నవంబర్ 8 గురువారం 2018 దినఫలాలు

Thu Nov 08 2018 07:00:31 GMT+0530 (IST)

గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి: ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. సన్నిహితులతో విభేదాలు. రియల్ ఎస్టేట్ వారి శ్రమ ఫలిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో హోదాలు పెరిగే అవకాశం. పారిశ్రామిక - రాజకీయవేత్తలకు అనుకూల పరిస్థితులు. ఐటీ నిపుణుల ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు సన్మానాలు. శ్రీ నరసింహస్తోత్రం పఠిస్తే మంచిది.వృషభరాశి: ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఉద్యోగ వివాహ యత్నాలు కలిసివస్తాయి.  కాంట్రాక్టర్లు రియల్ ఎస్టేట్ ల వారికి మరింత అనుకూలం. వ్యాపారాల విస్తరణ యత్నాలు. ఉద్యోగాల్లో ముందడుగు. పారిశ్రామిక కళారంగాల వారికి అనుకోని సన్మానాలు వ్యవహారాల్లో విజయం. ఐటీ నిపుణులు ఆకస్మిక పర్యటనలు జరుపుతారు. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలు ఆస్తి లాభాలు పొందుతారు. శ్రీవినాయక స్తోత్రం పఠిస్తే మంచిది.

మిథునరాశి: రాబడి తగ్గుతుంది. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యసమస్యలు. రియల్ ఎస్టేట్ వారికి మరిన్ని సమస్యలు. వ్యాపారాల్లో నష్టాలు. ఉద్యోగులకు బదిలీ అవకాశాలు. రాజకీయ - పారిశ్రామికవేత్తలకు ఒత్తిడులు. ఐటీ నిపుణులు కాస్త నిరాశ చెందుతారు. విద్యార్థులు ఆచితూచి వ్యవహరిస్తే మంచిది. మహిళలకు కుటుంబంలో చికాకులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠిస్తే మంచిది.

కర్కాటకరాశి: ఆర్థిక ఇబ్బందులు.. ఆకస్మిక ప్రయాణాలు. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాల్లో ఆవాంతరాలు. రియల్ ఎస్టేట్ ల వారికి శ్రమ పెరుగుతుంది. వ్యాపారులు పెట్టుబడుల్లో తొందరపడరాదు. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. పారిశ్రామిక - రాజకీయవేత్తలకు ఒత్తిడులు. ఐటీ నిపుణులు పర్యటనలు వాయిదా వేస్తారు. విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి. మహిళలకు దూర ప్రయాణాలు. శివాష్టకం పఠిస్తే మంచిది.

సింహరాశి: అదనపు రాబడి. భార్యభర్తల మధ్య సఖ్యత. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగవావకాశాలు. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ ల వారికి మరింత అనుకూలం. వ్యాపారాలు సంతృప్తికరం. ఉద్యోగులకు పదోన్నతి. పారిశ్రామిక రాజకీయవేత్తలకు సన్మానాలు. విద్యార్థులకు పరిశోధనలు ఫలిస్తాయి. మహిళలకు అవార్డులు రివార్డులు దక్కే చాన్స్. ఆదిత్య హృదయం పాఠిస్తే మంచిది.

కన్యరాశి: శారీరక రుగ్మతలు. ఆర్థిక ఇబ్బందులతో ఉక్కిరిబిక్కిరి. ఇంటాబయటా సమస్యలు. రియల్ ఎస్టేట్ వారికి చిక్కులు. వ్యాపారాల్లో ఆటుపోట్లు. ఉద్యోగులకు మార్పులు. పారిశ్రామికవేత్తలు.. కళాకారులకు పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు సామాన్యస్థితి. విద్యార్థులకు అనుకూలించదు. మహిళలకు అనారోగ్యం. ఔషధ సేవనం. విష్ణు ధ్యానం చేయిస్తే మంచిది.

తులరాశి: ఆర్థిక ప్రగతి ఉంటుంది. సన్నిహితులతో ఆనందం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వాహనయోగం. ఆస్తిలాభ సూచనలు. రియల్ ఎస్టేట్ ల వారికి చిక్కులు తొలుగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయ పారిశ్రామికవేత్తలకు కలిసి వచ్చే కాలం. ఐటీ నిపుణులకు కాస్త ఉపశమనం. విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు. పురస్కారాలు. మహిళలకు గృహ వాహనయోగం. లక్ష్మీస్తుతి పాఠిస్తే మంచిది.

వృశ్చికరాశి: శారీరక రుగ్మతలు. వ్యయప్రయాసలు. ఆస్తి వ్యవహారాల్లో సమస్యలు. రియల్ ఎస్టేట్ వారికి ఒడిదుడుకులు. వ్యాపారాల్లో చిక్కులు. ఉద్యోగులకు పనిభారం. పారిశ్రామిక రాజకీయవర్గాలకు అనుకూలించవు. ఐటీ నిపుణులకు అదనపు భారం. విద్యార్థులకు చిక్కులు. మహిళలకు అనారోగ్యం. శివాష్టకం పఠిస్తే మంచిది.

ధనుస్సురాశి: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆలయ దర్శనాలు . రియల్ ఎస్టేట్ ల వారికి భూవివాదాల నుంచి ఉపశమనం. కొత్త వ్యాపారాలు చేపడుతారు. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయ పారిశ్రామికవేత్తలకు యోగదాయకం. ఐటీ నిపుణులకు ప్రోత్సాహకరం. విద్యార్థులకు ఫలితాలు దక్కుతాయి. మహిళలకు సమస్యలు తీరుతాయి. సుబ్రహ్మణ్యాష్టకం పఠిస్తే మంచిది.

మకరరాశి: ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. ఉద్యోగయత్నాలు సఫలం. కాంట్రాక్టులు దక్కుతాయి. కొత్త వ్యాపారాలు చేపడుతారు. రాజకీయ కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులు విజయాలు సాధిస్తారు. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు. మహిళలకు ఆస్తుల విషయాలు కొలిక్కి వస్తాయి. గణేశాష్టకం పఠిస్తే మంచిది.

కుంభరాశి: ఆదాయం క్షీణిస్తుంది. వ్యవహారాల్లో నిరాశ.కుటుంబ ఆరోగ్య సమస్యలు. నిరుద్యోగుల అంచనాలు తప్పుతాయి. సన్నిహితులే శత్రువులవుతారు. రియల్ ఎస్టేట్ వారికి ఒడిదుడుకులు. భాగస్వామ్య వ్యాపారాల్లో ఒత్తిడులు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామిక రాజకీయవర్గాలకు ఒడిదుడుకులు. ఐటీ నిపుణులకు సామాన్యం. విద్యార్థులకు పోటీపరీక్షల్లో నిరాశ. మహిళలకు కుటుంబ సమస్యలు. గణపతి స్తోత్రాలు పఠిస్తే మంచిది.

మీనరాశి: శారీరక రుగ్మతలు. రాబడి తగ్గే అవకాశం. రియల్ ఎస్టేట్ లు - కాంట్రాక్టర్లకు సమస్యలు ఎదురుకావచ్చు. వ్యాపారాల్లో లాభాలు కష్టమే. ఉద్యోగులకు స్వల్ప మార్పులు. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. ఐటీ నిపుణులకు నిరాశాజనకం. విద్యార్థులకు వ్యతిరేక ఫలితాలు. మహిళలకు కుటుంబంతో సమస్యలు దుర్గాదేవి స్తోత్రాలు పఠిస్తే మంచిది.