ‌బ్బే ప్ర‌పంచంగా మారిపోయిన ఈ రోజుల్లో ఆ విష‌యాల్ని వ‌దిలేశాడు. త‌న కోస‌మే అంద‌రూ ఉన్నార‌న్న‌ట్లుగా వాడేయ‌టం మొద‌లైంది.

ఈ తీరు ఎన్ని ఇబ్బందుల‌కు గురి చేస్తుంద‌న్న విష‌యాన్ని సంక్రాంతి నేప‌థ్యంలో ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ ఇచ్చిన క‌థ‌నం ఆస‌క్తిక‌రంగా ఉండ‌ట‌మే కాదు.. నిజ‌మే క‌దా మ‌నిషి..ప‌శువులా మారిపోయాడే అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. త‌న‌కు సాయం చేసిన ప‌శువుల విష‌యంలో మ‌నిషి ఎంత నిర్ద‌య‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడో చెప్ప‌ట‌మే కాదు.. ఈ కార‌ణంగా చోటు చేసుకుంటున్న మార్పును ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించ‌టం గ‌మ‌నార్హం.

ప‌శువుల్ని కేవ‌లం వ్యాపార వ‌స్తువుగా చూస్తున్న నేటి కాలంలో.. మ‌నిషి ఆలోచ‌న‌ల పుణ్య‌మా అని మ‌గ ప‌శువుల సంఖ్య భారీగా త‌గ్గిపోయి.. ఆడ ప‌శువుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. మ‌గ ప‌శువుతో అయితే పొలంలో ప‌నికి త‌ప్పించి మ‌రిక దేనికి ప‌నికిరాదు. అదే ఆడ ప‌శువులైతే పాలు ఇస్తాయి. పున‌రోత్ప‌త్తికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మ‌గ ప‌శువులు లేకుండా పున‌రుత్ప‌త్తి సాధ్యం కాద‌నుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్లే. ఎందుకంటే కృత్రిమ గ‌ర్భ‌ధార‌ణ కోసం మాయ‌దారి ఇంజెక్ష‌న్లు వ‌చ్చేసిన వేళ‌.. మ‌గ‌ప‌శువుల అవ‌స‌రం ఏం ఉంటుంది?

పాలిచ్చే పాడి ప‌శువులు త‌ప్ప‌.. ప‌ని చేసే ప‌శువుల పెంప‌కం త‌గ్గిపోతోంది. ప‌ని చేసేందుకు యంత్రాలు అందుబాటులోకి వ‌చ్చిన వేళ‌.. మ‌గ ప‌శువుల‌తో ప‌నేముంది? ఈ దిక్కుమాలిన ధోర‌ణితో మ‌గ ప‌శువుల సంఖ్య అంత‌కంత‌కూ త‌గ్గిపోతున్నాయి. భ‌విష్య‌త్తులో మ‌గ ప‌శువులు పూర్తిగా అంత‌రించిపోయినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌ని లేదేమో?

మ‌నిషి స్వార్థానికి చిహ్నంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు ల‌క్ష‌ల ఒంగోలు జాతి ప‌శువులు ఉంటే.. వాటిల్లో ఎద్దులు స‌గం కూడా లేవ‌ని చెబుతున్నారు. మిగిలిన జాతుల‌కు సంబంధించిన ప‌శువుల విష‌యంలోనూ ఆడ‌వి అత్య‌ధికంగా ఉంటే.. మ‌గ ప‌శువుల సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉండ‌డ‌టం క‌నిపిస్తోంది. ఈ స‌మ‌స్య ఎంత తీవ్రంగా ఉంద‌న్న విష‌యాన్ని గ‌ణాంకాల ఉదాహ‌ర‌ణ‌లో ప్ర‌స్తావిస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. 2015 గ‌ణాంకాల ప్ర‌కారం ఏపీలో పాలిచ్చే అవులు.. గేద‌లు 35 లక్ష‌లు ఉంటే.. మ‌గ దున్న‌పోతులు.. ఎద్దులు కేవ‌లంం 13 ల‌క్ష‌లు కూడా లేక‌పోవ‌టం గ‌మ‌నార్హం.

మ‌నిషి ధోర‌ణి వ‌ల్ల ప‌శువులు లైంగిక సుఖానికి దూర‌మ‌వుతున్నాయ‌న్న వాద‌న‌ను జంతుప్రేమికులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నా.. ప‌శువుల‌కు లైంగిక సుఖం అన్న‌ది ఉండ‌ద‌ని చెబుతున్నారు నిపుణులు. అయితే.. వారి వాద‌న త‌ప్పంటూ బీబీసీ క‌థ‌నం ఒక‌టి ప్ర‌స్తావించాల్సిందే. మ‌నిషి మాదిరే ప‌శువుల‌కూ లైంగిక సుఖం ఉంటుంద‌న్న విష‌యాన్ని తేల్చి చెబుతోందీ క‌థ‌నం.

ఇంత‌కీ ఆ క‌థ‌నంలో ఏం ఉందన్న‌ది చూస్తే.. సృష్టిలో మ‌నుషుల‌కు మాత్ర‌మే లైంగిక ఆనందం ఉంటుంద‌ని.. అందుకోస‌మే శృంగారంలో పాల్గొంటార‌ని ప‌లువురు చెబుతుంటారు. కేవ‌లం పిల్ల‌ల్ని పుట్టించ‌టం కోస‌మే సృష్టికార్యంలో పాల్గొంటార‌ని ప‌లువురు అనుకుంటారు. కానీ.. అది త‌ప్ప‌ని చెబుతోంది బీబీసీ క‌థ‌నం. ఒక ర‌కం చింపాజీలైన బోనోబోలు.. గ‌ర్భ‌ధార‌ణ జ‌రిగే అవ‌కాశ‌మే లేదు. కానీ.. అవి సెక్స్ లో పాల్గొంటాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. ఆడ సింహాలు రోజుకు 50 సార్ల నుంచి వంద‌సార్ల వ‌ర‌కు.. అలా కొద్ది రోజులు మ‌గ సింహాల‌తో శృంగారంలో పాల్గొంటాయి. ఇట‌లీకి చెంది అల్ఫోన్సో ట్రోయిసీ.. మోనికా క‌రోసి అనే ఇద్ద‌రు రీసెర్చ్ నిపుణులు కోతుల్లో ఒక జాతి అయిన జ‌ప‌నీస్ మ‌కాక్ ల‌ను 238 గంట‌ల పాటు ప‌రిశీలించారు.ఆ స‌మ‌యంలో అవి 240 సార్లు శృంగారంలో పాల్గొన్న‌ట్లు గుర్తించారు. బీబీసీ క‌థ‌నాన్ని మ‌నిషిలోని స్వార్థం.. ప‌శువుల‌కు ఎన్ని బాధ‌ల్ని తెచ్చి పెడుతుందో ఇట్టే అర్థం కావ‌టం ఖాయం. మ‌నిషి.. మ‌రీ ఇంత ప‌శువా?