Begin typing your search above and press return to search.

జనవరి 17 గురువారం 2019 దినఫలాలు

By:  Tupaki Desk   |   17 Jan 2019 1:50 AM GMT
జనవరి  17 గురువారం 2019 దినఫలాలు
X
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి, గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..

మేషరాశి : ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తుతాయి. వ్యాపారులకు లాభాలు కనిపించవు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అగ్రిమెంట్లు రద్దు చేసుకుంటారు. కాంట్రాక్టర్లకు కొంత నిరుత్సాహం ఉంటుంది. సోదరులు, మిత్రులతో గొడవలు తలెత్తుతాయి. ఉద్యోగులకు మార్పులు సంభవిస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉండదు. ఐటీ రంగం వారికి ఆశించిన ఫలాలు రాకపోవచ్చు. కళాకారులు, రాజకీయ వర్గాల పర్యటనలు వాయిదా పడతాయి. మహిళల ఆశలు నెవేరవు. ఈ రాశివారికి అదృష్ట రంగులు..పసుపు, తెలుపు. వినాయకుడిని పూజిస్తే మంచిది.

వృషభరాశి: అన్ని రంగాలవారికి కొంత అనుకూలంగా ఉంటుంది. పనులు సజావుగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. బంధువుల నుంచి ఆస్తి లభించే అవకాశం ఉంది. రుణదాతలు ఒత్తిడిని అధిగమిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంవారిలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. వ్యాపారాల విస్తరణ లాభం చేకూరుస్తుంది. చిన్ననాటి స్మృతులు గుర్తుకొస్తాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది. పారిశ్రామిక రాజకీయరంగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ఐటీ నిపుణులకు నూతన అవకాశాలు చేజిక్కుతాయి. మహిళల్లో కొత్త ఉత్సాహం నెలకొంటుంది. విద్యార్థులకు నూతన అవకాశాలు వస్తాయి. షేర్లు అనుకోని లాభం తెచ్చి పెడతాయి. అదృష్ట రంగులు... ఆకుపచ్చ, గులాబీ. ఈ రాశివారు ఆదిత్య హృదయం చదవాలి.

మిథునరాశి: ఈ రాశివారికి ఆశించిన ఫలితాలు కనిపించవు. కొంత అశాంతి నెలకొంటుంది. పనులు మధ్యలో ఆపేస్తారు. ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆస్తివ్యవహారాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. మిత్రులతో విభేదాలు. రాబడి పెద్దగా ఉండదు. వ్యాపారాలు మామూలుగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు అదనపు పనిభారం మీదపడుతుంది. పారి శ్రామిక, రాజకీయ వర్గాల వారికి అనుకూలంగా ఉండదు. ఐటీ నిపుణులకు సమస్యలు ఎదురవుతాయి. షేర్ మార్కెట్ అనుకూలించదు. మహిళలకు మానసిక ప్రశాంతత కరువవుతుంది. అదృష్ట రంగులు-గులాబీ, నీలం. విష్ణు సహస్రనామ పారాయణం శుభాన్నిస్తుంది.

కర్కాటక రాశి: ఆర్థికంగా కలిసివస్తుంది. సభలు సమావేశాలకు హాజరవుతారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. సోదరులు, మిత్రుల్లో ఉత్సాహం నెలకొంటుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారులకు ఆశించిన లాభాలు దక్కుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి కొత్త అగ్రిమెంట్లు జరుగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాజకీయ,కళారంగాలకు అవకాశాలు. ఐటీ రంగం వారికి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు సాంకేతిక విద్యవకాశాలు ఉన్నాయి. మహిళలకు ఆస్తి లభించే అవకాశం ఉంది. షేర్ మార్కెట్ లో అనుకున్న లాభం వస్తుంది.
అదృష్ట రంగులు: కాఫీ - గులాబీ - వేంకటేశ్వరుడిని పూజించాలి

సింహరాశి : ఆదాయం సంతృప్తినిస్తుంది. రుణదాతల నుంచి ఒత్తిడి తప్పదు. పనుల్లో జాప్యం నెలకొంటుంది. కుటుంబంలో శుభకార్యలు, బంధువులతో సఖ్యత ఉంటుంది. ప్రయత్నాలకు అనుకూలం. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. రియల్ ఎస్టేట్ రంగంవారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు హోదా దక్కుతుంది. దీంతోపాటు పనిభారం కూడా పెరుగుతుంది. రాజకీయవర్గాలకు మంచి రోజు. ఐటీ నిపుణులకు ప్రోత్సాహకంగా ఉంటుంది. మహిళలు ఆనందకరమైన వార్తలు వింటారు. షేర్ల విక్రయం లాభం చేకూరుస్తుంది. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు లభిస్తాయి. అదృష్టరంగులు: తెలుపు - కాఫీ. దత్తాత్రేయుని పూజించాలి.

కన్య రాశి: రాబడి కంటే ఖర్చులు ఎక్కువ ఉంటాయి. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. కుంటుంబంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. అనారోగ్యానికి గురవుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. రియల్ ఎస్టేట్ రంగం వారి శ్రమకు ప్రతిఫలం లభించదు. వ్యాపారులకు ఒడిదుడుకులు తప్పవు. రాజకీయ నేతలు - కళాకారులకు నిరాశజనకం. ఉద్యోగులకు స్థాన చలనం. ఐటీ నిపుణులకు ఒత్తిడి ఎదురవుతుంది. విద్యార్థులు అవకాశాలను చేజార్చుకుంటారు. కుటుంబ సమస్యలు మహిళలను చికాకుపరుస్తాయి. షేర్లు కలిసిరావు.అదృష్ట రంగులు-కాఫీ - తెలుపు. గణపతిని పూజించాలి.

