Begin typing your search above and press return to search.

సెప్టెంబర్ 23 ఆదివారం 2018 దినఫలాలు

By:  Tupaki Desk   |   23 Sep 2018 1:31 AM GMT
సెప్టెంబర్ 23 ఆదివారం 2018 దినఫలాలు
X
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..

మేషరాశి: సినీ - రాజకీయ - గ్రానైట్ - ఫొటోగ్రఫీ - కళారంగాల వారికి లక్ష్యసాధనలో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. సమావేశాల్లో నిదానం పాటించాలి. భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఖర్చులు అంచనాలు మించుతాయి. ధనం వ్యయం చేసి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. చిన్నతరహా - చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. రుణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశీయానం.. పుణ్యకార్యాల పై ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలతో హడావుడిగా ఉంటారు.

వృషభరాశి: సన్నిహితుల ఆరోగ్యం కలవరం కలిగిస్తుంది. యూనియన్ కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో సహోద్యోగులు మొహమాట పెట్టే అవకాశం ఉంది. సమావేశాలు - వేడుకల్లో ఖర్చులు అంచనాలు పెరుగుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. కలిసివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆదాయాభివృద్ధి - మానసిక ప్రశాంతత - సంఘంలో గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. ప్రమోషన్స్ కు అవకాశం.

మిథునరాశి: వేడుకల్లో ప్రముఖులను కలుసుకుంటారు. శ్రమాధిక్యం అవుతుంది. కుటుంబ సభ్యులతో మనస్తాపం. వృత్తి, వ్యాపారాల్లో సృజనాత్మకత లోపించడంతో ఫలితాలు రావు. మీపై అభియోగాలు తొలిగిపోవు. ఖర్చులు అధికమవుతాయి. వ్యవహారిక ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. దూరప్రయాణాలతో ఉపయోగం.

కర్కాటకరాశి: ఇంటి వస్తువులు సమకూర్చుకుంటారు. సమావేశాలు - బృంద కార్యక్రమాలకు ఏర్పాట్లకు ఆటకం. రక్షణ - న్యాయ - బోధన రవాణా రంగాల వారికి నిరుత్సాహకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో నిరుత్సాహం కలిగిన సత్ఫలితాలు ఉంటాయి. కోర్టు వాయిదాలు పడడం మంచిది. విద్యార్థుల సాహస ప్రయత్నాలు విరమించండి.

సింహరాశి: పెట్టుబడుల గురించి సమాచారం అందుతుంది. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల నుంచి ఒత్తిడికి గురవుతారు. బిల్లులు - చెక్కులు అందడంలో జాప్యం వల్ల నష్టపోతారు. పనులు నెమ్మదించినా పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విద్యార్థులకు పరిచయాలు, నూతన వాతావరణం ఉత్సాహం కలిగిస్తాయి.

కన్యరాశి: బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఖర్చులు అంచనాలు మించిపోతాయి. భాగస్వామిక ఆర్థిక విషయాల్లో వివాదాలకు ఆస్కారం ఉంది. వేడుకల్లో మాటలు పడుతారు. ఆకస్మిక ఖర్చులవుతాయి. ధనం వ్యయం మితంగా చేయండి. గృహ నిర్మాణ పనుల ప్రారంభంలో మందగమనం. అవివాహితులకు శుభదాయకం. ఆల్కహాల్ - సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి.

తుల రాశి: ఉద్యోగ ప్రయత్నాలకు ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. హోటల్ - ఆస్పత్రులు - రిటైల్ రంగాల వారికి కొత్త ప్రయోగాలు చేసేందుకు తగిన సమయం కాదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. చిరు వ్యాపారులకు పురోభివృద్ధి - ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఉద్యోగ - విద్య ప్రకటనల పట్ల అవగాహన పెంచుకోండి.

వృశ్చికరాశి: దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి. మంచి సమాచారం అందుతుంది. ఉన్నత విద్య - విదేశీ ప్రయాణాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇంజనీరింగ్ - శాస్త్ర - సాంకేతిక రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. గృహ నిర్మాణాలు - మార్పులు - చేర్పులు - మరమ్మతులకు అనుకూలం.

ధనురాశి: కుటుంబ సభ్యుల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వేడుకలు - సమావేశాల్లో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ - నిర్మాణ రంగాల వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగువేయాలి. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. పరిచయాలు బలపడుతాయి. పెట్టుబడులకు అనుకూలం.

మకరరాశి: కుటుంబ సభ్యుల కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంటర్వ్యూలు - వృత్తిపరమైన ప్రయాణాలు ఫలించకపోవచ్చు. వృత్తి - వ్యాపారాల్లో మాటలు పడాల్సి రావచ్చు. కొబ్బరి - పండ్లు - పూలు - కూరగాయలు - చిరు వ్యాపారులకు కలిసి వస్తుంది. కోళ్ల - మత్స్య - గొర్రెల వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.

కుంభరాశి: రక్షణ - న్యాయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. చర్చలు ఫలిస్తాయి. పెట్టుబడులు - రుణాల విషయంలో అంచనాలు ఫలించకపోవడంతో నిరుత్సాహం. దంపతుల మధ్య అనోన్యత నెలకొంటుంది. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. సంతానం విషయంలో ఓర్పు - నేర్పు చాలా అవసరం.

మీనరాశి: దానధర్మాలకు ఖర్చు చేస్తారు. ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు. సంస్మరణాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. రుణ ప్రయత్నాలు - పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు వాయిదా వేయండి. ప్రైవేటు సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. కుటుంబీకులు - సన్నిహితుల ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి.