Begin typing your search above and press return to search.

నవంబర్ 9 శుక్రవారం 2018 దినఫలాలు

By:  Tupaki Desk   |   9 Nov 2018 1:30 AM GMT
నవంబర్ 9 శుక్రవారం 2018 దినఫలాలు
X
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..

మేషరాశి: ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి. పనుల్లో జాప్యం. అప్పులు చేస్తారు. శ్రమకు తగ్గ ఫలితం రాదు. వివాదాలకు దూరంగా ఉండండి. రియల్ ఎస్టేట్ వారికి చిక్కులు. వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి. ఉద్యోగులు పనిభారం మోయాల్సి వస్తుంది. రాజకీయ - పారిశ్రామిక వర్గాలకు పర్యటనలు ముందుకు సాగవు.

వృషభరాశి: ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు. వ్యాపారాల్లో లాభాలు. రాజకీయవేత్తలు - కళాకారులకు సన్మానాలు. ఐటీ నిపుణులు కొత్త ఆశలతో ముందడుగు వేస్తారు. విద్యార్థులకు కొత్త విద్యావకాశాలు. మహిళలకు మానసిక ప్రశాంతత. రామరక్షా స్తోత్రాలు పఠిస్తే మంచిది.

మిథునరాశి: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. గృహ నిర్మాణ యత్నాలు సాగిస్తారు. రియల్ ఎస్టేట్ ల వారికి ఊహించని లాభాలు. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు. పారిశ్రామిక - రాజకీయ వేత్తలకు ఉత్సాహంగా గడుస్తుంది. ఐటీ నిపుణులకు ప్రోత్సాహకమైన కాలం. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. మహిళలకు కుటుంబంలో గౌరవం. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.

కర్కాటకరాశి: కుటుంబంలో చికాకులు. ఆదాయం కంటే ఖర్చులు అధికం. కాంట్రాక్టులు చేజారుతాయి. వ్యాపారాలు నత్తనడక. ఉద్యోగులకు స్థాన మార్పులు. పారిశ్రామికవేత్తలు - కళాకారులకు ఒత్తిడులు అధికం. ఐటీ నిపుణులకు సామాన్యస్థితి. విద్యార్థులకు కొంత నిరాశజనకం. మహిళలకు గొడవలతో మనశ్శాంతి కరువు. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మంచిది.

సింహరాశి: ఉద్యోగ - వివాహ యత్నాలు నత్తనడకన సాగుతాయి. శ్రమ పెరుగుతుంది. రాబడి తగ్గి రుణదాతలను ఆశ్రయిస్తారు. కాంట్రాక్టర్లు టెండర్లు దక్కించుకోలేరు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఉద్యోగులకు చికాకులు. పారిశ్రామిక - రాజకీయవేత్తలకు ఒత్తిడులు. ఐటీ నిపుణులకు అంచనాలు తారుమారు. విద్యార్థులకు గందరగోళం. మహిళలకు ఉత్సాహం తగ్గుతుంది. విష్ణు ధ్యానం చేస్తే మంచిది.

కన్యరాశి: కుటుంబంలో శుభకార్యాలు. భూములు - భవనాలు కొంటారు. కొత్త వ్యక్తుల పరిచయం. రియల్ ఎస్టేట్ ల వారికి శ్రమ ఫలిస్తుంది. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగుల సేవలకు తగిన గుర్తింపు. పారిశ్రామిక - రాజకీయవేత్తలకు పర్యటనలు. ఐటీ నిపుణులు సంతోషంగా గడుపుతారు. విద్యార్థులకు ఉత్సాహవంతం. మహిళలకు సమస్యలు తీరుతాయి.

తులరాశి: ఆర్థిక ఇబ్బందులు. వాహనాలు - ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వద్దు. స్నేహితులే శత్రువులవుతారు. కాంట్రాక్టర్లకు అవకాశాలు చేజారుతాయి. వ్యాపారులు కొంత నిదానంగా వ్యవహరించాలి. ఉద్యోగాల్లో అదనపు పనిభారం. రాజకీయవేత్తలకు ఒత్తిడులు. ఐటీ నిపుణులకు మార్పులు. విద్యార్థులు మరింత శ్రమపడాలి. మహిళలకు ఆస్తి తగాదాలు. అంగారకస్తోత్రాలు పఠిస్తే మంచిది.

వృశ్చికరాశి: కుటుంబంలో శుభకార్యాలు. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు పరిష్కారం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగాల్లో పదోన్నతి. పారిశ్రామిక - రాజకీయవేత్తలకు కొత్త అవకాశాలు. ఐటీ నిపుణులు విశేష గుర్తింపు పొందుతారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. మహిళలకు ఆస్తిలాభం. వినాయకుడిని అర్చనలు చేయండి.

ధనుస్సురాశి: అప్పుల కోసం ప్రయత్నిస్తారు. బంధువర్గంతో విరోధాలు. శ్రమానంతరం కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు. శారీరక రుగ్మతలు. రియల్ ఎస్టేట్ వారికి కొంత అనుకూలత. వ్యాపారాల్లో లాభనష్టాలు సమానం. ఉద్యోగులకు ఊహించని మార్పులు. రాజకీయ - పారిశ్రామికవేత్తలకు అవకాశాలు చేజారుతాయి. ఐటీ నిపుణులు కష్టానికి ఫలితం పొందలేరు. విద్యార్థులు అనుకున్నది సాధించడంలో విఫలమవుతారు. మహిళలకు మానశ్శాంతి లోపిస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మంచిది.

మకరరాశి: వాహనాలు - ఆభరణాలు కొంటారు. ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాల్లో ముందడుగు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సన్మానాలు. ఐటీ నిపుణులకు కొత్త ఆశలు. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు ఆస్తిలాభం. దుర్గాదేవి స్తోత్రాలు పఠిస్తే మంచిది.

కుంభరాశి: అదనపు ఆదాయం చేకూరుతుంది. రియల్ ఎస్టేట్ వారికి లాభాలు. నిరుద్యోగులకు నూతనోత్సాహం. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగాల్లో మీ సేవలకు తగిన గుర్తింపు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు నూతన అవకాశాలు. ఐటీ నిపుణులు మంచి గుర్తింపు పొందుతారు. విద్యార్థులకు మరింత ఉత్సాహం. మహిళలకు ఆస్తిలాభం. శివాష్టకం పఠిస్తే మంచిది.

మీనరాశి: ఆర్థిక వ్యవహారాల్లో నిరాశ. శారీరక రుగ్మతలు. రియల్ ఎస్టేట్ వారి యత్నాలు విఫలం. వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది. రాజకీయవేత్తలకు పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు అంచనాలు తప్పుతాయి. విద్యార్థులకు ఫలితాలు సంతృప్తినివ్వవు. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. గణేశాష్టకం పఠిస్తే మంచిది.