Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ చేసిన బ్లండ‌ర్‌... చేయాల్సిన ప‌ని!

By:  Tupaki Desk   |   16 May 2018 11:23 AM GMT
కాంగ్రెస్ చేసిన బ్లండ‌ర్‌... చేయాల్సిన ప‌ని!
X
78 సీట్లు గెలిచిన కాంగ్రెస్ ... త‌న ఇగోని ప‌క్క‌న పెట్టి 38 సీట్లు గెలిచిన జేడీఎస్‌ కు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి వ‌దిలిపెట్టింది. ఎందుకు? స‌మాధానాలు చాలా ఉన్నాయి.

1.ఈ రాష్ట్రం కూడా బీజేపీ చేతిలో కి కాంగ్రెస్‌కు మిగిలే రాష్ట్రాలు మూడే. ఇది కాంగ్రెస్‌ ను బ‌ల‌హీన‌ప‌రుస్తుంది.

2.రాహుల్ నాయ‌క‌త్వంపై కాంగ్రెస్ నేత‌ల‌కే అనుమానాలు క‌లిగే మొద‌ల‌వుతాయి.

3. ద‌క్షిణాదిలో మిగ‌తా రాష్ట్రాల్లో నిల‌దొక్కుకోవ‌డానికి బీజేపీకి ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది.

4. త‌ట‌స్థులు మ‌రోసారి మోడీ గురించి ఆలోచ‌న‌లో ప‌డి... వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మోడీకి పాజిటివ్ ఓట్ పెరిగే అవ‌కాశం ఉంటుంది.

అందుకే ఇగోలు ప‌క్క‌న పెట్టి - చ‌ర్చ‌లు సాగ‌దీయ‌కుండా ఒక్క గంట‌లో వేగంగా నిర్ణ‌యానికి వ‌చ్చి జేడీఎస్‌ కు అధికారం వ‌దిలిపెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధ‌మైపోయింది. వ‌చ్చే జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్ల‌లో బీజేపీని ఎదురొడ్డాలంటే క‌ర్ణాట‌క‌లో జేడీఎస్ అడిగింది చేయ‌క‌త‌ప్ప‌దు. ఎందుకంటే వారు బీజేపీ చేతిలోకి వెళ్ల‌డానికి సిద్ధంగా ఉన్నారు. మ‌ద్ద‌తు అయితే, ఇచ్చేసింది కానీ బీజేపీ నియ‌మించిన గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌య‌మే ఇక మిగిలి ఉంది. ఇదంతా ప‌క్క‌న పెడితే క‌ర్ణాట‌క నేర్పిన పాఠం ఏంటి? అక్క‌డ కాంగ్రెస్ చేసిన బ్లండ‌ర్ ఏంటి? ఒక సారి చూద్దాం.

ఎన్నిక‌లు జ‌రిగిన చాలా రాష్ట్రాల్లో బీజేపీకి మ‌ద్ద‌తిచ్చిన ప్ర‌జ‌ల సంఖ్య చాలా త‌క్కువ‌. కానీ పాల‌న మాత్రం బీజేపీ చేప‌డుతోంది. అంటే మెజార్టీ ప్ర‌జ‌ల‌కు న‌చ్చ‌న పార్టీ ప్ర‌భుత్వాల‌ను న‌డుపుతోంద‌న్నమాట‌. త్రిపుర‌లో ఇదే జ‌రిగింది. మ‌ణిపూర్‌ లో ఇదే జ‌రిగింది. గోవాలోనూ ఇదే జ‌రిగింది. కాంగ్రెస్ క‌నుక త‌న ప‌ద్ధ‌తి మార్చుకోక‌పోతే అన్ని చోట్లా ఇదే జ‌రుగుతుంది. ప్రాంతీయ పార్టీలు బీజేపీని త‌క్కువ అంచ‌నా వేస్తే... వ‌చ్చే లోక్‌ స‌భ ఎన్నిక‌ల్లో కూడా ఇదే జ‌రుగుతుంది. ఎలా?

