Begin typing your search above and press return to search.

ఆర్కే బీచ్ దీక్షకు రూల్స్ ఉన్నాయ్ సుమా

By:  Tupaki Desk   |   23 Jan 2017 5:29 PM GMT
ఆర్కే బీచ్ దీక్షకు రూల్స్ ఉన్నాయ్ సుమా
X
ఆర్కే బీచ్ దీక్షకు సన్నాహాలు మొదలయ్యాయి. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ ఢిల్లీ దొరలకు వినిపించేందుకు వీలుగా ఆర్కే బీచ్ వేదికగా చేస్తున్న దీక్షకు సంబంధించిన ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది.జల్లికట్టుపై విధించిన బ్యాన్ ను ఎత్తేయాలని కోరుతూ మెరీనాబీచ్ లో తమిళ యువత నిర్వహించిన నిరసన దీక్షతో స్ఫూర్తి చెందిన ఏపీ యువత ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రం తీరుపై చేపడుతున్న మౌనదీక్షకు తాజాగా కొన్ని రూల్స్ ను ఫ్రేం చేశారు.

శాంతియుత వాతావరణంలో చేసే ఈ దీక్ష మొత్తం రాజకీయ పార్టీలకు అతీతంగా నిర్వహించాలని నిర్ణయించారు.ఈ నిరసన దీక్షకు సంబంధించిన ఇన్విటేషన్ లాంటిది ఇప్పుడు సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది. నిరసన దీక్ష స్థలిగా వైజాగ్ లోని ఆర్కే బీచ్ లోని వైఎంసీఏగా డిసూడ్ చేశారు. జనవరి 26 ఉదయం తొమ్మిది గంటల వేళకు దీక్షకు రావాల్సిందిగా కోరుతున్నారు.

దీక్షకు వచ్చే వారు ఎలాంటి రాజకీయ జెండాను పట్టుకొని రాకూడదు. రాజకీయ పార్టీలకు ఈ దీక్షకు ఎలాంటి సంబంధం లేదు. దీక్షకు సంబంధించిన బ్యానర్లు.. స్పెషల్ స్టేటస్ కు సంబంధించిన ప్లకార్డులు తీసుకురావొచ్చు. ప్రభుత్వ ఆస్తులకు ఎలాంటి ముప్పు వాటిల్లేలా ప్రవర్తించకూడదు. ప్రతిఒక్కరూ శాంతంతో వ్యవహరించాలన్న రూల్స్ ను సెట్ చేశారు. ఇప్పటికే ఈ నిరసన దీక్షకు జనసేన.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపిన నేపథ్యంలో.. ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఈ దీక్ష ఉండకూదని నిర్ణయించారు. మరోవైపు ఏపీ సర్కారు.. ఈ నిరసన దీక్ష సందర్భంగా పెద్ద ఎత్తున భద్రతా బలగాల్ని మొహరిస్తోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.