Begin typing your search above and press return to search.

ఆ 13 నిమిషాలే టీడీపీకి కీల‌కం!

By:  Tupaki Desk   |   19 July 2018 4:45 PM GMT
ఆ 13 నిమిషాలే టీడీపీకి కీల‌కం!
X
రేపు పార్ల‌మెంటులో జ‌ర‌గ‌బోతోన్న అవిశ్వాస తీర్మానం ఓటింగ్ పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ ఏర్ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ప్ర‌త్యేకించి న‌వ్యాంధ్ర ప్ర‌జ‌లు ..ఈ ఓటింగ్ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో తీర‌ని అన్యాయం చేసిన బీజేపీకి బుద్ధిచెప్పేందుకు ...అవిశ్వాస తీర్మానాన్ని ఆయుధంగా చేసుకోవాల‌ని విప‌క్ష ఎంపీలు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో - అవిశ్వాస తీర్మానంపై ఆయా పార్టీలు మాట్లాడే సమయాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్ణ‌యించారు. పార్టీల బలాన్ని బ‌ట్టి సమయాన్ని కేటాయించారు. మ‌రోవైపు, లోక్ సభలో రేపు అవిశ్వాస తీర్మానంపై చర్చ సంద‌ర్భంగా క్వ‌శ్చన్ అవర్ ఉండదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ పేర్కొన్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరుగుతుందని అన్నారు. కాగా, లోక్ సభలో రేపు ఉదయం 11 గంటలకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అవిశ్వాస తీర్మానం పై చర్చను ప్రారంభించనున్నారు. త‌మ‌కు కేటాయించిన 13 నిమిషాల స‌మ‌యాన్ని టీడీపీ ఏవిధంగా స‌ద్వినియోగం చేసుకోబోతోంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

పార్టీలవారీగా కేటాయించిన స‌మ‌యం

బీజేపీ - 3.33 గంటలు

కాంగ్రెస్ - 38 నిమిషాలు

అన్నాడీఎంకే - 29 నిమిషాలు

టీఎంసీ - 27 నిమిషాలు

బీజేడీ - 15 నిమిషాలు

శివసేన -14 నిమిషాలు

టీడీపీ - 13 నిమిషాలు

టీఆర్ఎస్ - 9 నిమిషాలు

సీపీఐ -7 నిమిషాలు

ఎస్పీ - 6 నిమిషాలు

ఎల్జీఎస్పీ - 5 నిమిషాలు