Begin typing your search above and press return to search.

సెప్టెంబర్ 24 సోమవారం 2018 దినఫలాలు

By:  Tupaki Desk   |   24 Sep 2018 1:39 AM GMT
సెప్టెంబర్ 24 సోమవారం 2018 దినఫలాలు
X
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..

మేషరాశి: రాజకీయాలు - సినిమా - టెలివిజన్ రంగాల వారికి ప్రోత్సాహకరం. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. భాగస్వామి వ్యవహారశైలి ఉల్లాసం కలిగిస్తుంది.ఆధ్యాత్మిక - సాహితీ ప్రముఖుల్ని కలుసుకుంటారు. కందులు - ఎండుమిర్చి - స్టాకిస్టులు - వ్యాపారులకు సంతృప్తి కనిపిస్తుంది. స్త్రీలకు నూతన పరిచయాలతో ఇబ్బంది. ఉపాధ్యాయులకు ఒక సమాచారం అందుతుంది. రవాణా రంగాల వారికి సంతృప్తి ఉంటుంది.

వృషభరాశి: విందు - వినోదాలు ఉల్లాసం కలిగిస్తాయి. హోటల్ - ఆస్పత్రులు - బ్యాంకులు సహకార సంఘాల ఉద్యోగులకు ఆర్థికంగా ప్రోత్సాహకరం. వృత్తిపరమైన సమావేశాల్లో లక్ష్యాలు సాధిస్తారు. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ఈరోజు వ్యాపార వర్గాల వారి మాటతీరు - స్కీముల కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. ప్రింటింగ్ రంగాల వారికి బాకీలు వసూలు కావు. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి.

మిథునరాశి: సంకల్పం నెరవేరుతుంది. చిన్నారుల విషయంలో బాధ్యతలు నిర్వర్తిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. వృత్తి - వ్యాపారాల్లో సృజనాత్మకంగా వ్యవహరించి సత్ఫలితాలు సాధిస్తారు. పెద్ద మొత్తంలో ధనసహాయం చేయవద్దు. సంతానం తో చికాకులు. ఉద్యోగులకు పై అధికారుల నుంచి ఒత్తిడి - చికాకులు ఎదుర్కొంటారు.

కర్కాటకరాశి: రియల్ ఎస్టేట్ - ఫర్నిచర్ రంగాల వారికి ప్రోత్సాహకరం. బదిలీలకు సంబంధించి కీలక సమాచారం అందుకుంటారు. విద్యాసంస్థల్లో ప్రవేశానికి ఏర్పాట్లు చేసుకుంటారు. ప్రయాణాలు - సమావేశాలకు అనుకూలం. బేకరి - పండ్ల - స్వీట్ వ్యాపారాలు జోరుగా సాగుతాయి. కొంత మంది మీ పలుకుబడి ద్వారా లబ్ధి పొందుతారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి. గతంతో పోల్చితే ఆర్థిక స్థితి కొంత మెరుగవుతుంది.

సింహరాశి: పూర్వ మిత్రులను కలుసుకుంటారు. సన్నిహితుల ఆరోగ్యం మెరుగవుతుంది. పెట్టుబడులకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. విద్యాసంస్థల్లో ప్రవేశానికి - స్టేషనరీ కొనుగోలుకు నిధులు సర్దుబాటవుతాయి. రుణం తీర్చే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత. ఆంక్షలు తప్పవు. బంధువుల అండలభిస్తుంది. రాజకీయాల్లో వారు ప్రత్యర్థులు పెరుగుతున్నారని గమనించండి.

కన్యరాశి: వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. పందాలు - పోటీల్లో విజయం సాధిస్తారు. అంచనాలు - పెట్టుబడులకు అనుకూలం. భాగస్వామ్యాలు లాభిస్తాయి. స్టేషనరీ - ప్రింటింగ్ రంగాల వారికి పని ఒత్తిడి మినహా ఆశించిన ఫలితం ఉండదు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. బంధువులతో సంబంధాలు పెంచుకుంటారు. స్త్రీలకు స్వీయ సంపాదన లభిస్తుంది. ముక్కుసూటితనం వివాదాస్పదమవుతుంది.

తులరాశి: వృత్తి - వ్యాపారాలకు సంబంధించి కీలక నిర్ణయాల అమలుకు అనుకూల సమయం. సంకల్పం నెరవేరుతుంది. కొత్త ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తారు. వైద్యం - యోగ - ధ్యానాలు - ఆహార నియమాలపై దృష్టిపెడతారు. వస్త్ర - బంగారం - వెండి - లోహ పనివారలకు శుభదాయకం. ప్రయాణాల్లో ఊహించని చికాకులు - అసౌకర్యానికి గురికాకతప్పదు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు మీ ఉన్నతిని పెంచుతాయి. గుమస్తాలకు చికాకులు. హామీలు - చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి.

వృశ్చికరాశి: ధీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టిసారిస్తారు. చిన్నారుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. విదేశీ విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రియమైన వారి నుంచి కీలక సమాచారం అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు సంతృప్తినిస్తాయి. ఉద్యోగులు మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఉమ్మడి వ్యవహారాల్లో చికాకులు - భాగస్థులతో అభిప్రాయబేధాలు. ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత. స్త్రీలు వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

ధనస్సురాశి: బంధుమిత్రుల కలయికతో సందడి. భూలావాదేవీలకు అనుకూలం. నిర్మాణ రంగం వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. సమావేశాలు - ప్రదర్శనలకు ఏర్పాట్లు చేస్తారు.భూ లావాదేవీలకు అనుకూలం. నష్టాలను మరో విధంగా పూడ్చుకుంటారు. వృత్తి - ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. కీలక విషయాల్లో పట్టుసాధిస్తారు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చేసుకోండి. స్థిరాస్తి క్రయవిక్రయాల్లో పునరాలోచన అవసరం.

మకరరాశి: ఏజెంట్లు - రిప్రజెంటేటివ్ లు - బోధనా రంగానికి చెందిన వారికి ప్రోత్సాహకరం. ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. విద్యాసంస్థలతో ప్రముఖల వల్ల పనులు పూర్తి చేస్తారు. డబ్బుల విషయాల్లో జాగ్రత్త. తప్పిదాలు పునరావృతం కానీయవద్దు. తేలికగా మోసపోయే ఆస్కారం ఉంది. ఉపాధ్యాయులకు రిప్రెజెంటీవులకు ఒత్తిడి - చికాకులు తప్పవు.

కుంభరాశి: సమావేశాలు - ప్రదర్శనలకు ఏర్పాట్లు చేస్తారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆర్థిక లక్ష్యాలు సాధిస్తారు. సంకల్పసిద్దికి పట్టుదలతో ప్రయత్నిస్తాయి. విద్యా - ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. ఈరోజు పుణ్యకార్యాల్లో నిమగ్నులవుతారు. బంధువుల రాకతో పనులు కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. స్త్రీలకు అదనపు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో సమాచారం అందుతుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.

మీనరాశి: పెట్టుబడులు - బీమా - మ్యూచువల్ ఫండ్ వ్యవహారాలపై నిర్ణయానికి వస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. నిర్ణయాలను సమీక్షించుకుంటారు. ఇతరులకు వాహనాలిస్తే ఇబ్బందులు. పాతమిత్రులతో కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. కొన్ని విషయాలు అంతగా పట్టించుకోవడం మంచిది కాదు. సామూహిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరుస్తారు.