Begin typing your search above and press return to search.

నవంబర్ 2 శుక్రవారం 2018 దినఫలాలు

By:  Tupaki Desk   |   2 Nov 2018 1:42 AM GMT
నవంబర్ 2 శుక్రవారం 2018 దినఫలాలు
X
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..

మేషరాశి: రుణం కోసం ప్రయత్నిస్తారు. శ్రమాధికంతో కొన్ని పనులు పూర్తి. భూవివాదాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ ల వారికి ఒత్తిడులు. వ్యాపార విస్తరణ యత్నాలు ముందుకుసాగవు. ఉద్యోగులకు ఒత్తిడులు. పారిశ్రామిక - రాజకీయవేత్తలకు వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఐటీ నిపుణులు ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులకు ఒత్తిడులు.మహిళలకు నిరాశ. గణేశాష్టకం పఠిస్తే మంచిది.

వృషభరాశి: కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. రియల్ ఎస్టేట్ - కాంట్రాక్టర్లకు లేనిపోని సమస్యలు. వ్యాపారా లావాదేవీలతో నిరాశ. ఉద్యోగులకు మార్పులు. రాజకీయ వేత్తలు - కళాకారులకు మానసిక ఆందోళన. ఐటీ నిపుణులు మరింత నిదానం పాటిస్తే మంచిది. విద్యార్థులకు ఒత్తిడులు. మహిళలకు కుటుంబంలో చికాకులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

మిథునరాశి: ఆర్థిక విషయాల్లో ప్రగతి. వివాదాల పరిష్కారం. పరిస్థితులు అనుకూలం. వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. కాంట్రాక్టర్లకు అనుకున్న పనులు దక్కించుకుంటారు. వ్యాపారాలు లాభసాటి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయ - పారిశ్రామిక వేత్తలకు పురస్కారాలు. ఐటీ నిపుణులకు ఆహ్వానాలు. విద్యార్థులు అనుకోని అవకాశాలు పొందుతారు. మహిళలకు సంతోషకరమైన వార్తలు. శివాష్టకం పఠిస్తే మంచిది.

కర్కాటకరాశి: ఆర్థిక ఇబ్బందులతో చికాకులు. కాంట్రాక్టర్లు - రియల్టర్ల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం. రాజకీయవేత్తలు - కళాకారులకు లేనిపోని చికాకులు. ఐటీ నిపుణులకు నిరాశ. విద్యార్థులకు విద్యావకాశాలు. మహిళలు కుటుంబం విషయాల్లో నిరుత్సాహం. ఆదిత్య హృదయం పాఠిస్తే మంచిది.

సింహరాశి: రాబడి ఆశాజనకం. పనుల్లో విజయం. రియట్ ఎస్టేట్ వారికి ఆస్తిలాభం. వ్యాపారాల విస్తరణ యత్నాలు అనుకూలం. ఉద్యోగులకు ఊహించని ఇంక్రిమెంట్లు. రాజకీయవేత్తలకు విదేశీ ఆహ్వానాలు. ఐటీ నిపుణులు సమస్యలు అధిగమిస్తారు. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు ఉత్సాహం. రామరక్ష స్తోత్రాలు పఠిస్తే మంచిది.

కన్యరాశి: మానసిక అశాంతి, ఆందోళన. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యవహారాల్లో ఆటంకాలు. దూర ప్రయాణాలు సంభవం.. ఇంటర్వ్యూలు నిరాశ కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి అయోమయం. ఉద్యోగులకు పనిఒత్తిడి. వ్యాపారాలు నిదానం. పారిశ్రామిక, కళారంగాల వారికి నిరుత్సాహం. ఐటీ నిపుణులు కొంత నిరాశ. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. మహిళలకు ఆరోగ్యభంగం. హయగ్రీవ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

తులరాశి: ఆదాయం సంతృప్తికరం. రియల్ ఎస్టేట్ వారికి కొన్ని సమస్యలు పరిష్కారం. ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు. రాజకీయవేత్తలు, కళారంగాలకు ప్రోత్సాహకరమైన కాలం. ఐటీ నిపుణులకు విజయాలు. విద్యార్థులకు శుభవార్త. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం. శ్రీరామస్తోత్రాలు పఠిస్తే మంచిది.

వృశ్చికరాశి: ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. చాకచక్యంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. రియల్టర్లకు అనుకూలం. వ్యాపారాల్లో చికాకులు. ఉద్యోగవర్గా్లో ఉత్సాహపూరితమైన కాలం. రాజకీయవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులు సంతోషకరంగా గడుపుతారు. విద్యార్థులకు రెండుమూడు అవకాశాలు. మహిళలకు నూతనోత్సాహం. అష్టలక్ష్మీ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

ధనస్సురాశి: ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శారీరక రుగ్మతలు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రియల్టర్లు, కాంట్రాక్టర్లకు చిక్కులు తప్పకపోవచ్చు. వ్యాపారాలు నత్తనడకన. ఉద్యోగవర్గాలకు అదనపు బాధ్యతలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అవకాశాలు. ఐటీ నిపుణులు శ్రమానంతరం ఫలితం పొందుతారు. విద్యార్థులకు కష్టపడ్డా ఫలితం కనిపించదు. మహిళలకు ఆకస్మిక దూర ప్రయాణాలు. దుర్గామాతకు పూజలు చేస్తే మంచిది.

మకరరాశి: రాబడి తగ్గుతుంది. భూవివాదాలు. కొన్ని కాంట్రాక్టులు చేజారుతాయి. వ్యాపారాలు నిరుత్సాహం. ఉద్యోగులకు బదిలీలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఒత్తిడులు. ఐటీ నిపుణులు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. విద్యార్థులకు కృషి అంతగా ఫలించదు. మహిళలకు ఆరోగ్యభంగం. వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠిస్తే మంచిది.

కుంభరాశి: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భూములు, వాహనాలు కొంటారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపార విస్తరణ యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత స్థాయి నుంచి సహకారం. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు కలిసివచ్చే సమయం. ఐటీ నిపుణులు కార్యసాధకులై ముందడుగు వేస్తారు. విద్యార్థులకు యత్న కార్యసిద్ధి. మహిళలకు శుభవార్త. లక్ష్మీ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

మీనరాశి: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగుల యత్నాలు సానుకూలం. ఆలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టర్లకు శుభసూచికలు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు విదేశీ యానం. విద్యార్థుల కృషి ఫలించి ఉత్సాహం. ఐటీ నిపుణులకు మరింత సానుకూలం. మహిళలకు అంచనాలు నిజమవుతాయి. శివస్తోత్రాలు పఠిస్తే మంచిది.