Begin typing your search above and press return to search.

ఆ న‌టి ఇంటి ముందు నెంబ‌రు లేని కంటైన‌ర్

By:  Tupaki Desk   |   24 Jun 2019 4:57 AM GMT
ఆ న‌టి ఇంటి ముందు నెంబ‌రు లేని కంటైన‌ర్
X
అటు ప్ర‌ముఖులు కానీ.. ఇటు సామాన్యులు కానీ ఏ విష‌యం మీద ఎలా రియాక్ట్ అయ్యే అంశం మీద జ‌రుగుతున్న ర‌చ్చ మామూలుగా లేదు. సెల‌బ్రిటీలుగా ప్ర‌జ‌ల్లో ఇమేజ్ ఉన్న వారి మీద ఉండే ఆస‌క్తి అంతా ఇంతా కాదు. దీంతో వారు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసే పోస్టుల చుట్టూ చాలా సంద‌ర్భాల్లో హాట్ టాపిక్ గా మారుతుంటాయి. తాజాగా అలాంటిదే చోటు చేసుకుంది.

ప్ర‌ముఖ సినీ న‌టి క‌మ్ రాజ‌కీయ నాయ‌కురాలు కుష్భూ ఇంటికి స‌మీపంలో ఒక కంటైన‌ర్ ప‌ది రోజులుగా నిలిపేసి ఉంది. ఈ కంటైన‌ర్ కు నెంబ‌రు కూడా లేక‌పోవటంతో ఆమె కొత్త అనుమానాన్ని వ్య‌క్తం చేశారు. చెన్నైలో తాను నివాసం ఉండే శాంతోమ్ ఇంటికి ద‌గ్గ‌ర్లో ఈ ఉదంతం చోటు చేసుకుంది.

ఈ విష‌యాన్నిసోష‌ల్ మీడియాలో తాజాగా షేర్ చేసుకున్నారు. నెంబ‌రు లేని కంటైన‌ర్ లారీ గ‌డిచిన ప‌ది రోజులుగా నిలిచి ఉంద‌ని.. ప్ర‌జ‌లెవ‌రూ దీన్ని ప‌ట్టించుకోవ‌టం లేద‌ని.. దీనిపై ఫిర్యాదు చేసే ఆలోచ‌న ఎవ‌రికి రావ‌టం లేద‌న్న ట్వీట్ చేశారు. దీంతో మంచి ప‌ని చేసి తిట్లు తినాల్సిన ప‌రిస్థితి కుష్బూ ఎదుర్కొంటున్నారు.

ఏదైనా విష‌యాన్ని గుర్తిస్తే.. ఫ‌లానా స‌మ‌స్య ఉంది.. సంబంధిత వ‌ర్గాలు స్పందించాల‌ని పేర్కొంటే స‌రిపోతుంది. అందుకు భిన్నంగా ఎవ‌రో ఒక‌రిని బాధ్యుల్ని చేసేలా పోస్ట్ చేస్తేనే ఇబ్బంది. తాజాగా కుష్బూకు అలాంటి ప‌రిస్థితే ఎదుర్కొంటున్నారు. ఎవ‌రికి కంప్లైంట్ చేయాల‌న్న ఆలోచ‌న రావ‌ట్లేద‌ని చెప్పే ఆమె.. త‌న‌కు తానుగా ఫిర్యాదు చేయొచ్చు క‌దా? అని ప్ర‌శ్నిస్తున్నారు.

అంతేకాదు.. పోలీసుల‌కు ఫిర్యాదు చేయాల‌ని చెప్పే ముందు.. మీరే ఆ ప‌ని చేయొచ్చుగా అంటూ మ‌రికొంద‌రు ఎట‌కారం చేశారు. దీంతో కుష్బూకు కోపం వ‌చ్చింది. స‌ద‌రు లారీ త‌న వీధిలో లేద‌ని.. ఒక‌వేళ ఉంటే తాను ఫిర్యాదు చేసేదానినని చెప్పుకొన్నారు. హేళ‌న చేసే క‌న్నా.. ప‌ని జ‌ర‌గ‌టం ముఖ్యం. దుర‌దృష్ట‌వ‌శాస్తు అలాంటిదేమీ జ‌ర‌గ‌క‌పోగా.. వాగ్వాదాలు అంత‌కంత‌కూ ఎక్కువ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. లారీ విష‌య‌మై కుష్బూ చేసిన ట్వీట్ కు పోలీసులు రియాక్ట్ అయ్యారు.స‌ద‌రు నెంబ‌ర్ ప్లేట్ లేని కంటైన‌ర్ ఎక్క‌డ ఉందన్న వివ‌రాల్ని సేక‌రిస్తున్నారు. మంచి ప‌ని చేయ‌టం ఓకే. కానీ.. ఆ పేరుతో క్లాస్ పీకినా.. బాధ్య‌త‌లు గుర్తు చేసినా ఇప్పుడెవ‌రూ ఇష్ట‌ప‌డ‌టం లేద‌న్న విష‌యాన్ని కుష్బూ లాంటి వాళ్లు అర్థం చేసుకుంటే అన‌వ‌స‌ర వివాదాల్లోకి చిక్కుకోకుండా ఉంటారని చెప్ప‌క త‌ప్ప‌దు.