Begin typing your search above and press return to search.

300 ఏళ్ల త‌రువాత క‌ళ్లు తెరిచింది

By:  Tupaki Desk   |   26 Sep 2016 5:18 AM GMT
300 ఏళ్ల త‌రువాత క‌ళ్లు తెరిచింది
X
నాణానికి రెండు పార్శ్వాలు ఉన్న‌ట్టుగానే... ఇలాంటి ఘ‌ట‌న వెన‌క కూడా రెండు ర‌కాల అభిప్రాయాలు ఉంటాయి! కొంత‌మంది దీన్నోక అద్భుతం అంటున్నారు, దేవుడు ఉన్నాడంటున్నారు! మ‌రికొంత‌మంది ఇదొక ఫేక్ న్యూస్ అని కొట్టిపారేస్తున్నారు. ఏదేమైనా ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఈ టాపిక్ వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ టాపిక్ ఏంటంటే... 300 సంవ‌త్స‌రాలు కింద‌ట మ‌ర‌ణించిన బాలిక ఇప్పుడు క‌ళ్లు తెరించిందంటూ ఒక వీడియో యూట్యూబ్ లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఆ వీడియో తీసిన‌ వ్య‌క్తే ఈ అద్భుతాన్ని కెమెరాలో బంధించాన‌ని చెబుతున్నాడు.

మెక్సికోలో ఉన్నఒక‌ కాథ‌డ్ర‌ల్ చ‌ర్చిలో 300 ఏళ్ల కిందటి శ‌వానికి ఒక పర్యాట‌కుడు వీడియో తీశాడు. ఇంత‌కీ, ఈ శ‌వం హిస్ట‌రీ ఏంటంటే... ఈమె పేరు శాంతా ఇనోసెన్సియా. చిన్న‌ప్ప‌టి నుంచీ స‌న్యాసినిగా మారాల‌ని అనుకుంటూ ఉండేద‌ట‌. ఇంట్లో ఎంత చెప్పినా వినేది కాదు. త‌న ఇష్టాన్ని తెలిసిన‌వారు చాలాసార్లు వారించారు. అయినా ఎవ్వ‌రికీ తెలియ‌కుండా క్రీస్తుకు సంబంధించిన పుస్త‌కాల‌ను ర‌హ‌స్యంగా చ‌దువుకుంటూ ఉండేది. ఒక‌సారి కొంత‌మంది నన్స్ వాళ్లింటి ప‌క్క నుంచీ న‌డిచి వెళ్తుంటే... వాళ్ల‌తో క‌ల‌సి వెళ్లిపోతాన‌ని మారాం చేసింది. వాళ్లు కూడా పాప‌ను త‌మ‌తో పంపించెయ్య‌మంటూ కోరారు. కానీ, ఆమె స‌న్యాసిని కావ‌డం తండ్రికి ఏమాత్రం ఇష్టం లేదు. త‌న‌కు ఇష్టం లేని ప‌నిని చేస్తున్న కుమార్తెపై ఆగ్ర‌హంతో క‌త్తితో పొడిచి చంపేశాడు! త‌రువాత‌, మ‌తాధికారులు ఆమె మృత‌దేహాన్ని స్థానిక చ‌ర్చికి త‌ర‌లించి, మ‌మ్మీల‌ను భ‌ద్ర‌ప‌ర‌చే విధంగానే ఆమె శ‌వాన్ని చ‌ర్చిలో ఉంచారు.

అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ ఆ మృత‌దేశం చ‌ర్చిలోనే ఉంది. దేహం పాడ‌వ‌కుండా ఉండేందుకు ర‌క‌ర‌కాల ర‌సాయ‌నాలు ఎప్ప‌టిక‌ప్పుడు పూస్తూ ఉంటారు. శాంతా ఇనోసెన్సియాను చూసేందుకు ఇటీవ‌లే ఒక ప‌ర్యాట‌కుడు వెళ్లాడు. త‌న కెమెరాలో వీడియో తీస్తూ ఉండ‌గా మృత‌దేహం ఒక్క‌సారి క‌ళ్లు తెరిచి, మూసింద‌ట‌! అదే క్లిప్పింగ్ ను యూట్యూబ్ లో పెట్టాడు. ఇప్పుడు అది వైర‌ల్ అవుతోంది. కొంత‌మంది దీన్ని ఫేక్ వీడియో అనీ, గ్రాఫిక్స్ చేసింద‌ని కొట్టి పారేస్తున్నారు. మ‌రికొంత‌మంది దేవుడు ఉన్నాడని ఇలా నిరూప‌ణ అయింద‌ని పూజ‌లు చేసేస్తూ షేర్ చేస్తున్నారు.