బీజేపీది ఒక‌టే సూత్రం... తాను గెల‌వ‌దు - కేవ‌లం శ‌త్రువుల‌ను దెబ్బ‌తీస్తుంది. శ‌త్రువులు ఎపుడైతే దెబ్బ తింటారో ఇక తాను నిల‌బ‌డ‌టం సులువే. ప్ర‌తిచోటా ఇదే సూత్రం. ఎన్నిక‌ల ముందు ఇత‌ర పార్టీల్లో ఓట్ల‌ను నాశ‌నం చేయ‌డం. ఇక్క‌డ నాశ‌నం చేయ‌డం అంటే అసంతృప్త బుల్లి నాయ‌కుల‌ను ఎగ‌దోసి వారి చేత తిరుగుబాటు చేయిస్తుంది. వారు బీజేపీకి వేయాల‌ని - పార్టీలోకి రావాల‌ని కోరుకోదు. కేవ‌లం ఉన్న పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ర‌చ్చ చేస్తే చాలు. మూడో పార్టీకి అండ‌గా నిల‌వ‌డం. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు ఎక్కువగా చీల్చ‌డం, విభేదాల‌ను పెంచ‌డం... ఇలాంటి అకృత్యాల‌ను ఆ పార్టీ త‌న విధానంగా మార్చుకుంది. ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం ఏంటంటే... వాళ్లెవ‌రినీ త‌న పార్టీలో చేర్చుకోదు. కేవ‌లం అవ‌త‌లి పార్టీ బ‌లాన్ని నాశ‌నం చేస్తుంది.

మ‌రి క‌ర్ణాట‌క నుంచి దేశంలోని కాంగ్రెస్‌ - ఇత‌ర పార్టీలు ఏం నేర్చుకోవాలి?- దేశంలో మోడీ వ్య‌తిరేక ఓటు దేశంలో బ‌లంగా ఉంది. క‌ర్ణాట‌క‌నే తీసుకుంటే 66 శాతం ప్ర‌జ‌లు మోడీకి వ్య‌తిరేకంగా ఓటు వేశారు. ఒక వేళ క‌ర్ణాట‌క‌లో జేడీఎస్‌-కాంగ్రెస్ క‌లిసి ఎన్నిక‌ల ముందు పొత్తు పెట్టుకుని ఉంటే బీజేపీకి క‌నీసం 20 సీట్లు కూడా వ‌చ్చేవి కాదు. పొత్తుతో బ్ర‌హ్మాండ‌మైన విజ‌యం సాధించే అవ‌కాశం ఉండేది. ఇదే కాంగ్రెస్ నేర్చుకోవాల్సిన పాఠం. త‌న ఇగోని క‌ర్ణాట‌క‌లో ప‌క్క‌న‌పెట్టిన‌ట్లే వ‌చ్చే ఎన్నిక‌ల్లో దేశ‌మంత‌టా... కాంగ్రెస్ అదే ఫాలో అవ్వాలి. ఇత‌ర పార్టీల‌ను క‌న్సాలిడేట్ చేయాలి. లేక‌పోతే బీజేపీకి త‌నంత‌ట తానే ఎర్ర తివాచీ ప‌ర‌చినట్టు అవుతుంది.

కేర‌ళ, వెస్ట్‌ బెంగాల్ క‌మ్యూనిస్టు పార్టీలు - బీఎస్పీ - స‌మాజ్‌ వాదీ - ఆర్జేడీ - ఎన్సీపీ - బిజూ జ‌న‌తాద‌ళ్ - డీఎంకే - వైసీపీ వీట‌న్నింటినీ క‌లుపుకుని పోతే బీజేపీ వ్య‌తిరేక ఓటును ఒక్క‌టి చేసి ఆ పార్టీ పీచ‌మ‌ణ‌చ‌డం పెద్ద క‌ష్ట‌మేం కాదు. ఏ మాత్రం నిర్ల‌క్ష్యం వ‌హించినా ఇక కాంగ్రెస్ భ‌విష్య‌త్తు గాల్లో దీప‌మే. అమిత్ షా - మోడీ వ్యూహాల‌ను తిరిగి అదే పార్టీపై ప్రయోగించ‌డంతో పాటు కొత్త వ్యూహాల‌కు ప‌దును పెడితేనే కాంగ్రెస్‌ కు ఈ దేశంలో నూక‌లుంటాయి.