Begin typing your search above and press return to search.

బాబాకు వ‌యాగ్రాతో పనేంటా అనుకుంద‌ట‌!

By:  Tupaki Desk   |   21 Sep 2017 10:47 AM GMT
బాబాకు వ‌యాగ్రాతో పనేంటా అనుకుంద‌ట‌!
X
డేరా బాబా.. ఇప్పుడు ఈ పేరు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది! ఆశ్ర‌మం ముసుగులో అతడు చేసిన అకృత్యాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌టికి వ‌స్తున్నాయ. ఇన్నాళ్లూ బాబాకు భ‌య‌ప‌డి బ‌య‌ప‌డ‌ని వాళ్లంతా.. ఇప్పుడు ఒక్కొక్క‌రు కెమెరాల ముందుకు వ‌స్తున్నారు. ఇప్పుడు ఈ డేరా బాబా అకృత్యాలు తెర‌పై చూసేందుకు సిద్ధంగా ఉండండి అంటోంది బాలీ వుడ్ బ్యూటీ, ఫైర్ బ్రాండ్ రాఖీ సావంత్‌!! ఆ బాబాపై సినిమా తీసే హ‌క్కు త‌న‌కు ఉంద‌ని చెబుతోంది! బాబా గురించి, అత‌డి కూతురు హ‌నీప్రీత్ గురించి, ఆశ్ర‌మంలో జ‌రుగుతున్న `చీక‌టి` వ్య‌వ‌హారాల గురించి రాఖీ సావంత్ సంచ‌న‌ల విష‌యాలు చెప్పింది. ఎన్నో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాలు కూడా బ‌య‌ట పెట్టింది!

బాలీవుడ్ ఐటెం భామ‌ రాఖీ సావంత్.. ఇప్పుడో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో న‌టిస్తోంది. జైల్లో ఉన్న డేరా బాబా గుర్మీత్ సింగ్, అతడి కూతురు హనీప్రీత్‌ ల బండారాన్ని తెర‌పై చూపించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమా పేరు 'అబ్ ఇన్సాఫ్ హోగా`. రాఖీ సావంత్ బ్ర‌ద‌ర్ రాకేష్ సావంత్ ఈసినిమాకి డైరెక్ష‌న్ చేస్తున్నాడు. ఢిల్లీలో ఈ బయోపిక్ షూటింగ్ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో గుర్మీత్ సింగ్‌ కు సంబంధించి కొన్ని 'నగ్న'సత్యాలను చెప్పి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. `గుర్మీత్ బాబా మీద బయోపిక్ తీయడానికి నాకు సెంట్ పర్సెంట్ అర్హత ఉందని నేను భావిస్తున్నా. ఎందుకంటే.. అతణ్ణి, అతడి చీకటి రాజ్యాన్ని దగ్గరినుంచి చూసిన అనుభవం నాకుంది` అని తెలిపింది.

ఈ వ్య‌వ‌హారానికి సంబంధించి రాఖీ ఏమ‌న్న‌దంటే... `బాబాను కలుద్దాం రమ్మని వాళ్ల‌ పీఏ నన్ను మారియట్ హోటల్‌ కి పిలిపించుకున్నాడు. సిర్సాలోని అతడి డెన్‌ లోకి కూడా నేను వెళ్లొచ్చా. అక్కడ వయాగ్రా పొట్లాలు ఉండడం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఒక సన్యాసికి - దైవాంశ సంభూతుడిగా చెప్పు కునే పెద్దమనిషికి వయాగ్రాతో పనేంటి.. అన్న సందేహం అప్పుడే కలిగింది. అక్కడే నిర్ణయించుకున్నా.. ఏదో ఒక రోజు వీడి కథ నేనే ప్రపంచానికి చెప్పేస్తానని` అని వివ‌రించింది రాఖీ! ఈ సినిమాలో తాను హ‌నీప్రీత్ రోల్ చేస్తోంది. జైలు ఊచల వెనుక రోధిస్తున్న డేరా బాబా తన సొంత కథను ఫ్లాష్ బ్యాక్‌ గా చెబుతున్న షాట్‌ తో సినిమా మొదల‌వుతుంద‌ట‌.