వైసీపీలోకి 'దాసరి'

Thu Mar 14 2019 16:09:52 GMT+0530 (IST)

టాలీవుడ్ లో సీనియర్ దర్శకుడు అయిన దాసరి నారాయణ రావు కుమారుడు దాసరి అరుణ్ కుమార్ తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను కలిశారు. అనంతరం వైసీపీలో చేరుతున్నట్టు మీడియాకు తెలిపారు. వైసీపీ సిద్ధాంతాలు  - ఆశయాలు నచ్చి పార్టీలో చేరానని.. జగన్ ఆదేశిస్తే ప్రచారం చేస్తానని చెప్పుకొచ్చాడు. మానాన్న దాసరి నారాయణ రావు ఉండుంటే వైసీపీ నుంచి పోటీచేసేవారని తెలిపారు.ఏపీలోని ప్రతిపక్ష పార్టీకి టాలీవుడ్ సినీ పరిశ్రమ నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే పోసాని - కృష్ణ భగవాన్ వైసీపీలో చేరగా.. ఇటీవలే హాస్యనటులు అలీ - కృష్ణుడు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు టాలీవుడ్ గర్వించే దిగ్గజ దర్శకుడు దాసరి కుమారుడు వైసీపీకి మద్దతుగా ప్రచారానికి ముందుకు రావడం విశేషం.

దాసరి నారాయణ రావు.. వైఎస్ హయాంలో కేంద్రంలో మంత్రిగా చేశారు. కాంగ్రెస్ లో వెలుగు వెలిగారు. ఆ తర్వాత మరణించే వరకూ కూడా కాంగ్రెస్ లోనే కొనసాగారు. ఇప్పుడు ఆయన కుమారుడు వైసీపీ బాట పట్టడం విశేషం.