Begin typing your search above and press return to search.

న్యూస్ చానెళ్లకు డీజీపీ వార్నింగ్!

By:  Tupaki Desk   |   20 Sep 2018 4:11 PM GMT
న్యూస్ చానెళ్లకు డీజీపీ వార్నింగ్!
X
ప్ర‌స్తుతం కొన్ని న్యూస్ చానెళ్లు టీఆర్పీలే ప‌ర‌మావ‌ధిగా విలువ‌ల‌కు తిలోద‌కాలిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మ టీఆర్పీల కోసం...హింస‌ను ప్రేరేపించేలా ఉన్న దృశ్యాల‌ను ...అస‌భ్య‌క‌రంగా ఉన్న దృశ్యాల‌ను ప‌దే ప‌దే ప్ర‌సారం చేయ‌డం చూస్తూనే ఉన్నాం. సెక్స్ - క్రైం...ఈ రెండింటిని కొన్ని మీడియా చానెళ్లు క్యాష్ చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తూ...అందులో స‌ఫ‌లం కూడా అవుతున్నాయి. ప్ర‌ణ‌య్ హ‌త్యోదంతం తాలూకు సీసీటీవీ ఫుటేజీని చాలా చానెళ్లు ప‌దే ప‌దే ప్ర‌సారం చేశాయి. ఆ త‌ర్వాత నిన్న ఎర్ర‌గ‌డ్డ‌లో సందీప్ - మాధ‌విల పై హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో న్యూస్ చానెళ్ల‌పై తెలంగాణ స‌ర్కార్ కొన్ని ఆంక్ష‌లు విధించింది. వీక్ష‌కుల‌ను ఆక‌ర్షించి టీఆర్పీల‌ను పెంచుకునే క్ర‌మంలో హింసాత్మ‌క దృశ్యాల‌ను ప‌దేప‌దే ప్ర‌సారం చేయ‌వ‌ద్దంటూ తెలంగాణ డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి నేడు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

`ప‌రువు` హ‌త్య‌లను ప‌దే ప‌దే చూపించ‌డం `ప్రోగ్రామ్ కోడ్ అండ‌ర్ కేబుల్ టెలివిజ‌న్ నెట్వ‌ర్క్స్(రెగ్యులేష‌న్) యాక్ట్ 1995`ను ఉల్లంఘించ‌డం కింద‌ర‌కు వ‌స్తుంద‌ని ఆయ‌న తెలిపారు. కొన్ని చానెళ్లు ప‌దే ప‌దే ఆ త‌ర‌హా ప‌రువు హ‌త్య‌లు, హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు ప్ర‌సారం చేస్తున్నాయ‌ని ఆయ‌న అన్నారు. ఆ దృశ్యాలు....హింస‌ను ప్రేరేపించేలా ఉన్నాయ‌ని, వాటిని చూసి మ‌రి కొంతమంది అదే త‌ర‌హా ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డే అవ‌కాశ‌ముంద‌ని అన్నారు. అందుకే, ఆ దృశ్యాల‌ను ప‌దేప‌దే ప్ర‌సారం చేయ‌ద్ద‌ని ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అన్ని చానెళ్ల యాజ‌మాన్యాలు ...స‌మాజ శ్రేయ‌స్సు కోసం ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. హింస‌ను ప్రేరేపించ‌డం - మ‌త ఘ‌ర్ష‌ణ‌లు - మ‌త ఘ‌ర్ష‌ణ‌లు రెచ్చ‌గొట్టేలా ఉన్న ప్ర‌సంగాలు - అస‌త్య ప్ర‌చారాలు..ప్ర‌క‌ట‌న‌లు - శాంతిభ‌ద్ర‌త‌ల‌కు భంగం క‌లిగించే విష‌యాలు - మూఢ‌విశ్వాసాల‌ను పెంపొందించేలా ఉండే దృశ్యాలు....వంటివి ప్ర‌సారం చేయ‌డం `ప్రోగ్రామ్ కోడ్ అండ‌ర్ కేబుల్ టెలివిజ‌న్ నెట్వ‌ర్క్స్(రెగ్యులేష‌న్) యాక్ట్ 1995`ఉల్లంఘ‌న కింద‌కు వ‌స్తుంది.