Begin typing your search above and press return to search.

అక్టోబర్ 21 ఆదివారం 2018 దినఫలాలు

By:  Tupaki Desk   |   21 Oct 2018 1:32 AM GMT
అక్టోబర్ 21 ఆదివారం 2018 దినఫలాలు
X
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..

మేషరాశి: శుభకార్యాలకు డబ్బు ఖర్చవుతుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ప్రోత్సాహకరం. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామిక - రాజకీయ వర్గాలకు అనుకోని అవకాశాలు. ఐటీ నిపుణుల యత్నాలు సఫలం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. మహిళలకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. గణపతిని పూజిస్తే మంచిది.

వృషభరాశి: ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరం. కాంట్రాక్టులు పట్టుదలతో సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఆహ్వానాలు. వ్యాపారాలు విస్తరిస్తాయి. పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాల్లో చికాకులు. రాజకీయ వర్గాలకు అవకాశాలొస్తాయి. ఐటీ నిపుణులకు ఉత్సాహం వస్తుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. మహిళలకు ఆస్తిలాభం. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మంచిది.

మిథునరాశి: శారీరక రుగ్మతలు వేధిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి చిక్కులు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో నిరుత్సాహం. పారిశ్రామిక - వైద్యరంగాల వారికి మానసిక అశాంతి. ఐటీ నిపుణుల కృషి ఫలించదు. విద్యార్థులకు కొంత ఇబ్బంది. మహిళలకు బాధ్యతలు పెరుగుతాయి. ఆదిత్య హృదయం పాఠిస్తే మంచిది.

కర్కాటకరాశి: ఆర్థిక పరిస్థితి ఆందోళనతో అప్పులు చేస్తారు. కాంట్రాక్టులు చేజారుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఉద్యోగులకు మార్పులొస్తాయి. రాజకీయ - పారిశ్రామిక వర్గాలకు నిరుత్సాహం. ఐటీ నిపుణులకు నూతనోత్సాహం. విద్యార్థులకు అవకాశాలు. మహిళలు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మంచిది.

సింహరాశి: మహిళలకు శుభవర్తమానాలు. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. ఐటీ నిపుణులకు కొత్త అవకాశాలు. రాజకీయ వర్గాలకు పదవులు. ఉద్యోగాల్లో కొత్త హోదాలొస్తాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. రియల్ ఎస్టేట్ వారిశ్రమ ఫలిస్తుంది. వాహనాలు - స్థలాలు కొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. దుర్గామాతకు కుంకుమార్చన చేస్తే మంచిది.

కన్యరాశి: వాహనాలు, ఆభరణాలు కొంటారు. రియల్ ఎస్టేట్ వారికి యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామిక రంగాల వారి వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఐటీ నిపుణులకు అంచనాలు నిజమవుతాయి. విద్యార్థులకు అవకాశాలు. మహిళలు కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.

తులరాశి: దూర ప్రయాణాలుంటాయి. ఆర్తిక లావాదేవీలు అనుకూలించవు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఇబ్బందులు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు సమస్యలు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. మహిళలకు మానసిక ఆందోళన. నరసింహ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

వృశ్చికరాశి: ఐటీ నిపుణులకు నిరుత్సాహం. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు. మహిళలకు కుటుంబం నుంచి విమర్శలు. పారిశ్రామిక - వైద్య రంగాల వారికి కొంత ఇబ్బందులు. ఉద్యోగులకు స్థానచలనం. వ్యాపారులకు నిదానం అవసరం. కాంట్రాక్టులు చేజారుతాయి. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. ఆదిత్య హృదయం పాఠిస్తే మంచిది.

ధనుస్సురాశి: పనులు విజయవంతమవుతాయి. వాహనాలు - స్థలాలు కొంటారు. రియల్ ఎస్టేట్ వారికి కొత్త అవకాశాలు. వ్యాపారాలు విస్తరిస్తాయి. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు చిక్కులు తొలుగుతాయి. పారిశ్రామిక - వైద్య రంగాల వారికి అనూహ్య అవకాశాలు. ఐటి నిపుణులకు అనుకూలత. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. మహిళలకు మానిసక ప్రశాంతత. వేంకటేశ్వరస్వామిని పూజిస్తే మంచిది.

మకరరాశి: ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం. రియల్ ఎస్టేట్ వారికి చిక్కులు. వ్యాపారాలు సాదాసీదా. ఉద్యోగులకు పనిభారం. పారిశ్రామిక వైద్యరంగాల వారికి విదేశఈ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు అవకాశాలు దూరమవుతాయి. విద్యార్థులకు అంచనాల్లో పొరపాట్లు. మహిళలకు మానసిక ఆందోళన. విష్ణు సహస్రనామ పారాయణం పాఠించండి.

కుంభరాశి: ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఆస్తి వివాదలు తీరుతాయి. రియల్ ఎస్టేట్ వారికి ఆశలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభసాటి. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామిక - వైద్య రంగాల వారికి రెట్టించిన ఉత్సాహం. ఐటీ నిపుణులకు శుభసూచికం. విద్యార్థులకు సాంకేతిక అవకాశాలు. మహిళలకు శుభవార్తలు. ఆదిత్య హృదయం పాఠిస్తే మంచిది.

మీనరాశి: సొమ్ము అందక ఇబ్బందులు. కొత్తగా రుణాలు సైతం చేస్తారు. ఆస్తి వివాదాలు మరింతగా పెరుగుతాయి. కాంట్రాక్టులు చివరిలో చేజారుతాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. పారిశ్రామిక రంగం వారికి విదేశీ పర్యటనల్లో అవరోధాలు. ఐటీ నిపుణులు కొంత నిరాశకు లోనవుతారు. విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి. మహిళలకు మానసిక ఆందోళన. ఆదిత్య హృదయం పాఠిస్తే మంచిది.