తులారాశి: రాబడి తగ్గుతుంది. వ్యయప్రయాసలు ఎదుర్కొంటారు. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు తప్పవు. శారీరక రుగ్మతలు - బంధువులతో తగాదాలు నెలకొంటాయి. వ్యాపారాల్లో చలనం కనిపించదు. రియల్ ఎస్టేట్ రంగం వారి పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. పని ఒత్తిడి ఉద్యోగులను చికాకుకు గురి చేస్తుంది. రాజకీయ - పారిశ్రామిక వర్గాలకు నిరాశ ఎదురవుతుంది. మహిళలకు కుటుంబ సమస్యలు పెరుగుతాయి. ఐటీ నిపుణులకు శ్రమ ఎక్కువవుతుంది. విద్యార్థులు అవకాశాలు చేజార్చుకుంటారు. షేర్ల విక్రయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అదృష్టరంగులు-ఆకుపచ్చ - నలుపు. విష్ణు సహస్రనామ పారాయణం మంచిది.

వృశ్చికరాశి: ఆర్థికపరంగా బాగుంటుంది. కొన్ని సంఘటనలు సంతృప్తినిస్తాయి. దూరమైన ఆప్తులు దగ్గరవుతారు. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. శుభకార్యాలకు ఖర్చు చేస్తారు. రాజకీయనేతలు, కళాకారులకు సన్మానాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారి గొడవలు కొలిక్కివస్తాయి. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. ఐటీ నిపుణులకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కుటుంబాల్లో మహిళల గౌరవం రెట్టింపవుతుంది. షేర్ మార్కెట్ లాభదాయకంగా ఉంటుంది. అదృష్టరంగులు-గులాబీ - ఎరుపు. హనుమాన్ చాలీసా చదవాలి.

ధనస్సురాశి: అన్ని వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆస్తుల విషయంలో కొత్తగా అగ్రిమెంట్లు చేసుకుంటారు. గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగంవారికి చిక్కలు దూరమవుతాయి. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. రాజకీయ - కళారంగంవారికి విదేశీయానం ఉంది. ఐటీ నిపుణులు విజయం సాధిస్తారు. విద్యార్థులను కొత్త అవకాశాలు వెతుక్కంటూ వస్తాయి. షేర్ల విక్రయాల్లో లాభం చేకూరుతుంది. మహిళలు శుభవార్తలు వింటారు. అదృష్టరంగులు-ఆకుపచ్చ - నీలం. హయగ్రీవస్తోత్రాలు పఠించాలి

మకరరాశి: రాబడి తగ్గుతుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆరోగ్య - కుటుంబ సమస్యలు వేధిస్తాయి. ముఖ్యమైన పనుల్లో అడ్డంకులు ఎదురవుతాయి. వ్యాపారంలో చికాకులు తలెత్తుతాయి. రియల్ ఎస్టేట్ రంగంవారు ఆటంకాలు ఎదుర్కొంటారు. ఉద్యోగులకు ఊహించని బదిలీలు ఉంటాయి. పారిశ్రామిక - రాజకీయ వేత్తలు - కళాకారులకు సామాన్యంగా ఉంటుంది. ఐటీ నిపుణులకు ఆశించిన ఫలితాలు ఉండవు. విద్యార్థులు లక్ష్యాన్ని చేరుకోవాలంటే శ్రమించాలి. మహిళలు మానసిక ఆందోళనకు గురవుతారు. షేర్ మార్కెట్ లాభదాయకంగా ఉండదు. అదృష్టరంగులు - లేత ఎరుపు, పసుపు
సుబ్రహ్మణ్యాష్టకం చదవాలి.

కుంభరాశి: కొంత మానసిక ఆశాంతి నెలకొంటుంది. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. పనులు మందకొడిగా సాగుతాయి. గొడవలు చికాకు పెడతాయి. శారీరక రుగ్మతలు వేధిస్తాయి. ఆలయాలను దర్శించుకుంటారు. వ్యాపారాలు నిరాశకు గురి చేస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగులకు స్థానచలనం ఉంటుంది. కళాకారులు, రాజకీయవేత్తలకు నిరాశజనకంగా గడుస్తుంది. ఐటీ నిపుణుల శ్రమ వృథా అవుతుంది. మహిళలకు సోదరులతో గొడవలు తలెత్తుతాయి. విద్యార్థులకు ఆశాజనకంగా లేదు. షేర్ మార్కెట్ మందగిస్తుంది. అదృష్టరంగలు-తెలుపు, బంగారు ఆదిత్య హృదయం పఠించండి.

మీన రాశి: ఆర్థికపరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కొత్త ఉత్సాహం నెలకొంటుంది. పనులు వేగంగా పూర్తవుతాయి. ఇన్నాళ్లు ప్రత్యర్థులుగా ఉన్నవారు మిత్రులవుతారు. అనుకోని ఆహ్వానాలు అందుకుంటారు. భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంది. గృహ నిర్మాణాలు అనుకూలంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఇబ్బందులు తొలుగుతాయి. వ్యాపారాలు కలిసి వస్తాయి. రాజకీయనేతలు, కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు ప్రశంసలు అందుకుంటారు. ఐటీ నిపుణులకు ప్రోత్సాహం లభిస్తుంది. మహిళల్లో నూతనోత్సాహం నెలకొంటుంది. షేర్ మార్కెట్ లో లాభాలు వస్తాయి. అదృష్టరంగులు-పసుపు, ఎరుపు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి.