Begin typing your search above and press return to search.

బ్రేకింగ్‌: ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్ మృతి

By:  Tupaki Desk   |   20 July 2019 10:51 AM GMT
బ్రేకింగ్‌: ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్ మృతి
X
ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ శ‌నివారం మ‌ధ్యాహ్నం కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు తుది శ్వాస విడిచారు. ఢిల్లీ సీఎంగా ఏకధాటిగా 15 సంవత్సరాల పాటు ఆమె ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆమె వ‌య‌స్సు 81 సంవ‌త్స‌రాలు. షీలా 1938 మార్చి 31న పంజాబ్‌లోని క‌పుర్త‌లాలో జ‌న్మించారు.

కొద్ది రోజులుగా ఆమె అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కార‌ణంగానే ఆమె ఢిల్లీ పీసీసీ అధ్య‌క్షురాలిగా స్వ‌యంగా త‌ప్పుకున్నారు. 1998 నుంచి 2013 వ‌ర‌కు ఢిల్లీ ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసి భార‌తదేశ రాజ‌కీయ చ‌రిత్ర‌లోనే అరుదైన రికార్డు. ఓ మ‌హిళ ఏక‌ధాటిగా మూడు వ‌రుస ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి... 15 ఏళ్ల పాటు ముఖ్య‌మంత్రిగా ఉండ‌డం అంటే మామూలు విష‌యం కాదు.

తాజాగా జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోనూ ఆమె ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్య‌ర్థి మ‌నోజ్‌తివారీ చేతిలో ఓడిపోయారు. షీలా ఎంత గొప్ప మ‌నిషి అంటే ఎన్నిక‌ల్లో ఆమెపై గెలిచ‌న మ‌నోజ్ తివారి వెంట‌నే ఆమె ఇంటికి వెళ్లి పాదాభివంద‌నం చేసి ఆమె ఆశీర్వాదాలు తీసుకున్నారు. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన కామ‌న్‌వెల్త్ గేమ్స్ ఢిల్లీలో జ‌రిగిన‌ప్పుడు సీఎంగా ఉన్న షీలా ఎంతో కృషి చేసి వాటిని స‌క్సెస్ చేశారు. ఇందిరా గాంధీ కుటుంబానికి షీలాదీక్షిత్ అత్యంత సన్నిహితులు