Begin typing your search above and press return to search.

జనవరి 23 బుధవారం 2019 దినఫలాలు

By:  Tupaki Desk   |   23 Jan 2019 1:30 AM GMT
జనవరి 23 బుధవారం 2019 దినఫలాలు
X
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి నిరాశగా ఉంటుంది. కొన్ని విషయాల్లో మానసిక ఆందోళన తప్పదు. పట్టుదలతో వ్యవహారాలను పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్ వారికి ఒడిదుడుకులు. వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కడం కష్టమే. ఐటీ ఉద్యోగులకు చికాకులు. రాజకీయ - పారిశ్రామిక వేత్తలు ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థుల యత్నాల్లో అవాంతరాలు ఎదురవుతాయి. మహిళలకు కుటుంబంలో సమస్యలు. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

వ‌ృషభ రాశి: ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఎంత కష్టించినా ఫలితం ఉండదు. కుటుంబ సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తారు. వ్యూహాల అమలులో విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ వారికి ఇబ్బందులు తప్పవు. వ్యాపార లావాదేవీలు ముందుకు సాగవు. ఉద్యోగులకు అనుకోని మార్పులు. ఐటీ ఉద్యోగులకు గందరగోళ పరిస్థితులు. పారిశ్రామిక - వైద్య రంగాల వారికి ఒత్తిడులు. విద్యార్థుల శ్రమ ఫలించదు. మహిళలకు కుటుంబ సభ్యులతో తగాదాలు. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.

మిథున రాశి: ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. పనులు చాకచాక్యంగా పూర్తి చేస్తారు. ప్రత్యర్థులు మీపట్ల ఆకర్షితులవుతారు. భూ, గృహయోగాలున్నాయి. ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించండి. నిరుద్యోగులు ఆశలు నిజం చేసుకుంటారు. రియల్ ఎస్టేట్ వారి అంచనాలు తారుమారవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు. ఐటీ ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు అవకాశాలు అవకాశాలు దక్కించుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. మహిళలకు సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. శివుడిని పూజించడం మంచిది.

కర్కాటక రాశి: కుటుంబ సమస్యలు వేధిస్తాయి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాపరుస్తాయి. ఉద్యోగయత్నాల్లో ఇబ్బందులు. ఆస్తి వ్యవహరాలు కొంత సానుకూలమవుతాయి. వ్యాపారాలు అటుపోట్లు తప్పవు. రియల్ ఎస్టేట్ వారికి సాధారణంగా ఉంటుంది. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులుంటాయి. పారిశ్రామిక, రాజకీయవర్గాల వారికి నిరుత్సాహంగా ఉంటుంది. ఐటీ ఉద్యోగులకు ఒత్తిడులు. విద్యార్థులకు నిరాశాజనకం. మహిళలకు కుటుంబంలో చికాకులు. నవగ్రహ స్తోత్రాలు పఠించడం మంచిది.

సింహ రాశి: ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో చికాకులు ఎదురవుతాయి. వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామిక, రాజకీయవర్గాల వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. ఐటీ ఉద్యోగులకు అనుకోని ఆహ్వానాలు. విద్యార్థుల నూతన అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు శుభ సమాచారం అందుతుంది. సుబ్రహ్మణ్వేశ్వరుడిని పూజించడం మంచిది.

కన్యారాశి: ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు. ఇంటాబయటా ఒత్తిడులు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. చిరకాల మిత్రులు ప్రత్యర్థులుగా మారతారు. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు. వ్యాపారులకు ఒడిదుడుకులు తప్పవు. ఉద్యోగాల్లో మార్పులు ఉండవచ్చు. రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు నిరుత్సాహం. ఐటీ ఉద్యోగులకు కొన్ని ఇబ్బందులు తప్పవు. విద్యార్థుల అంచనాలు తప్పుతాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు. వినాయకుడిని పూజించడం మంచిది.

తులారాశి: జీవితాశయం నెరవేరుతుంది. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. వాహనాలు, స్థలాలు కొంటారు. అనుకున్నది సాధించాలన్న తపన పెరుగుతుంది. మీ సత్తా చాటుకొని ముందుకు సాగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. రియల్ ఎస్టేట్, కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాల్లో చికాకులు తొలగి ముందుకు సాగుతారు. పారిశ్రామిక రంగం వారికి కార్యజయం. ఐటీ నిపుణులకు శుభ సమాచారం అందుతుంది. విద్యార్థులకు సాంకేతిక అవకాశాలు దక్కుతాయి. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.

వృశ్చిక రాశి: విలువైన వస్తువులను సేకరిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు. ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. ఆత్మీయులు, బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. రియల్ ఎస్టేట్ వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ ఆహ్వానాలు. ఐటీ నిపుణులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. విద్యార్థులు లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతారు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి సాయం అందుతుంది. విష్ణుసహస్రనామ పారాయణం చేయడం మంచిది.

ధనస్సు రాశి: ఇంటాబయటా సమస్యలు. బంధువర్గంతో వివాదాలు నెలకొంటాయి. చేపట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం. రియల్ ఎస్టేట్ వారిక అంచనాలు తప్పుతాయి. పారిశ్రామికవర్గాల వారికి వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. విద్యార్థులకు నిరాశాజనకం. ఐటీ ఉద్యోగులు ఆచితూచి వ్యవహరించాలి. మహిళలు తొందపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. సుబ్రహ్మణ్వేశురుడిని పూజించడం మంచిది.

మకర రాశి: ఆదాయం తగ్గుతుంది. వ్యయప్రయాసలు తప్పవు. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఒక సమాచారం ఊరటనిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి గందరగోళ పరిస్థితి. ఉద్యోగులకు అదనపు పనిభారం. పారిశ్రామిక, వైద్య రంగాల వారికి ఒత్తిడులు. ఐటీ ఉద్యోగులకు సమస్యలు. విద్యార్థులకు ఫలితాల్లో నిరాశ. మహిళలకు అనారోగ్య సూచనలు. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

కుంభరాశి: ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు. ఆప్తులతో వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు ఎదురవుతాయి. రియల్ ఎస్టేట్ వారికి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు విదేశీయానం. ఐటీ నిపుణులకు విశేష ప్రగతి లభిస్తుంది. విద్యార్థులకు సాంకేతిక, పరిశోధనల్లో అవకాశాలు కలిసివస్తాయి. మహిళలకు శుభ సమాచారం అందుతుంది. వేంకటేశ్వరస్వామిని పూజించడం మంచిది.

మీనరాశి: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు సహాయం అందిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి భూలాభాలు కలుగుతాయి. వ్యాపారాలు పురోగతి సాధిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఐటీ నిపుణుల యత్నాలు ఫలిస్తాయి. గతంలోని సంఘనలు గుర్తుకొస్తాయి. విద్యార్థుల అంచనాలు నిజమవుతాయి. మహిళలకు భూ - గృహయోగాలు కలిసివస్తాయి. విష్ణుసహస్రనామ పారాయణం పఠించడం మంచిది.