జనవరి 13 ఆదివారం 2019 దినఫలాలు

Sun Jan 13 2019 09:38:25 GMT+0530 (IST)

గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి: పనులు అనుకూలించవు. అప్పులు కోసం చూస్తారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. భూవివాదాలు చికాకు పరుస్తాయి. రియల్ ఎస్టేట్ ల వారికి సమస్యలు. వ్యాపార విస్తరణ యత్నాలు సాగవు. ఉద్యోగులకు ఒత్తిడులు. పారిశ్రామిక కళారంగాల వారికి వ్యవహారాలు నత్తడనకన సాగుతాయి. ఐటీ నిపుణులకు నిరుత్సాహం.  విద్యార్థులకు ఒత్తిడులు. మహిళలకు కొంత నిరాశ. మహిళలకు నిరాశ. విష్ణు సహస్రనామా పారాయణ చేస్తే మంచిది.వృషభరాశి: ఆర్థిక విషయాల్లో ఆశజనకం. రుణబాధలు తొలుగుతాయి. కోర్టు వ్యవహారాలతో చికాకులు.  రియల్ ఎస్టేట్ వారికి అనుకూలం. వ్యాపారాలు లాభాసాటి. ఉద్యోగులకు పదోన్నతలు. రాజకీయ కళారంగాల వారికి సన్మానం. ఐటీ నిపుణులకు చిక్కులు. విద్యార్థులకు అనుకున్న అవకాశాలు. మహిళలకు సంతోషకరమైన వార్తలు. వినాయక స్తోత్రాలు పఠిస్తే మంచిది.

మిథునరాశి: రాబడి పెరిగి అవసరాలు తీరుతాయి. రియల్ ఎస్టేట్ వారికి ఆశావాహకంగా ఉంటుంది. వ్యాపారాలు విస్తరణ యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు ఊహించని ఇంక్రిమెంట్లు. రాజకీయ కళారంగాల వారు విదేశీ ఆహ్వానాలు అందుతాయి. ఐటీ నిపుణులకు సన్మానాలు. విద్యార్థులు మహిళలకు ఉత్సాహంగా గడుస్తుంది.  శ్రీరామరక్షా స్తోత్రాలు పఠిస్తే మంచిది.

కర్కాటక రాశి: కుటుంబ సమస్యలు చికాకులు పరుస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి ఒడిదుడుకులు. వ్యాపార లావాదేవీలు నిరాశ. ఉద్యోగులకు మార్పులు. రాజకీయ కళారంగాల వారికి మానసిక ఆందోళన. ఐటీ నిపుణులకు కొత్త సమస్యలు. విద్యార్థులకు ఒత్తిడులు. మహిళలకు కుటుంబంలో చికాకులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠిస్తే పఠించండి..

సింహరాశి: ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. బంధువర్గంతో విభేదాలు. దూర ప్రయాణాలు ఉంటాయి. నేత్ర సంబంధిత రుగ్మతలు. రియల్ ఎస్టేట్ వారికి అంచనాలు తారుమారు. వ్యాపారులకు సామాన్యం. ఉద్యోగులకు పనిభారం. రాజకీయ కళారంగాల వారికి విదేశీ పర్యటనలు.  ఐటీ నిపుణులకు కొన్ని ఇబ్బందులు. విద్యార్థులకు విద్యావకాశాలు. మహిళలకు నిరుత్సాహం. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.

కన్యరాశి: ఉద్యోగ యత్నాల్లో విజయం. ఆదాయం సంతృప్తికరం. రియల్ ఎస్టేట్ వారికి కొత్త ఆశలు. వ్యాపారులు పెట్టుబడులతో ఉత్సాహం. ఉద్యోగాల్లో పదోన్నతి. రాజకీయ కళారంగాల వారికి ప్రోత్సాహకరం. ఐటీ నిపుణులకు సంతోషకరం.. విద్యార్థులకు ఒక ప్రకటనతో సంతోషనిస్తుంది. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం. హనుమాన్ పఠిస్తే మంచిది.

తులరాశి: నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. కాంట్రాక్టులు లాభిస్తాయి. వ్యాపారాల్లో చికాకులు. లాభాలొస్తాయి. ఉద్యోగులకు ఉత్సాహభరితం. రాజకీయ కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులకు నూతనోత్సాహం. విద్యార్థులు అవకాశాలు లభిస్తాయి. మహిళలకు నూతనోత్సాహం. గణేష్టాకం పఠిస్తే మంచిది.

వృశ్చికరాశి: కుటుంబంలో చికాకులు. ఆరోగ్యం మందగిస్తుంది. విలువైన వస్తువులు భద్రం.. దూర ప్రయాణాలు సంభవం.  ఇంటర్వ్యూలు నిరాశ కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి నిరుత్సాహం. ఉద్యోగులకు ఒత్తిడులు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. పారిశ్రామిక కళారంగాల వారికి శ్రమతో నిరుత్సాహం. ఐటీ నిపుణులకు అంతగా అనుకూలించదు. విద్యార్థులకు ఒత్తిడులు. మహిళలకు ఆరోగ్య భంగం. విష్ణు ధ్యానం చేస్తే మంచింది.

ధనస్సురాశి: రియల్టర్ల యత్నాలు విఫలం. వ్యాపారాలు నత్తనడకన. ఉద్యోగవర్గాలకు కొత్త బాధ్యతలు. పారిశామ్రిక కళారంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడుతాయి. ఐటీ నిపుణులకు చిక్కులు. విద్యార్థులకు కష్టపడ్డా ఫలితం కనిపించదు. మహిళలకు ఆకస్మిక దూర ప్రయాణాలు. హయగ్రీయ స్తోత్రాలు పఠిస్తే మంచింది.

మకరరాశి: ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు సంభవం.  కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపార విస్తరణ యత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగులకు ఉన్నత స్థాయి నుంచి సహకారం. రాజకీయ కళారంగాల వారికి యోగదాయకమైన కాలం. ఐటీ నిపుణులకు కొత్త అవకాాలు. మహిళలకు మానసిక ప్రశాంతత. విద్యార్థులకు మరిన్ని విజయాలు..అంగారక స్తోత్రాలు పఠిస్తే మంచిది.

కుంభరాశి: రాబడి తగ్గుతుంది. కాంట్రాక్టులు చేజారుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. రియల్ ఎస్టేట్ ల వారికి గందరగోళం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. పారిశ్రామిక రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు విదేశీ పర్యటనలు వాయిదా. విద్యార్థులకు కృషి ఫలించదు. మహిళలకు ఆరోగ్య భంగం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

మీనరాశి: రావలసిన మొత్తాలు అవసరాలు తీరుతాయి. ఆలయాలు సందర్శన. రియల్ ఎస్టేట్ ల వారికి అనుకున్న విజయాలు. భాగస్వామ్య వ్యాపారాల్లో ముందుడుగు వేస్తారు. ఉద్యోగులకు పదోన్నతలు. పారిశ్రామిక రాజకీయ వర్గాలకు విదేశీయానం. ఐటీ నిపుణులకు మరింత ఉత్సాహం. విద్యార్థులకు కృషి ఫలించి ఉత్సాహంతో ఉంటారు. మహిళలకు అంచనాలు నిజమవుతాయి. ఆదిత్య హృదయం పాఠిస్తే మంచిది.