Begin typing your search above and press return to search.

మోడీకి జ‌మిలి ఛాలెంజ్ విసిరిన కాంగ్రెస్‌

By:  Tupaki Desk   |   14 Aug 2018 12:30 PM GMT
మోడీకి జ‌మిలి ఛాలెంజ్ విసిరిన కాంగ్రెస్‌
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ప‌ద‌కొండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కోరుతూ లా క‌మిష‌న్ కు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా లేఖ రాసిన నేప‌థ్యంలో ఈ అంశంపై కాంగ్రెస్ స్పందించింది. జ‌మిలిపై మోజు ప‌డుతున్న బీజేపీకి తాజాగా స‌వాల్ విసిరింది.

ప్ర‌ధాని మోడీకి స‌వాల్ విసురుతూ.. లోక్ స‌భ‌ను ర‌ద్దు చేసి ఈ ఏడాది చివ‌ర్లో ఎన్నిక‌లు జ‌ర‌గాల్సిన నాలుగు రాష్ట్రాల‌తో పాటు సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాల‌ని స‌వాల్ విసిరారు. నాలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల‌తో పాటు.. సార్వ‌త్రికానికి కాంగ్రెస్ పార్టీ స్వాగ‌తిస్తుంద‌ని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

అంతేకానీ.. ఈ ఏడాది చివ‌ర్లో జ‌ర‌గాల్సిన అసెంబ్లీ ఎన్నిక‌ల్ని వాయిదా వేసి.. సార్వ‌త్రికంతో పాటు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌టం చ‌ట్ట‌బ‌ద్ధంగా సాధ్యం కాదంది. రాజ్యాంగం ప్ర‌కారం జ‌మిలి ఎన్నిక‌ల్ని మేలో జ‌ర‌ప‌టం కుద‌ర‌దంటూ కాంగ్రెస్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు. మిజోరాం.. రాజ‌స్థాన్.. ఛ‌త్తీగ‌ఢ్‌.. మ‌ధ్య ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ గ‌డువు ముగియ‌క ముందే ఎన్నిక‌ల్ని నిర్వ‌హించాల్సి ఉంటుంద‌న్నారు.

ప్ర‌ధాని మోడీ కోరుతున్న‌ట్లుగా జ‌మిలి ఎన్నిక‌ల‌కు జ‌ర‌పాలంటే లోక్ స‌భ‌ను త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేసి.. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు లోక్ స‌భ ఎన్నిక‌లు చేప‌ట్టాల‌న్నారు. ఇందుకు కాంగ్రెస్ స్వాగ‌తిస్తుందంటూ స‌వాల్ విసిరారు. మ‌రి.. దీనిపై బీజేపీ ఎలా రియాక్ట అవుతుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.