Begin typing your search above and press return to search.

డీఎస్‌..కేసీఆర్‌ తో తేల్చుకునేందుకు సిద్ధ‌మ‌య్యారా?

By:  Tupaki Desk   |   19 Aug 2018 12:43 PM GMT
డీఎస్‌..కేసీఆర్‌ తో తేల్చుకునేందుకు సిద్ధ‌మ‌య్యారా?
X
సీనియర్ నేత - రాజ్యసభసభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ స‌స్పెన్ష‌న్ ఫిర్యాదు, ఆయ‌న త‌న‌యుడిపై కేసు ఎపిసోడ్‌ అనూహ్య‌మైన మ‌లుపులు తిరుగుతోంది. పార్టీ వ్య‌తిరేక కార్య‌కలాపాల‌కు పాల్ప‌డుతున్నారంటూ నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎంపీ - సీఎం కేసీఆర్ త‌న‌య క‌విత స‌హా నిజామాబాద్‌ జిల్లా ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలు సోనియాగాంధీ స‌హా ఇతర నేతలను ఢిల్లీలో కలుసుకోవడంతో పాటు - త్వరలో ఆ పార్టీలో చేరబోతారన్న వార్తలు రావ‌డం, డీఎస్ త‌న‌యుడు అర‌వింద్ బీజేపీలో దూకుడుగా ముందుకు వెళ్ల‌డం వంటివి ఇందుకు కార‌ణాల‌ని ఒక చ‌ర్చ ఉంది. అనంత‌రం కొద్దికాలానికి ఆయ‌న తనయుడు సంజయ్‌ పై లైంగిక వేధింపుల కేసు న‌మోదవ‌డం - అనంత‌రం ఆయ‌న అరెస్ట‌వ‌డం తెలిసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ విష‌యంలో తాజాగా డీఎస్ వేసిన స్టెప్ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

డీఎస్ కుమారుడు సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ నిజామాబాద్ శాంకరి నర్సింగ్‌ కాలేజీ విద్యార్థినిలు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ మధ్య కాలంలో తమలో ఇద్దరిని సంజయ్ బలవంతంగా తీసుకెళ్లి లైంగిక దాడులు చేయడానికి ప్రయత్నించారని హోంమంత్రికి విద్యార్థినిలు వివరించారు. ఆరు నెలలుగా తమను సంజయ్‌ లైంగికంగా వేధిస్తున్నాడని మొత్తం 11 మంది విద్యార్థిని ఫిర్యాదులో పేర్కొన‌గా నిర్భయ చట్టం కింద సంజయ్‌ పై కేసు నమోదు అయింది. అనంత‌రం సంజ‌య్‌పై ఎస్సీ - ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇలా ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామాల మ‌ధ్య డీఎస్‌ కుమారుడిని అరెస్ట్ చేశారు.

అయితే, ఈ ప‌రిణామంపై డి. శ్రీనివాస్ అనూహ్య స్టెప్ వేశారు. లైంగిక వేధింపుల కేసులో త‌న త‌న‌యుడు సంజ‌య్ అరెస్టును సవాల్ చేస్తూ రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. సంజయ్ అరెస్టు విషయంలో పోలీసులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు - హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారని - సీఆర్పీసీ 41-ఏ నిబంధన ప్రకారం నోటీసులు జారీచేసి సంజాయిషీ తీసుకోకుండానే అరెస్టుచేసి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారని తెలిపారు. ఈ పిటిషన్‌ పై విచారణను ఉమ్మడి హైకోర్టు ఈ నెల 21న చేపట్టనుంది. కాగా, టీఆర్ ఎస్ స‌ర్కారు పెద్ద‌ల‌తో తేల్చుకునేందుకే డీఎస్ ఇలా ఇంప్లీడ్ అయ్యార‌ని అంటున్నారు. ఈ కేసులో తీర్పు వెలువ‌డిన అనంత‌రమే రాష్ట్ర ప్ర‌భుత్వం పెద్ద‌లు స్టెప్ వేయ‌నున్న‌ట్లు చెప్తున్నారు.