Begin typing your search above and press return to search.

మీడియా ప్ర‌శ్న‌కు ఉమా నీళ్లు నమిలేశారే!

By:  Tupaki Desk   |   21 Sep 2017 4:56 AM GMT
మీడియా ప్ర‌శ్న‌కు ఉమా నీళ్లు నమిలేశారే!
X
మైకుల ముందు వీర లెవెల్లో స్పీచులిచ్చే ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. వాస్త‌వాల‌ను క‌ప్పి పుచ్చి.. అవాస్త‌వాల‌ను వాస్త‌వాలుగా చిత్రీక‌రించడంలో ఆరితేరిపోయిన ఆయ‌న‌కు.. విలేక‌రులు సంధించిన ప్ర‌శ్న‌లు శ‌రాఘాతంలా మారిపోయాయి. కృష్ణాన‌దిలో - క‌ర‌క‌ట్ట‌ల లోప‌ల అక్ర‌మ నిర్మాణాల‌పై గ‌తంలో చేసిన వ్యాఖ్య‌లు.. ఇప్పుడు ఆయ‌న్ను ఇబ్బందుల్లో ప‌డేశాయి. అక్ర‌మ నిర్మాణాల‌పై య‌జ‌మానుల‌కు నోటీసు లివ్వ‌డంతో ఏపీ స‌ర్కారుకు ఊహించ‌ని షాక్ త‌గిలిన విష‌యం తెలిసిందే! ఇప్పుడు దీనిపై గ‌తంలో ఆవేశంగా మాట్లాడిన ఆయ‌న‌కు నోటమాట రావ‌డం లేదు.

హైకోర్టు నోటీసుల‌పై విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న గొంతులో వెల‌క్కాయ ప‌డినంత పనైంది. వారి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఏం చెప్పాలో తెలియ‌క.. ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. చివ‌ర‌కు స్ప‌ష్ట‌మైన స‌మాధానం చెప్ప‌కుండా నీళ్లు న‌మ‌లాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. న‌దుల ప‌రిర‌క్ష‌ణ అంటూనే ఆ న‌దుల‌ గ‌ర్భానికే ఏపీ పెద్ద‌లు తూట్లు పొడుస్తున్నారనే విమ‌ర్శలు గుప్పుమంటున్నాయి! స్వ‌యంగా సీఎం చంద్రబాబే.. కృష్ణాన‌దిలో క‌ర‌క‌ట్ట‌ల‌పై నిర్మించిన ఇంట్లో ఉంటూ.. నీతులు వ‌ల్లెవేస్తున్నార‌నే ఆరోప‌ణ లు వినిపిస్తున్నాయి. కృష్ణా నదిలో - కరకట్ట (గట్టు) లోపల అక్రమ నిర్మాణాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలు ఆయ‌న్ను ఇబ్బంది పెట్టాయి.

2014 డిసెంబర్‌ 31న జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కృష్ణా నదిలో పరిశీలనకు బోటులో వెళ్లి.. నదికి ఇరువైపులా కరకట్టల లోపల ఆక్రమణలు ఉన్నాయని, చివరకు కృష్ణమ్మను కూడా వదల్లేదని, ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉంటుందా అని మీడియా ఎదుట తారస్థాయిలో ఏకరువు పెట్టారు. ఆ మరుసటి రోజు (2015 జనవరి 1న) ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి.. కృష్ణా నదిలో ఆక్రమణలు దారుణమని - కాంగ్రెస్‌ వాళ్లు దేన్నీ వదిలిపెట్టరని, ఆక్రమణదారులను తాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తీవ్రంగా హెచ్చరించారు. తర్వాత ఆయనే ఉండవల్లిలోని కృష్ణానది ఒడ్డున ఉన్న లింగమనేని ఎస్టేట్‌ లో మకాం పెట్టారు.