Begin typing your search above and press return to search.

యాకూబ్ అరెస్ట్ పై దావూద్ అలా అన్నాడా..?

By:  Tupaki Desk   |   1 Aug 2015 7:05 AM GMT
యాకూబ్ అరెస్ట్ పై దావూద్ అలా అన్నాడా..?
X
ముంబయి బాంబు పేలుళ్ల కేసులో 257 మంది మృతికి కారణమైన దోషి యాకూబ్ మెమన్ ను తాజాగా ఉరి తీయటం తెలిసిందే. అతనికి బాంబు పేలుళ్ల కేసులో పాత్ర ఏమీ లేదని.. అతను అమాయకుడని.. అతని అన్న టైగర్ మెమన్ అన్న చెప్పినట్లు చేశాడే తప్పించి ఎలాంటి తప్పు చేయలేదని వాదించే వారు చాలామందే ఉన్నారు.

ఈ కేసులో యాకూబ్.. టైగర్ లతో పాటు.. దావూద్ ఇబ్రహీంతో పాటు పలువురికి సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపణలు తెలిసిందే. ఇక..యాకూబ్ మెమన్ విషయంలో మరో విషయం ఉంది. అతను విదేశాల నుంచి వచ్చే సమయంలో.. భారత్ అధికారులతో చేసుకున్న ఒప్పందం కారణంగానే యాకూబ్ లొంగిపోయాడన్న వాదనను పలువురు వినిపిస్తున్నారు.

ఇందులో నిజం ఎంత ఉందన్న విషయాన్ని పక్కన పెడితే.. యాకూబ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భంగా ఒక ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా యాకూబ్ అరెస్ట్ గురించి స్పందించమని కోరినప్పుడు.. యాకూబ్ మెమన్ పట్టుబడింది నిజమేనా అని ప్రశ్నించి.. తాను చాలా సంతోషంగా ఉన్నానని.. ఇప్పటికైనా ఈ కేసు దర్యాఫ్తు సరైన ట్రాక్ లోకి వచ్చినందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సదరు పత్రిక అప్పట్లో ప్రచురించింది. తాజాగా.. యాకూబ్ ఉరి సందర్భంగా.. పాత కథానాన్ని దుమ్ము దులిపి వెలుగులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో పేలుళ్ల వ్యవహారంలో యాకూబ్ మెమన్ పాత్రను దావూద్ చెప్పకనే చెప్పారా? లేక.. అది కూడా ఒక వ్యూహమా అన్నది తేలాల్సి ఉంది.