Begin typing your search above and press return to search.

‘సోషల్’ రియాక్షన్ నాన్నకు చెప్పావా కేటీఆర్?

By:  Tupaki Desk   |   24 Feb 2017 4:37 AM GMT
‘సోషల్’ రియాక్షన్ నాన్నకు చెప్పావా కేటీఆర్?
X
చిన్న చిన్న ఉదంతాలే.. పెద్ద పెద్ద మార్పులకు కారణం అవుతాయన్న విషయాన్ని మర్చిపోలేం. తెలంగాణ ఉద్యమం అన్నేళ్లు జరిగినా.. మలిదశలో వచ్చినంత ప్రజాస్పందన అంతకు ముందు పెద్దగా లేదన్న విషయాన్ని మర్చిపోలేం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలన్న ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉన్నప్పటికీ.. దాన్ని బలంగా బయటకు వెల్లుబుచ్చటమే కాదు.. విషయం ఏదైనా కానీ.. విడిపోవటం చుట్టూనే తిరిగే పరిస్థితికి కారణమయ్యయని చెప్పక తప్పదు. ఉద్యోగ నియామకాల అంశంలో14 ఎఫ్.. ఉస్మానియా విశ్వవిద్యాలంలో విద్యార్థులపై విరిగిన లాఠీ.. పేలిన తూటా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమ స్వరూపాన్ని మార్చేసిన వైనాన్ని మర్చిపోకూడదు.

మూడేళ్లకు రెండు నెలలు తక్కువగా ఉన్న కేసీఆర్ సర్కారులో వేలెత్తి చూపించే ఒక పెద్ద తప్పును వెంటనే చూపించలేని పరిస్థితి. కాస్త.. ఇటూ అయినా కూడా కేసీఆర్ పాలనా రథాన్ని సమర్థంగా లాగారన్న మాట వినిపించింది. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలున్నా.. అవేమీ ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసేంత స్థాయిలో లేవన్నది ఇక్కడ పాయింట్. మార్చిన ప్రాజెక్టు డిజైన్ల నేపథ్యంలో.. భూసేకరణ విషయంలో కేసీఆర్ సర్కారు కొన్ని తప్పులు చేసినప్పటికి.. దాని ప్రభావం తెలంగాణ రాష్ట్రం మొత్తంగా లేదన్నది మర్చిపోకూడదు.

అందుకు భిన్నంగా కోదంరాం ఎపిసోడ్ జరిగిందని చెప్పాలి. నిరుద్యోగులకు ఇస్తానన్న ఉద్యోగాల్ని తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదన్న మాటను అందరికి తెలిసేలా చేయటం కోసం నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. దీన్ని అవసరానికి మించిన హడావుడి చేసి.. కేసీఆర్ సర్కారు ఆగమాగం చేసిందన్న విమర్శను మూటగట్టుకున్న దుస్థితి. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేని విధంగా కోదండం మాష్టారి అరెస్ట్ విషయంలో సోషల్ మీడియా భారీగా స్పందించటమే కాదు.. కేసీఆర్ ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేసే ప్రచారం జోరుగా సాగటం గమనార్హం. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే మంత్రి కేటీఆర్.. వీటి మీద దృష్టి పెట్టి.. జనం అనుకునే మాటను తన తండ్రి.. కమ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలియజేస్తే మంచిదన్న మాట వినిపిస్తోంది. మరాయన ఆ పని చేస్తారా..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/