Begin typing your search above and press return to search.

మార్కెట్లో మోడీ క్రాకర్స్ హల్ చల్!

By:  Tupaki Desk   |   27 Oct 2016 12:12 PM GMT
మార్కెట్లో మోడీ క్రాకర్స్ హల్ చల్!
X
ఏదైనా నేషనల్ ఫెస్టివల్ వచ్చిందంటే చాలు... ఆ కార్యక్రమానికి సంబందించిన పండగ వస్తువులపై సెలబ్రెటీల పేర్లు ముద్రించి అమ్మడం కామన్ అయిపోయింది. అప్పట్లో ధోనీ పేరుతో టపాసులు, తమిళ సూపర్ స్టార్ ఫోటోతో రకరకాల మందుగుండు సామాగ్రి మార్కెట్ లో దర్శనమిచ్చేది. ఈ క్రమంలో మోడీ ప్రధాని అయిన తొలినాళ్లలో కూడా రకరకాల ప్రొడక్టులపై ప్రధాని మోడీ పిక్‌ ని అచ్చువేయడం మరింత ఎక్కువైంది. మోడీ బ్రాండ్ ఇమేజ్‌ ని తమ వ్యాపారాలకు అనుకూలంగా మార్చేసుకుంటాయి కొన్ని కంపెనీలు! మొన్నటికి మొన్న జరిగిన దసరా పండక్కి కూడా తయారీదారులు మోడీ పేరునూ ఫోటోనూ బాగానే వినియోగించుకున్నారు.

ఇదే క్రమంలో మరో రెండు మూడు రోజుల్లో రాబోయే అతిపెద్ద పండగ దీపావళి. దీంతో మోడీ పేరిట ఫైర్ క్రాకర్స్ మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. మోడీ ఫోటోతోనే కాకుండా, ఏకంగా మోడీ పేరున కూడా క్రాకర్స్ వచ్చేశాయి. ముఖ్యంగా ఈ పోకడ యూపీలోని అలహాబాద్- వారణాసిలో మరింత ఎక్కువగా ఉంది. ఇదే సమయంలో త్వరలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. తయారీదారులు మోడీ బ్రాండ్‌ ని, సమాజ్ వాదీ పార్టీ నేతల ఫోటోలను ఇలా ఉపయోగించిన టపాకాయలను పోటాపోటీగా అమ్ముకాలు సాగిస్తున్నారు. మార్కెటింగ్ కి కాదేదీ అనర్హం అని నిరూపించే ప్రయత్నం మరోసారి చేసేస్తున్నారు ఈ బ్రాండ్ ల తయారీదారులు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/