Begin typing your search above and press return to search.

30 ఏళ్ల హత్యాచారం కథ..‘కండోమ్’ క్లైమాక్స్..

By:  Tupaki Desk   |   17 July 2018 10:25 AM GMT
30 ఏళ్ల హత్యాచారం కథ..‘కండోమ్’ క్లైమాక్స్..
X
1988 - ఏప్రిల్ 1.. అమెరికాలోని ఇండియానా రాష్ట్రం.. ఫోర్ట్ వైనా నగరం.. 8 ఏళ్ల చిన్నారి ‘ఏప్రిల్ టిన్ స్లే’ అదృశ్యమైంది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల తర్వాత 32 కి.మీల దూరంలో బాలిక మృతదేహం ముక్కలు ముక్కలై కనిపించింది. వైద్యులు పోస్టుమార్టం చేశారు. ఆ 8ఏళ్ల చిన్నారిపై రేప్ చేసి - ఆపై చిత్రవధ చేసి చంపినట్టు తేలింది. ఈ కేసులో ఒక్క క్లూ కూడా దొరకకపోవడంతో దాదాపు 30 ఏళ్లుగా పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. నిందితుడు మాత్రం పోలీసులకు సవాల్ విసురుతూనే ఉన్నాడు. హత్య జరిగిన రెండేళ్లకు 1990లో నగరంలోని ఓ గోడ మీద ‘ఆ ఎనిమిదేళ్ల చిన్నారిని చంపింది నేనే.. ఆ పాపా ఇంకో షూ మీకు దొరికిందా.. మళ్ల చంపేస్తా’ అంటూ రాతలు కనిపించాయి. దీంతో పోలీసులు ఈ కేసును సవాల్ గా తీసుకొని దర్యాప్తును ఉధృతం చేశారు. చివరకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. చిన్నారి మర్మాంగాల్లో ఉన్న వీర్యంను సేకరించి దాని ఆధారంగా పరిశోధన మొదలు పెట్టారు.

వీర్యం నిగ్గుతేల్చే జెనాలజీ శాస్త్రవేత్తలను సంప్రదించారు. జెనాలజీలో మన జన్యువుల ఆధారంగా వంశవృక్షం ఉంటుంది. ఈ డేటా ఇంటర్నెట్ లో దొరుకుతుంది. ఆ వీర్యం తాలూకా మనుషులు ఎంతమంది ఉన్నారని కనుక్కోవడం మొదలుపెట్టారు. జెనాలజీ ఆధారంగా 30 ఏళ్లకు ఇప్పుడు గ్రాబిల్ కు చెందిన జాన్ మిల్లర్(59) - అతడి సోదరుడి వీర్యాలకు అది సరిపోలింది. వీరిపై నిఘా పెట్టిన పోలీసులు.. వారి డస్ట్ బిన్ నుంచి వారు వాడిన కండోమ్ లను సేకరించారు. వాటి పరీక్షల అనంతరం నిందితుడు మిల్లర్ అని నిర్ధారించారు. పోలీసుల విచారణలో మిల్లర్ నేరం ఒప్పుకున్నాడు. ప్రస్తుతం అతడిని అలెన్ కౌంటీ జైల్లో ఉంచారు. కేసు కోర్టు విచారణలో ఉంది.

ఇలా జెనాలజీ ఆధారంగా అమెరికా పోలీసులు కేసు ను చేధించారు. ఇదివరకూ కూడా మిచెల్లా వెల్చ్ హత్యాచారం కేసులో ఈ జెనాలజీని వాడి సక్సెస్ అయ్యారు. దాదాపు 30 ఏళ్లకు చిన్నారి కేసు చిక్కుముడి వీడడం గమనార్హం.