Begin typing your search above and press return to search.

సీఎం బామ్మ‌ర్దిని డ‌బ్బుల కోసం టార్చ‌ర్ చేస్తున్నారు

By:  Tupaki Desk   |   30 April 2016 4:16 PM GMT
సీఎం బామ్మ‌ర్దిని డ‌బ్బుల కోసం టార్చ‌ర్ చేస్తున్నారు
X
త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో డీఎండీకే-ప్రజాసంక్షేమ కూటమి-టీఎంసీ సీఎం అభ్య‌ర్థి - అగ్ర‌హీర్‌ విజ‌య‌కాంత్ పార్టీకి కొత్త చిక్కులు మొద‌ల‌వుతున్నాయి. మిగ‌తా పార్టీలు నామ‌మాత్ర‌పు పోటీకి ప‌రిమితం అవ‌డం - విజ‌యకాంత్ వ‌ద్ద సొమ్ములున్న‌ట్లు ప్ర‌చారం సాగుతుండ‌టంతో పార్టీ త‌ర‌ఫున బ‌రిలో నిలిచిన‌ నేతలంతా కొత్త త‌ర‌హా వేధింపులు మొద‌లుపెట్టారు. ఎన్నికల ఖర్చుల కోసం డబ్బు అందించాలంటూ డీఎండీకే పార్టీ రాష్ట్ర యువజన సంఘ అధ్యక్షుడు - విజయకాంత్‌ బావమరిది సుదీష్‌ కు ఫోన్ లలో టార్చ‌ర్ చేస్తున్నార‌ట‌.

డీఎండీకే-ప్రజాసంక్షేమ కూటమి-టీఎంసీలు కలిసి ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో తృతీయకూటమి అవతారమెత్తిన విషయం తెలిసిందే. ఈ కూటమికి సినీనటుడు విజయకాంత్‌ నేతృత్వంలోని డీఎండీకే నాయకత్వం వహిస్తోంది. ఈ కారణంగా తన పార్టీ మాత్రమే కాకుండా కూటమి పార్టీల అభ్యర్థుల ప్రచారాలు - ఎన్నికల నిర్వహణ పనులను కూడా ఈ పార్టీ పర్యవేక్షిస్తోంది. విజ‌య‌కాంత్ బావ‌మ‌రిది సుదీష్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ పర్యవేక్షణ పనులు చేపడుతున్నారు. ఈయన తమ పార్టీ అభ్యర్థులు - కూటమిలో కొనసాగుతున్న వీసీకే - ఎండీఎంకే - సీపీఎం - సీపీఐల అభ్యర్థులకు మద్దతుగా కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన వెళ్లే ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థులు తమకు ఎన్నికల ఖర్చుల కోసం డబ్బు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేయసాగారు. వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో ఉక్కిబిక్కిరవుతున్నారు. ఈ క్ర‌మంలో తన పర్యటనను అర్ధంతరంగా ముగించుకొని వేరే నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న విజయకాంత్‌ చెంతకు చేరారు. ఆయనతో తన గోడును వెళ్లబోసుకున్నారు.

అయితే ఇక్క‌డితో క‌డూఆ పార్టీ నేత‌ల ఎపిసోడ్ ముగిసిపోలేదు. వివిధ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు సుదీష్‌ కు ఫోన్‌ చేసి డబ్బు కోసం ఒత్తిడి చేశారు. దీంతో ఆయన తన సెల్‌ ఫోన్‌ ను స్విచ్‌ ఆఫ్‌ చేసినట్లు తెలిసింది. ఈ విషయమై ఆ కూటమిలోని అభ్యర్థులు కొందరు మాట్లాడుతూ గత 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిలో డీఎండీకే కొనసాగిన స‌మ‌యంలో కూటమికి నాయకత్వం వహించిన అన్నాడీఎంకే డీఎండీకేతో సహా పలు పార్టీల అభ్యర్థుల ఎన్నికల ఖర్చు కోసం డబ్బు అందించినట్లు గుర్తు చేశారు. అదేవిధంగానే ఈ సారి జరుగుతున్న ఎన్నికల్లో కూటమికి నాయకత్వం వహించే వారే డబ్బు అందించాలన్న డిమాండ్‌ తో డీఎండీకేపై ఒత్తిడి తెచ్చినట్లు వివరించారు. కూటమిలోని ప్రధాన పార్టీలైన టీఎంసీ - ఎండీఎంకేలు పెద్దగా డబ్బు కోసం డిమాండ్‌ చేయలేదని, మిగిలిన చిన్న తరహా పార్టీల అభ్యర్థులే ఈ మేరకు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిసింది. డీఎండీకేలో టిక్కెట్టు అందుకున్న వారిలో అనేకమంది ఆర్థికంగా వెనుకబడిన వారే. అటు పార్టీకి - పార్టీ అధ్యక్షుడు విజయకాంత్‌ కు విశ్వాసపాత్రులుగా ఉన్నందువల్లే వారికి సీటు ఇచ్చినట్లు తెలిసింది. కాని, వారు ఎన్నికల ఖర్చులకు కూడా డబ్బు లేక ప్రచారాలు సాగించలేని పరిస్థితి నెలకొందని పార్టీ వర్గీయులు కొందరు తెలిపారు.