ఎమ్మెల్యేను వణికించిన కలెక్టరమ్మ అడవిలో జాలీట్రిప్

Mon Jul 17 2017 21:33:43 GMT+0530 (IST)

కలెక్టర్ ప్రీతీమీనా గుర్తున్నారా? అదేనండి అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ దురుసు ప్రవర్తను ఎండగట్టడమే కాకుండా తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఆయనకు తలంటించిన మహబూబాబాద్ కలెక్టరమ్మ. ఆ మేడమ్ ఇప్పుడు మరో కలెక్టరమ్మతో కలిసి అడవిలో హల్ చల్ చేశారు. వరంగల్ అర్బన్ కలెక్టర్ గా పనిచేస్తున్న యంగ్ కలెక్టర్ ఆమ్రపాలితో కలిసి అడవిలో ఏకంగా పన్నెండు కిలోమీటర్లు ఏకబిగిన నడిచారు.  అది కూడా వర్షంలో. ఇంతకీ ఈ యువ ఐఏఎస్‌లు ఎందుకు ఇంత కష్టపడ్డారు అంటే..అడవిలో ఉన్న చెరువును సందర్శించేందుకు!

అయితే కేవలం చెరువును మాత్రమే ఈ ఐఏఎస్ అధికారిణులు చూసి రాలేదు. దీంతో పాటుగా పెద్ద గుట్ట ఇనుప ఖనిజం టూరిజం ప్రాంతాన్ని కూడా సందర్శించారు. అక్కడ పర్యాటకులకు తగిన సదుపాయాలు - టూరిస్టుల ఆదరణ వంటి వాటిని ఆరాతీశారు. జోరుగా కురుస్తున్న వర్షంలో ఈ ఇద్దరు కలెక్టరమ్మ వేగంగా అడవుల్లో నడుస్తుంటే వారి వెంట వెళ్లిన ఉద్యోగులు మాత్రం అలసిసొలసి పోయారంట. వరంగల్ అర్బన్ కలెక్టర్ అయిన
అమ్రపాలి ఉత్సాహభరితమైన చర్యల్లో ముందుంటారనే సంగతి తెలిసిందే. గతంలో బాహుబలి-2 సినిమా విడుదల అయినప్పుడు తన సొంత డబ్బులతో ఉద్యోగస్తులందరికీ  టికెట్లు కొనిచ్చి స్వయంగా వారితో కలిసి సినిమా చూసిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది.