Begin typing your search above and press return to search.

జగన్ అనుకున్నది సాధిస్తారన్న దాసరి

By:  Tupaki Desk   |   1 May 2016 10:08 AM GMT
జగన్ అనుకున్నది సాధిస్తారన్న దాసరి
X
ప్రఖ్యాత సినీ దర్శకులు.. మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా.. రాజకీయాలు.. బొగ్గు స్కాంలో తన మీద వచ్చిన ఆరోపణలు ఇలా పలు అంశాల మీద మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు పలువురి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

దాసరి చేసిన వ్యాఖ్యలు ఆయన నోటి మాటల్లోనే చూస్తే..

= జగన్మోహన్ రెడ్డి డైనమిక్ లీడర్. ఆయన అనుకున్నది సాధిస్తారు. వైఎస్ ఫ్యామిలీతో ఎప్పటి నుంచో సాన్నిహిత్యం ఉంది. జగన్ నన్ను కలిసింది అశీర్వాదం కోసమే తప్ప మరొకటి లేదు. జగన్.. నన్నుకలిసిన తర్వాత కాపు ఉద్యమం ప్రారంభమైందని చెప్పటం సరికాదు.

= కాపుల్ని బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు ఎన్నికల మేనిఫేస్టోలో పెట్టారు కాబట్టే ఈ అంశం తెరపైకి వచ్చింది. కాపుల రిజర్వేషన్ల కోసం జరుగుతున్న పోరాటానికి నా మద్ధతు ఉంటుంది. ఉద్యమానికి మద్దుతు ఇస్తున్నాను కాబట్టే.. దీక్ష చేసిన ముద్రగడను పరామర్శించేందుకు వెళ్లా.

= ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే. పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధాని హామీ ఇచ్చారు. ప్రధాని హోదాలో ఇచ్చిన మాటకు విలువ ఉంటుంది. ప్రధాని హోదాలో చెప్పిన మాటకు విలువ ఉండదని నేను అయితే అనుకోను.

= బొగ్గు కుంభకోణంలో నా మీద అనవసరంగా బురద జల్లుతున్నారు. ఈ స్కాం నుంచి 200 శాతం బయటపడతాననే నమ్మకం ఉంది. ఈ వ్యవహారంలో చాలామంది ప్రముఖులు ఉన్నారు. నేను సహాయమంత్రిని మాత్రమే. కేటాయింపుల్లో నిర్ణయాధికారం ప్రధానమంత్రికే ఉంటుంది.