Begin typing your search above and press return to search.

కాంగ్రెస్.. ఇంత తీసికట్టుగానా.?

By:  Tupaki Desk   |   20 May 2019 5:08 AM GMT
కాంగ్రెస్.. ఇంత తీసికట్టుగానా.?
X
జాతీయ మీడియాలో ఏ పార్టీకి లొంగకుండా నిజాలు నిక్కచ్చిగా చెప్పి అంతే నిజాయితీగా వార్తలు ప్రసారం చేయించే జర్నలిస్టుల్లో రాజ్ దీప్ సర్దేశాయ్.. కరుణ్ థాపర్ లు ముఖ్యులు.. వీరే కాక గౌరవ్ సి. సావంత్, రాహుల్ కన్వాల్ లాంటి గండరగండరలాంటి జర్నలిస్టులు అధికార, ప్రతిపక్షాలకు అమ్ముడు పోకుండా నిక్కచ్చిగా వార్తలు ఇస్తారన్న పేరుంది. వీరంతా కలిసి ఇప్పుడు ఇండియాటుడే జాతీయ చానెల్ ను నడుపుతున్నారు.

కన్సల్టింగ్ ఎడిటర్ గా ఇండియా టుడేలో కీలక స్థానంలో ఉన్న ప్రముఖ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ గురించి దేశంలో తెలియని వారుండరు. ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాడంటే రాజకీయ నేతలు జడుసుకుంటారు. మొన్నటి తెలంగాణ ఎన్నికల వేళ ఆయన కేసీఆర్, చంద్రబాబులాంటి నేతలను ఇంటర్వ్యూ చేసి చెడుగుడు ఆడేశారు. అందుకే ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ పై అందరిలోనూ నమ్మకం ఉంటుంది. వారి చెప్పినది చెప్పినట్టు జరుగుతుంటుంది.

పోయిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ కు 80కు పైగా సీట్లు వస్తాయని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ లో తెలిపింది. అది నిజమైంది. ఇప్పుడు తాజాగా ఎగ్జిట్ పోల్స్ లో ఇండియా టుడే కేంద్రంలో ఎన్డీఏకు 339-368, యూపీఏకు 77-108 వరకూ వస్తాయని.. బీజేపీదే ఫుల్ మెజార్టీ అని స్పష్టం చేశాయి.

ఇండియా టుడే దేశంలో బీజేపీ ప్రభంజనం సృష్టిస్తుందని.. ఏపీలో వైసీపీకి 130-135 సీట్లు వస్తాయని పేర్కొంది. విశ్వసనీయత గల ఈమీడియా చెప్పడంతో ఆయా పార్టీల్లో ఓ నమ్మకం ఏర్పడింది. బీజేపీ అంటే పడని ఇండియా టుడే.. బీజేపీ నేతలు ఎప్పుడూ విమర్శించే ఇండియా టుడే ఎడిటర్ రాజ్ దీప్ ఇలా బీజేపీయే సంచలన ఫలితాలను సాధిస్తుందని చెప్పడంతో కేంద్రంలో కమళదళం విజయం సాధించడం ఖాయమని అర్థమవుతోంది.

అయితే బీజేపీ నేతల చెప్పు చేతల్లో ఉన్న రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ కూడా ఇండియా టుడే ఇచ్చిన ఫిగర్ ను ఇవ్వకుండా తక్కువగా ఇచ్చాయి. ఇక మహారాష్ట్ర, బీహార్, ఒడిషా, గుజరాత్ లలో బీజేపీ స్వీప్ చేస్తుందని అంచనావేసింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో కూడా భారతీయ జనతా పార్టీ స్వీప్ చేస్తుందని ఇండియాటుడే చెప్పడం ఆశ్చర్యపరుస్తోంది.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఇంత ఉధృతంగా పోరాడినా.. రాఫెల్ సహా టెలికాం, కేబుల్ టీవీ, నోట్ల రద్దు, జీఎస్టీ సహా ఎన్నో వివాదాస్పద నిర్ణయాలను మోడీ తీసుకున్నా.. జనాలు ఆ పార్టీకే పట్టం కట్టడం అందరినీ ఆశ్చర్యపరించింది. మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రాల్లో కూడా సీట్లు సాధించకపోవడం.. కనీసం వంద మార్క్ దాటడం కూడా కష్టమేనని ఇండియా టుడే సహా ఇతర ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెప్పడం కాంగ్రెస్ పార్టీని కుదేలుచేస్తోంది. హోరాహోరీగా పోరాడుతుందని.. హంగ్ వస్తుందని.. ప్రాంతీయ పార్టీలతో అధికారంలోకి వస్తామని ఆశించిన కాంగ్రెస్ ఇంత దారుణమైన సీట్లను సాధిస్తుందన్న అంచనాలు ఆ పార్టీని కలవరపరుస్తున్నాయి.