శివాజీని ఉతికి ఆరేసిన ఫృథ్వీ

Sun Feb 17 2019 13:40:10 GMT+0530 (IST)

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత ఎన్టీఆర్ మీద ఇదే చంద్రబాబు కుట్ర పన్ని వైస్రాయ్ హోటల్ వద్ద చెప్పులు వేయించాడని.. దాన్ని తాను సిటీ కేబుల్ లో పనిచేస్తూ వీడియో తీసి కవర్ చేశానని కమెడియన్ వైసీపీ నేత ఫృథ్వీ సంచలన కామెంట్స్ చేశారు. ఈ మధ్య టీడీపీతో అంటకాగి.. చంద్రబాబు భజన చేస్తూ నటుడు శివాజీ ‘అసలు ఎన్టీఆర్ మీద చెప్పులు వేయించలేదని’ మాటలు మాట్లాడాడని.. ఎన్టీఆర్ మీద చెప్పులు వేయించినప్పుడు తాను ప్రథమ సాక్షిగా ఉన్నానని ఫృథ్వీ కౌంటర్ ఇచ్చారు.తాను విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో డిగ్రీ పట్టా పొంది బతుకుదెరువు కోసం హైదరాబాద్ కు వలస వచ్చానని.. ఆ సమయంలో పనికోసం హైదరాబాద్ సిటీ కేబుల్ లో చేరానన్నారు. ఆ సమయంలో వైస్రాయ్ హోటల్ లో బస చేసిన టీడీపీ ఎమ్మెల్యేల వార్తలు కవర్ చేయాలని సిటీ కేబుల్ ఎండీ పంపారని.. తాను వీడియో కెమెరా పట్టుకొని వెళితే .. అక్కడికి ఎన్టీఆర్ ఓ పాత వ్యాన్ పై నిల్చుని లక్ష్మీపార్వతితో కలిసి వచ్చాడని వివరించారు. ఆ సమయంలోనే వైస్రాయ్ హోటల్ లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ కు చెప్పులు చూపించారని.. ఆ తర్వాత ఎన్టీఆర్ పై చెప్పులు విసిరారని తెలిపారు. ఆ వీడియోను తాను తీశానని.. ఇప్పటికీ సిటీ కేబుల్ లో భద్రంగా ఉన్నాయని ఫృథ్వీ సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లో నటుడు కాకముందు తాను చాలా పనులు చేశానని..జర్నలిస్టుగా కూడా చేశానని ఫృథ్వీ వివరించారు.

ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ప్రోద్బలంతో వైసీపీ ఎమ్మెల్యే రోజా సహా జగన్ ను తిడుతున్న టీడీపీ మహిళా నేతలపై ఫృథ్వీ ఫైర్ అయ్యారు. ఆమె ఒకప్పుడు సినిమాల్లో బాపు బొమ్మ అని.. ఇప్పుడు చంద్రబాబు చేతిలో బొమ్మగా మారిందని.. బాబు ఎలా కీ ఇస్తే అలా తిరుగుతూ వైసీపీ నేతలపై నోరుపారేసుకుంటున్నారని ఆడిపోసుకుంటున్నారు.