Begin typing your search above and press return to search.

మోడీ గవర్నమెంటును దావూద్ కూల్చాలనుకుంటున్నాడా?

By:  Tupaki Desk   |   6 May 2016 10:19 AM GMT
మోడీ గవర్నమెంటును దావూద్ కూల్చాలనుకుంటున్నాడా?
X
మూడు దశాబ్దాల తరువాత ఇండియాలో ఏర్పడిన సుస్థిర ప్రభుత్వం ప్రస్తుత మోడీ ప్రభుత్వం. ప్రపంచమంతా దీనిపై హర్షం వ్యక్తం చేసింది. భారత ప్రజలు కూడా ఇది శుభపరిణామమే అనుకున్నారు.. కానీ... బ్రహ్మాండమైన మెజారిటీతో ఏర్పడిన ఈ సుస్థిర ప్రభుత్వాన్ని ఆస్థిరపరచేందుకు యత్నాలు జరిగాయట.

ఈ యత్నాలు చేసింది మరెవరో కాదు... 1993లో ముంబై బాంబు పేలుళ్ల వెనుక ఉన్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం. అవును... నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ వద్ద దీనికి సంబంధించిన బలమైన ఆధారాలు ఉన్నాయట. దీనిపై ఆ ఏజెన్సీ కోర్టులో ఛార్జిషీట్ కూడా వేయబోతోంది.

మోడీ గవర్నమెంటును అస్థిరపరచేందుకు దావూద్ తన డీ కంపెనీకి చెందిన 10 మంది కరుడుగట్టిన నేరగాళ్లను రంగంలోకి దించాడట. వీరి ప్లాను తెలిస్తే ఎవరైనా నోరెళ్ల బెట్టాల్సిందే. మోడీని, ఆయన మంత్రివర్గంలోని ముఖ్యలను టార్గెట్ చేస్తే విషయం తొందరగా బయటకొస్తుందని గుర్తించి.. అందుకు భిన్నంగా ఆరెస్సెస్ కీలక నేతలపై దాడులు చేసేందుకు పక్కా ప్రణాళిక రచించింది.

ఆరెస్సెస్ నేతలనే కాకుండా చర్చిలను కూడా లక్ష్యంగా ఎంచుకుని అల్లర్లు రేపాలన్నది వారి ప్లాన్. ఆ ప్లాను ఇప్పటికే వారు కొంతవరకు అమలు చేశారట. గత ఏడాది గుజరాత్ లో ఇద్దరు ఆరెస్సెస్ నేతలను పొట్టనబెట్టుకున్న దావూద్ ముఠాయేనని తేలింది. ఈ కేసులో ఆధారాలు సంపాదించిన జాతీయ భద్రత సంస్థ దీని వెనుక దావూద్ ఉన్నట్లు తేల్చి కోర్టులో ఛార్జిషీట్ మోపుతోంది. దేశవ్యాప్తంగా ఇదిప్పుడు చర్చనీయాంశంగా మారింది.