మోడీ హెలిక్యాప్టర్ల డబ్బులు తెచ్చాడా?

Mon Apr 15 2019 16:35:17 GMT+0530 (IST)

మోడీ హెలీక్యాప్టర్ కర్ణాటకలో దిగింది. అందులోంచి భారీ నల్లటి సూటికేసును నలుగురు వ్యక్తులు అతికష్టంగా మోసుకుంటూ వెళ్లి దూరంగా ఆగిన ఇన్నోవా కారులో పెట్టారు.. ఆగమేఘాల మీద ఆ కారు ఎక్కడికో వెళ్లిపోయింది. అందులో మోడీ వెళ్లలేదు.. మరి ఆ కారు ఎక్కడికి వెళ్లింది. ఆ బ్లాక్ బాక్స్ లో ఏముంది? ఇప్పుడు ఇదే ప్రశ్నను సంధిస్తున్నాయి కర్ణాటక పీసీపీ వర్గాలు.. మోడీ హెలీక్యాప్టర్ లో భారీ ఎత్తున డబ్బులు తెచ్చారన్నది కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆరోపణ. అందుకే ఆ వీడియోను కేపీసీపీ సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసి దీనిపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రధాని నోరు విప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

మోడీ కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఆయనతోపాటు మూడు హెలీక్యాప్టర్లు వచ్చాయి. అవి ల్యాండయిన తర్వాత అందులో ఉన్న ఒక హెలీక్యాప్టర్ నుంచి భారీ నల్లటి సూట్ కేసును దించి తీసుకెళ్లడం వీడియోలో రికార్డ్ అయ్యింది. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే మోడీ ఇలా అక్రమాలకు పాల్పడ్డారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మరి అడ్డంగా దొరికిన మోడీజీ దీనికి ఏం సమాధానం ఇస్తాడన్నది ఆసక్తిగా మారింది.

వీడియో కోసం క్లిక్ చేయండి