నవంబర్ 16 శుక్రవారం 2018 దినఫలాలు

Fri Nov 16 2018 07:00:24 GMT+0530 (IST)

గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..మేష రాశి: ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. అదనపు ఆదాయం సమకూరినా అవసరాల కోసం అప్పులు చేస్తారు. రియల్ ఎస్టేట్ వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలో నూతనోత్సాహం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. బంధువులతో సఖ్యత. కొత్త పనులు చేపడుతారు. కొత్తపనులు చేపడతారు. రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి అనుకోని సన్మానాలు. ఐటీ నిపుణులకు అనుకూల పరిస్థితులు. మహిళలకు కుటుంబపరంగా ప్రోత్సాహం. విద్యార్థులకు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. దత్తాత్రేయుడిని పూజించండి.

వృషభరాశి: సంఘంలో గౌరవం లభిస్తుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. రాబడి పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూలం. రియల్ ఎస్టేట్ వారికి చిక్కులు తొలగుతాయి. వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. రాజకీయ సాంకేతిక రంగాల వారికి విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులకు అనూకూల సమయం. ఉద్యోగులకు హోదాలు లభిస్తాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు దక్కుతాయి. మహిళలకు సంఘం గౌరవం. వినాయకుడిని పూజించండి.

మిథున రాశి: బంధువులతో అకారణంగా వైరం. కుటుంబంలో సమస్యలు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ప్రయాణాలు  ఉంటాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి మానసిక వేదన కలుగుతుంది. ఉద్యోగులకు బదిలీలు. పారిశ్రామిక రాజకీయ రంగాల వారికి ఒత్తిడులు అధికం. వ్యాపారాలలో నిరాశ ఎదురవుతుంది. విద్యార్థులు నిర్ణయాలలో కొంత నిదానం పాటించాలి. ఐటీ నిపుణులకు ఒత్తిడులు. మహిళలకు కొంత ఆందోళన కలుగుతుంది. శివ స్తోత్రాలు పఠించండి.

కర్కాటక రాశి: ప్రయాణాలలో ఆటంకాలు. కష్టించిన ఫలితం ఉండదు. భార్యభర్తల నడుమ అపోహలు. కుటుంబ సభ్యులతో తగాదాలు. కోర్టు కేసులు ఇబ్బంది కలిగిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి శ్రమ ఫలించదు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. పారిశ్రామిక రాజకీయ రంగాల వారికి గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. ఐటీ నిపుణులకు నిరాశ ఎదురవుతుంది. మహిళలు కుటుంబ సమస్యలతో సతమతమవుతారు. హనుమాన్ చాలిసా పఠించండి.

సింహ రాశి: సన్నిహితులు బంధువులతో విభేదాలు తొలుగుతాయి. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. ఇంటాబయటా అనుకూలం. వాహనాలు ఆభరణాలు కొంటారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయ రంగాల వారికి అవకాశాలు పెరుగుతాయి. ఐటీ నిపుణులు అవకాశాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ వారికి అనూకూలం. విద్యార్థులకు సాంకేతిక అవకాశాలు. మహిళలు కుటుంబ విషయాలపై ఆసక్తి చూపుతారు. వేంకటేశ్వరస్వామిని పూజించండి.

కన్యారాశి: ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మీ అంచనాలు నిజమవుతాయి. నూతన పనులకు శ్రీకారం చూడుతారు. కాంట్రాక్టులు పొందుతారు. వేడుకల్లో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్లకు చిక్కులు తొలగుతాయి. నిరుద్యోగులు ఉద్యోగులు శుభవార్తలు వింటారు. ఐటీ నిపుణులకు అనుకోని ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. విద్యార్థుల పరిశోధనలు ఫలిస్తాయి. మహిళలు ఉత్సాహంగా గడుపుతారు. ఆంజనేయుడి పూజలు చేయండి.

తులారాశి: మానసిక ఆందోళన తప్పదు. బంధువులతో విబేధాలు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదురవుతాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. ఐటీ ఉద్యోగులకు గందరగోళమే. విద్యార్థులకు నిరుత్సాహం. మహిళలకు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. శ్రీరామరక్ష స్తోత్రాలు పఠించండి.

వృశ్చిక రాశి: ఇంటా బయట ఒత్తిడులు. కుటుంబ సభ్యులతో విబేధాలు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అవసరాలకు డబ్బులు అందుతాయి. రియల్ ఎస్టేట్ రంగాలవారు ఆచితూచి వ్యవహరించాలి. రాజకీయ పారిశ్రామిక రంగాలవారి విదేశీ పర్యటనలు రద్దు. విద్యార్థులకు పరీక్షా కాలం. మహిళలకు నిరుత్సాహం. కనకధారా స్తోత్రం పఠించండి.

ధనస్సు రాశి: బాల్య స్నేహితులను కలుసుకుంటారు. ముఖ్యనిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికస్థితి మెరుగవుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలలో వృద్ధి. రాజకీయ సాంకేతిక రంగాలవారికి ఉత్సాహం కలుగుతుంది. ఐటీ నిపుణులకు ముఖ్య సమాచారం అందుతుంది. విద్యార్థులకు సాంకేతిక అవకాశాలు కలిసివస్తాయి. మహిళలకు సన్మానాలు లభిస్తాయి. షిర్డీ సాయిబాబాని పూజించండి.

మకర రాశి: సన్నిహితుల నుంచి ఒత్తిడులు. ఆర్థికపరిస్థితి గందరగోళం. భూవివాదాలతో చికాకులు. కుటుంబ సభ్యులతో వైరం. మానసిక అశాంతి తప్పదు. రియల్ ఎస్టేట్ వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగులకు పనిభారం. ఐటీ ఉద్యోగుల శ్రమకు తగిన ఫలితం ఉండదు. రాజకీయ వైద్య రంగాల వారికి ఒత్తిడులు పెరుగుతాయి. విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి. మహిళలు చికాకులు ఎదుర్కొంటారు. గణేషుడి స్తోత్రాలు పఠించండి.

కుంభరాశి: సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. పాతబకాయిలు వసూలవుతాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. నిరుద్యోగులకు సానుకూల సమయం. శుభకార్యాల్లో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ వారికి కొత్త విషయాలు తెలుస్తాయి. పారిశ్రామిక రాజకీయరంగాల వారికి విదేశీ పర్యటనలు ఉంటాయి. ఐటీ ఉద్యోగులకు మరిన్ని విజయాలు లభిస్తాయి. విద్యార్థులకు అనుకూల ర్యాంకులు వస్తాయి. మహిళలు సంతోషకరమైన సమాచారం అందుతుంది. శ్రీ దత్తాత్రేయుడిని పూజించండి.

మీనరాశి: ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు మందగిస్తాయి. ఇంటాబయట ఒత్తిడులు. రాజకీయ - పారిశ్రామిక రంగాల వారికి నిరుత్సాహం. ఐటీ నిపుణులు - విద్యార్థులు మరింత శ్రమించాలి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. మహిళలకు కుటుంబీకులతో వివాదాలు. ఆంజనేయ దండకం పఠించండి.