Begin typing your search above and press return to search.

దక్షిణాన కాంగ్రెస్ అవుట్..!?

By:  Tupaki Desk   |   18 Dec 2018 4:18 PM GMT
దక్షిణాన కాంగ్రెస్ అవుట్..!?
X
కాంగ్రెస్ పార్టీ వంద సంవత్సరాలకు పైబడి చరిత్ర ఉన్న పార్టీ. దేశానికి స్వతంత్రాన్ని తీసుకుని వచ్చామని - ఎందరో త్యాగ ధనులను అందిచామని - చెప్పుకునే పార్టీ. దక్షిణాది రాష్ట్రాలలో చాలా బలంగా ఉన్న పార్టీ. అయితే ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి దారుణాతి దారుణంగా ఉంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఉనికికి ఇబ్బందులు వచ్చే పరిస్దితులు తలెత్తయి. ఇది ఆ పార్టీ చేసుకున్నదే అంటున్నారు. సమైక్య తెలుగు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఆదరణ ఉంది. కాంగ్రెస్‌ను కొట్టేందుకు తెలుగుదేశం పార్టీ పుట్టింది. దీంతో కాంగ్రెస్ ప్రాభవం కొంత తగ్గింది. దివంగత నేత వైఎస్. రాజశేఖర రెడ్డి పుణ‌్యామా అని సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చారు ఆయన. అంతేకాదు గ్రామగ్రామాన కాంగ్రెస్ జెండా ఎగిరేలా ప్రజలకు ఉపయోగపడే పథకాలు తీసుకువచ్చారు. దాదాపు దశాబ్దం పాటు నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా వైభవోపేతంగా మారింది. దీంతో ఇక కాంగ్రెస్‌ కు తిరుగు ఉండదనుకున్నారు. వైఎస్‌. రాజశేఖర రెడ్డి మరణంతో పరిస్దితులు తారుమారు అయ్యాయి. తెలంగాణ ఉద్యమం పెరగడం అనవార్యంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం చకచక జరిగిపోయాయి.

ఈ పరిణామాలతో అంత వరకూ అక్కున్న చేర్చుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్‌ ను తొక్కేసారు. మరో 15 సంవత్సారాలు వరకూ ఆంధ్రప్రదేశ్‌ లో కాంగ్రెస్ పార్టీ ఎదిగే అవకాశం లేదు. ఇక తెలంగాణలో రెండవ సారి కూడా తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది. ఇంక ఇక్కడ కూడా మరో 5 ఏళ్ల వరకూ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే పరిస్ధితులు లేవు. ఆ తర్వత కూడా కాంగ్రెస్ పార్టీ పటిష‌్టమవుతుందనే ఆశాలు లేవు. ఇక తమిళనాడులో 1970 తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచింది లేదు. అక్కడ ప్రాంతీయ పార్టీలదే హవా. దశాబ్దాలుగా కేరళలో వామపక్ష పార్టీదే అధికారం. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రభావం చూపటం లేదు. ఒక్క కర్ణాటక లోనే కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షంతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇది కూడా బొటాబొటి మెజారిటీ ఉన్న ప్రభుత్వమే. ఇక్కడ పదిమంది పార్టీ వీడితే అధికారం కోల్పోవడం ఖాయం. ఈ విషయాన్ని కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన ముఖ్యమంత్రి కుమార్‌ స్వామే ప్రకటించారు. దీంతో దక్షిణాది రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లినట్టేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.