Begin typing your search above and press return to search.

పవన్ తీరుతో వాళ్లు రగిలిపోతున్నారట..

By:  Tupaki Desk   |   17 July 2019 9:53 AM GMT
పవన్ తీరుతో వాళ్లు రగిలిపోతున్నారట..
X
పవన్ కళ్యాణ్.. కమ్యూనిస్టు భావాలు నిండుగా ఉన్న సినీ నటుడు, రాజకీయ నాయకుడు కూడా. తన సినిమాల్లోనూ కమ్యూనిస్టు భావజాలాన్ని చూపిస్తుంటాడు. రాజకీయాల్లోకి వచ్చాక తనకు కమ్యూనిస్టులు స్నేహితులని ప్రకటించాడు. 2014లో టీడీపీతో దోస్తీకట్టి విడిపోయాడు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులు సీపీఐ- సీపీఎంలతో కలిసి జనసేన ఎన్నికల బరిలోకి దిగింది.

అయితే ఆ ఎన్నికల్లో టీడీపీకి జనసేనాని పవన్ సహకరించారని కమ్యూనిస్టులు నేతలు రగిలిపోయారట.. ఈ మేరకు విస్తృతంగా ప్రచారం జరిగి నష్టం కూడా వాటిల్లిందని ప్రచారం జరిగింది. పవన్ పోటీచేసిన ప్రాంతాల్లో చంద్రబాబు, లోకేష్ పోటీచేసిన మంగళగిరిలో సీపీఐ బరిలో ఉన్నా పవన్ ప్రచారం చేయలేదు. దీన్ని బట్టి టీడీపీ, జనసేన మధ్య సీక్రెట్ బంధం తమ కొంప ముంచిందన్న అనుమానాలు కమ్యూనిస్టుల్లో నెలకొన్నాయి.

అయితే ఇటీవల తానా సభలకు వెళ్లిన పవన్ అక్కడ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తో సీక్రెట్ గా చర్చలు జరిపాడన్న ప్రచారం జరిగింది. టీడీపీని నిర్వీర్యం చేసి జనసేనతో కలిసి ఏపీలో వైసీపీని ఎదుర్కోవాలని బీజేపీ ప్లాన్ చేసినట్టు వార్తలొచ్చాయి.

2024 వరకు పవన్ తో కలిసి ఉద్యమాలు చేసి అప్పుడు అధికారంలోకి రావాలని కలలగంటున్న కమ్యూనిస్టులకు జనసేనాని పవన్ వైఖరి షాక్ కు గురిచేస్తోంది. పవన్.. బీజేపీకి దగ్గరవ్వడం కమ్యూనిస్టులు జీర్ణించుకోలేకపోతున్నారట.. పవన్ కనుక బీజేపీతో సాగితే ఇక దోస్తీ ఉండదని.. పవన్ నమ్మకద్రోహాన్ని సహించమని ఆ పార్టీలో చర్చ సాగుతోందట.. పవన్ మరి బీజేపీ తో కలుస్తారా? వామపక్షాలను దూరంగా పెడుతారా అన్నది చర్చనీయాంశంగా మారింది.