జనవరి 21 సోమవారం 2019 దినఫలాలు

Mon Jan 21 2019 07:00:00 GMT+0530 (IST)

గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.మేష రాశి: మిత్రులతో కలహాలు నెలకొంటాయి. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఉద్యోగులకు బదిలీ అవకాశాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు బదిలీ అవకాశాలు. పారిశ్రామిక రాజకీయవర్గాలకు ఒడిదుడుకులు. ఐటీ నిపుణులకు చికాకులు. విద్యార్థులకు నిరుత్సాహం. మహిళలకు కుటుంబంలో మాటపట్టింపులు. దత్తాత్రేయుడిని పూజించడం మంచిది.

వృషభ రాశి: రాబడి ఆశించినస్థాయిలో ఉంటుంది. బంధువర్గం నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు. ఆలోచనలు అమలు చేస్తారు. రియల్టర్లు స్థిరాస్థి లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామిక కళారంగాల వారికి యోగదాయకమైన కాలం. ఐటీ నిపుణులకు సంతోషకరమైన సమాచారం. విద్యార్థులకు ఉత్సాహంగా ఉంటుంది. మహిళలకు శుభవార్తలు. కుజగ్రహ స్తోత్రాలు పఠించండి.
 
మిథున రాశి: ఆదాయం అంతగా ఉండదు. వ్యవహారాలు మందగిస్తాయి. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. రియల్ ఎస్టేట్ వారు నిరాశ చెందుతారు. వ్యాపారాల్లో ఆటుపోట్లు చికాకు పరుస్తాయి. ఉద్యోగులకు స్థానచలనం. పారిశ్రామిక రాజకీయవర్గాలకు కొంత నిరుత్సాహం తప్పదు. విద్యార్థులకు నిరుత్సాహం. మహిళలకు ఆస్తి వివాదాలు. దుర్గాదేవీని పూజించడం మంచిది.

కర్కాటక రాశి: ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. రియల్టర్లు కాంట్రాక్టర్లు మరింత శ్రమించాలి. వ్యాపారాల్లో అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగులకు హోదా సూచనలు. రాజకీయ కళారంగాల వారికి కలిసొచ్చేకాలం. కొందరికీ పదవీ యోగం. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు దక్కుతాయి. ఐటీ ఉద్యోగులకు గందరగోళంగా ఉంటుంది. మహిళలకు శుభసమాచారం అందుతుంది. శివ పంచాక్షరి పఠించడం మంచిది.

సింహ రాశి: ఆదాయం తగ్గుతుంది. బంధువర్గం కలహా సూచనలు. రియల్టర్లు నిదానంగా వ్యవహరించాలి. ఉద్యోగులకు అదనపు పనిభారం. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. పారిశ్రామిక రాజకీయ వర్గాలకు ఒత్తిడులు. ఐటీ నిపుణులకు అంతగా అనుకూలించదు. దేవాలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి. మహిళలకు మానసిక అశాంతి. సుబ్రహ్మణ్వేశ్వర స్వామిని పూజించడం మంచిది.

కన్యారాశి: రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. శుభకార్యాల్లో పాల్లొంటారు. వాహనాలు స్థలాలు కొంటారు. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామిక రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఐటీ ఉద్యోగులకు మరిన్ని అవకాశాలు దక్కుతాయి. విద్యార్థులకు పరిశోధనలు అనుకూలిస్తాయి. మహిళలకు ఆస్తి వివాదాల నుంచి విముక్తి. దత్తాత్రేయుడి స్తోత్రాలు పఠించండి.

తులారాశి: పనుల్లో పురోగతి కనిపిస్తుంది. సంఘంలో గౌరవం పొందుతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాల్లో అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయ కళారంగాల వారికి సన్మానాలు. నూతన ఉద్యోగయోగం. విద్యార్థులకు అనుకూలకాలం. మహిళలు విజయాల బాటలో పయనిస్తాయి. లక్ష్మీ స్తోత్రాలు పఠించండి మంచిది.

వృశ్చిక రాశి: ఆదాయం సంతృప్తికరం. బంధుమిత్రులతో విరోధాలు. ఆరోగ్య సమస్యలు. ఆదాయం నిరుత్సాహపరుస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి గందరగోళ పరిస్థితి. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు. రాజకీయ పారిశ్రామికవర్గాల వారికి విదేశీ పర్యటనలు రద్దు. ఐటీ నిపుణులకు కొన్ని వివాదాలు తప్పవు. విద్యార్థులు శ్రమిస్తే మంచి ఫలితాలు వస్తాయి. మహిళలకు నిరాశ తప్పదు. కనకధార స్తోత్రాలు పఠించడం మంచిది.

ధనస్సు రాశి: వివాదాలకు దూరంగా ఉండండి. బంధువుల తోడ్పాటు అంతగా ఉండదు. ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు. రియల్ ఎస్టేట్ వారికి శ్రమ వృథా కాగలదు. వ్యాపారాల్లో లాభాలు కష్ట సాధ్యమే. ఉద్యోగులకు బదిలీ అవకాశాలు. పారిశ్రామిక కళారంగాల వారికి అవకాశాలు చేజారుతాయి. ఐటీ ఉద్యోగులకు సమస్యలు. విద్యార్థులు ఆచితూచి వ్యవహరించాలి. మహిళలకు కుటుంబ సమస్యలు. హయగ్రీవ స్తోత్రాలు పఠించడం మంచిది.

మకర రాశి: ప్రముఖులతో పరిచయాలు. నూతన విద్య ఉద్యోగావకాశాలు. నూతన కార్యక్రమాలు చేపడుతారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు. రియల్ ఎస్టేట్ వారికి కొత్త ఆశలు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయ కళారంగల వారికి ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. విద్యార్థులకు పరిశోధనలు గుర్తింపు వస్తుంది. ఐటీ నిపుణులకు పురస్కారాలు దక్కుతాయి. మహిళలకు గృహ వాహన యోగాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిది.

కుంభరాశి: ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఇంటి నిర్మాణాలు చేపడుతారు. వేడుకల్లో పాల్గొంటారు. ఆలోచనలు అమలు చేస్తారు. రియల్ ఎస్టేట్ వారికి ఆటుపోట్లు. వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు శుభ సమాచారం. రాబడి పెరుగుతుంది. ఐటీ ఉద్యోగులకు చికాకులు. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. మహిళలకు నూతనోత్సాహం. శ్రీరామ స్తో్త్రాలు పఠించడం మంచిది.

మీనరాశి: బంధువులను కలుసుకుంటారు. రియల్ ఎస్టేట్ వారికి వివాదాలు. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. కష్టానికి తగిన ఫలితం ఉండదు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఐటీ నిపుణులకు నిరుత్సాహం. విద్యార్థులకు అసంతృప్తి. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదురవుతాయి. మహిళలకు కుటుంబలో సమస్యలు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం మంచిది.