లగడపాటికి షాక్...ఈసీకి ఫిర్యాదు

Tue Dec 18 2018 21:45:23 GMT+0530 (IST)

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కు ఊహించని షాక్ తగిలింది. ఖచ్చితమైన సేవలకు పెట్టింది పేరయిన లగడపాటి తెలంగాణ ఎన్నికల సందర్భంగా సంచలన సర్వే వెలువరించింది. కాంగ్రెస్ కాంగ్రెస్ కూటమికి 65 స్థానాలు వస్తాయని మరో 10 స్థానాలు పెరగొచ్చు తగ్గే అవకాశం కూడా ఉందన్న లగడపాటి కూటమిలోని టీడీపీ పోటీ చేసిన 13 స్థానాల్లో ఇద్దరు స్వతంత్రులు గెలుస్తారని మరోచోట ఎంఐఎం పోటీలో ఉండగా మిగతా 12 స్థానాల్లో టీడీపీ-టీఆర్ ఎస్ మధ్య పోటీపోటీ ఉంటుందని ఇందులో 7 స్థానాల్లో టీడీపీ గెలుస్తుంది. మరో రెండు స్థానాల్లో గెలవొచ్చు... ఓడే అవకాశం కూడా ఉందని అంచనా వేశారు. అయితే ఈ సర్వే పూర్తిగా అడ్డం తిరిగింది. లగడపాటి గురించి నవ్వుల పాలు అయింది.తాజాగా లగడపాటి వెల్లడించిన ఫలితాలపై కేసు నమోదు అయింది. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఎన్నికలకు ముందు సర్వేల పేరిట అబద్దపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టి - గందరగోళ పరచడానికి ప్రయత్నించారంటూ లగడపాటిపై ఎన్నికల కమిషన్ లో ఫిర్యాదు చేశారు. ఇది చాలా క్లిష్టమైన సర్వేగా అభివర్ణించారు లగడపాటి రాజగోపాల్ మూడు నెలల పాటు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చిందని... వివిధ రకాలుగా ప్రజల నాడిని తెలుసుకున్నాం... చివరకు మాకు వచ్చిన అంచనా ఇదంటూ ఫలితాలను ప్రకటించారు. లగడపాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ సత్తు వెంకటరమణారెడ్డి సచివాలయంలో ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ కు ఫిర్యాదు చేశారు.

కాగా తన సర్వే అడ్డం తిరిగిన అనంతరం లగడపాటి ఊహించని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లగడపాటి వద్ద తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. సర్వే విషయాలను మీడియా ప్రస్తావించింది. 'నో కామెంట్' అంటూనే.. 'తిరుమలలో మొన్న మాట్లాడటమే పొరపాటైంది. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదు అనుకుంటూనే మాట్లాడేశాను' అంటూ ముగించారు.