ఆ మూడు సీట్లలో కాంగ్రెస్ కు అవకాశాలు?

Mon Apr 15 2019 15:33:19 GMT+0530 (IST)

తెలంగాణ ఎంపీ ఎన్నికల మీద కూడా పందెంరాయుళ్ల బెట్టింగులు కొనసాగుతూ ఉన్నాయి. ఒకవైపు పదహారు ఎంపీ సీట్లను నెగ్గి స్వీప్ చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ అంటూ ఉంటే పందెంరాయుళ్లు  మాత్రం ఇతరుల మీద కూడా కొన్ని సీట్లలో బెట్టింగులు కడుతూ ఉండటం విశేషం.వారి లెక్కల ప్రకారం..  కాంగ్రెస్ పార్టీకి మూడు ఎంపీ సీట్లలో మెరుగైన అవకశాలు కనిపిస్తూ ఉన్నాయి. మల్కాజ్ గిరి సీట్లో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డికి మంచి అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతూ ఉంది. అక్కడ ముగ్గురు హెవీ వెయిట్స్ పోటీ పడ్డారు. రేవంత్ రెడ్డికి పోటీగా మంత్రి మల్లారెడ్డి బంధువు మర్రి రాజశేఖర రెడ్డి బీజేపీ తరఫున ఎమ్మెల్యే ఎన్ రామచంద్రరావులు పోటీ పడ్డారు. వీరిలో రేవంత్ వైపు మొగ్గు ఉన్నట్టుగా సమాచారం.

ఇక రేవంత్ లాగా రేణుకా చౌదరి కూడా బెట్టింగు రాయుళ్ల హాట్ ఫేవరెట్ గా కనిపిస్తూ ఉన్నారు. ఖమ్మం ఎంపీ సీట్లో నామా నాగేశ్వరరావును డీ కొడుతున్నారామె. ఇక మహబూబాబాద్ చేవేళ్ల లోక్ సభ సీట్ల విషయంలో కూడా భారీగా బెట్టింగులు సాగుతూ ఉన్నాయి. కొండా విశ్వేశ్వర రెడ్డిని చేవేళ్లలో హాట్ ఫేవరెట్ గా పరిగణిస్తూ ఉన్నారు. ఆయనకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పందెంరాయుళ్లు అంటున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో  చేవేళ్ల లోక్ సభ  సీటు పరిధిలోని శాసనసభసీట్లలో కాంగ్రెస్ కు మంచి స్థాయిలో ఓట్లు దక్కాయి. ఇక మహబూబాబాద్ పరిస్థితికూడా అంతే. అక్కడ తెరాసకు ధీటుగాఅసెంబ్లీ ఎన్నికల సందర్భంలోనే మంచి స్థాయిలో ఓట్లను పొందింది.