Begin typing your search above and press return to search.

నవంబర్ 18 ఆదివారం 2018 దినఫలాలు

By:  Tupaki Desk   |   18 Nov 2018 1:31 AM GMT
నవంబర్ 18 ఆదివారం 2018 దినఫలాలు
X
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారనే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..

మేష రాశి: వాహనాల విషయంలో జాగ్రత్తలు పాటించండి. తప్పనిసరి పరిస్థితిలో రుణాలు చేస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగస్థులకు పనిభారం. రాజకీయ, కళారంగాల వారికి నిరాశ ఎదురవుతుంది. విద్యార్థులకు అసంతృప్తి. మహిళలకు నిరాశ కలుగుతుంది. ఆదిత్య హృదయం పఠించండి.

వ‌ృషభరాశి: సోదరులు, మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విలువైన వస్తువులు కొంటారు. కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడుతారు. ఉద్యోగాలు లక్ష్య సాధన దిశగా ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులకు, రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి పురస్కారాలు లభిస్తాయి. మహిళలకు సంతోషకరమైన వార్తలు. గణపతిని పూజించండి.

మిథున రాశి: కొత్త పనులకు శ్రీకారంచుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకం. ఉద్యోగస్థులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామిక, కళారంగాల వారికి సన్మానాలు. విద్యార్థులు నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మహిళలకు ఆస్థిలాభం. నరసింహస్వామిని పూజించాలి.

కర్కాటక రాశి: వ్యయప్రయసలు తప్పవు. మానసిక ఆందోళనలు. కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి. ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండదు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాల్లో మెలకువలు అవసరం. ఉద్యోగులకు అదనపు పనిభారం. విద్యార్థులకు ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడుతాయి. వేంకటేశ్వర స్వామిని పూజించండి.

సింహ రాశి: మిత్రులతో కలహాలు. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. అనుకోని ఖర్చులు. పనులు వాయిదా పడుతాయి. నేత్ర సంబంధ రుగ్మతలు. రాబడి తగ్గి రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామిక, రాజకీయ రంగాల వారికి అనుకోని విదేశీయానం. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. మహిళలకు నిరాశ ఎదురవుతుంది. సత్యనారాయణ స్వామిని పూజించండి.

కన్యారాశి: ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. ఆలోచనలు అమలు చేస్తారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన పరిచయాలు ఏర్పడుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. పారిశ్రామిక, కళారంగాల వారికి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. మహిళలకు కుటుంబ సమస్యలు తీరుతాయి. గణపతికి అర్చన చేయించుకోండి.

తులారాశి: శ్రమకు ఫలితం దక్కే అవకాశం. వాహనాలు, గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల రాకతో ఉల్లాసంగా గడుపుతారు. కోర్టు కేసుల నుంచి విముక్తి. వ్యాపారాలలో అభవృద్ధి ఉంటుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయ,కళారంగాల వారికి పదవులు, సన్మానాలు దక్కే అవకాశం. విద్యార్థులు పరిశోధనలపై ఆసక్తి చూపుతారు. మహిళలకు ఆస్థిలాభం. ఆదిత్య హృదయం పఠించండి.

వృశ్చిక రాశి: ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. బంధువులతో విరోధాలకు అవకాశం. విలువైన వస్తువులు జాగ్రత్త. పెట్టుబడుల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగులు నిరుత్సాహం చెందుతారు. రాజకీయ, కళారంగాల వారికి ఒత్తిడులు. విద్యార్థులకు నిరాశ. మహిళలకు మానసిక అశాంతి. హనుమాన్ పూజలు చేయండి.

ధనస్సు రాశి: ఆలోచనలు నిలకడగా సాగవు. కష్టించినా ఫలితం ఉండదు. పనులు మందకొడిగా సాగుతాయి. రాబడి తగ్గుతుంది. వ్యాపారాల్లో లాభాలు కష్టమే. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. పారిశ్రామిక, కళారంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులకు నిరాశ కలుగుతుంది. మహిళలకు మానసిక అశాంతి నెలకొంటుంది. లక్ష్మీదేవికి పూజలు చేయండి.

మకర రాశి: ఆకస్మిక ధనలాభం. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆస్తి వివాదాలు తొలుగుతాయి. సోదరులతో విబేధాలు సర్దుమణుగుతాయి. ఉద్యోగాలకు పదోన్నతులు. రాజకీయ వర్గాలకు సన్మానాలు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. విద్యార్థులకు సాంకేతిక అవకాశాలు. మహిళలు ఉత్సాహంగా గడుపుతారు. విష్ణుసహస్రనామ పారాయణం చేయండి.

కుంభరాశి: పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. శ్రమాధిక్యం తప్పదు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. వ్యాపార, లావాదేవీలు నిరాశాజకంగా ఉంటాయి. పారిశ్రామిక - కళారంగాలవారి అంచనాలు తప్పుతాయి. ఉద్యోగులకు బదిలీలు. విద్యార్థులు లక్ష్యం సాధించడంలో విఫలమవుతారు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు ఎదురవుతాయి. హనుమాన్ చాలీసా పఠించండి.

మీనరాశి: వాహనయోగం కలుగుతుంది. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం. కుటుంబంలో విశేష ఆదరణ లభస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. మహిళలు శుభకార్యాల్లో పాల్గొంటారు.