Begin typing your search above and press return to search.

‘జోగులాంబ’ సెంటిమెంట్ కు కేసీఆర్ రియాక్షన్?

By:  Tupaki Desk   |   23 July 2016 6:45 AM GMT
‘జోగులాంబ’ సెంటిమెంట్ కు కేసీఆర్ రియాక్షన్?
X
తెలంగాణకాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ నేతగా పేరొందిన మాజీ మంత్రి డీకే అరుణ నోటి మాట ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విషయం ఏదైనా కానీ నోరు విప్పితే చాలు..ఆమె వాదనకు ప్రత్యర్థులు నోటి వెంట మాట రాని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో.. గద్వాల్ ను జిల్లాగా మార్చాలన్న పట్టుదలతో ఆందోళన చేస్తున్న అరుణమ్మ తాజాగా తన డిమాండ్ కు దేవుడి సెంటిమెంట్ ను తెర పైకి తీసుకొచ్చారు.

రాజకీయ కోణంలో అయితే గద్వాల్ జిల్లాను కేసీఆర్ ప్రకటించరన్న భావనలో ఉన్న డీకే అరుణ.. తన డిమాండ్ కు తాజాగా సరికొత్త కలర్ ను తెర మీదకు తీసుకొచ్చారు. గద్వాలను జోగాంబ జిల్లాగా చేస్తానని కృష్ణా నదిలో మునిగి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలని ఆమె కోరుతున్నారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా గొందిమళ్లకు వస్తున్న కేసీఆర్.. కొత్త జిల్లాగా జోగులాంబ జిల్లాగా పేర్కొనని పక్షంలో అమ్మవారే ఆయన సంగతి చూస్తారని వ్యాఖ్యానించటం గమనార్హం.

‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగా చండీయాగాలు చేసి ఉంటే జోగులాంబ పేరుపై జిల్లా ఏర్పాటు చేయాలి. యాగాలు చేసినా.. మంచి పనులు చేయకపోతే ప్రయోజనం ఉండదు’’ అని వ్యాఖ్యానించారు. గద్వాలను జిల్లాగా చేయాలంటూ నాలుగు రోజుల క్రితం జమ్ములమ్మ ఆలయం నుంచి ప్రారంభించిన డీకే అరుణమ్మ పాదయాత్రలో భాగంగా మొత్తంగా 62 కిలో మీటర్లు నడిచారు. మరి.. డీకే అరుణ ప్రయోగించిన అమ్మోరి సెంటిమెంట్ కేసీఆర్ మీద ఎంతవరకు వర్క్ వుట్ అవుతుందో చూడాలి.