Begin typing your search above and press return to search.

నిను వీడని నీడను నేను అంటున్న పురంధేశ్వరి

By:  Tupaki Desk   |   7 Oct 2015 8:27 AM GMT
నిను వీడని నీడను నేను అంటున్న పురంధేశ్వరి
X
ఎన్టీఆర్ గారాల పట్టి అయి ఉండి కూడా కాంగ్రెస్ లో చేరి... ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేసిన పురంధేశ్వరి మొన్నటి ఎన్నికల సమయంలోమారిన సమీకరణల్లో భాగంగా బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. బీజేపీ, టీడీపీలు మిత్రపక్షాలు కావడం... రాష్ట్రంలో బీజేపీ టీడీపీ ప్రభుత్వంలో ఉంది.... అయినా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి... పురంధేశ్వరికి సోదరి భర్త అయిన చంద్రబాబుకు మాత్రం ఆమెతో ఇబ్బంది తప్పడం లేదు. టీడీపీలో ఉండగానే విభేదాలతో కాంగ్రెస్ లోకి వెళ్లిపోయిన పురంధేశ్వరి కుటుంబం ఆ తరువాత చంద్రబాబును టార్గెట్ చేసి రాజకీయాలు చేసింది... ఇప్పుడు మిత్రపక్షంగా ఉన్నప్పటికీ పురంధేశ్వరి చంద్రబాబును ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారని టీడీపీనేతలు అంటున్నారు.

తాజాగా పురంధేశ్వరి ఏపీ ప్రభుత్వం చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు, భోగాపురం ప్రాజెక్టుల పైన అనుమానాలు వ్యక్తం చేశారు. బిజెపి మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా ఉన్న ఆమె ఆయా ప్రాజెక్టుల పైన మిత్రపక్షమైన తమకు కలిగిన అనుమానాలు తొలగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోయినప్పటికీ దానికి సమానమైన అవకాశాలు కల్పించేందుకు కేంద్రం చూస్తోందని తెలిపారు. రాజధాని మాస్టర్ ప్లాన్, డిస్ట్రిబ్యూటరీ ప్రాజెక్టు రిపోర్టు ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం పంపించకపోవడం వల్లే కేంద్రం నుంచి ఇంకా నిధులు రాలేదంటూ మరో చంద్రబాబుపై మరో రాయి వేశారు.