Begin typing your search above and press return to search.

భార‌తీయ ఉద్యోగుల‌పై అమెరిక‌న్ల కేసు కొట్టివేత‌!

By:  Tupaki Desk   |   19 March 2018 12:45 PM GMT
భార‌తీయ ఉద్యోగుల‌పై అమెరిక‌న్ల కేసు కొట్టివేత‌!
X
అమెరిక‌న్ల‌లోని లోకల్ సెంటిమెంట్ ను త‌ట్టిలేపి....అమెరికా అధ్య‌క్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన సంగతి తెలిసిందే. అమెరిక‌న్ల ఉద్యోగాల‌ను ఇత‌ర దేశాల వారు...ముఖ్యంగా భార‌తీయులు ఎగ‌రేసుకుపోతున్నారంటూ....అమెరిక‌న్ల‌ను ట్రంప్ రెచ్చ‌గొట్టారు. ఆ నేప‌థ్యంలోనే అమెరికాలోని భార‌తీయుల‌పై జాత్యాహంకార దాడులు కూడా జ‌రిగాయి. దానికి తోడు...గ‌త ఏప్రిల్ లో ట్రంప్...`బ‌య్ అమెరిక‌న్....హైర్ అమెరికన్ ` అనే నినాదాన్ని ప్ర‌జ‌ల్లోకి అధికారికంగా తీసుకువెళ్లారు. దీంతోపాటు హెచ్ 1 బీ వీసాల్లో కోత‌లు విధించ‌డం....ప‌లు ఆంక్ష‌లు విధించ‌డం వంటి చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈ నేప‌థ్యంలో కాగ్నిజెంట్ పై ఆ సంస్థ‌కు చెందిన ముగ్గురు మాజీ ఉద్యోగులు షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌మ‌ను ఆ సంస్థ నుంచి అకార‌ణంగా తొల‌గించార‌ని, త‌మ స్థానాల్లో ద‌క్షిణ భార‌త దేశానికి చెందిన ముగ్గురు వ్య‌క్తుల‌ను నియ‌మించార‌ని ముగ్గురు అమెరిక‌న్లు కోర్టును ఆశ్ర‌యించారు.

ఆ ముగ్గురు భార‌తీయులు త‌మ‌క‌న్నా త‌క్కువ నైపుణ్యం గ‌ల‌వార‌ని వారు ఆరోపించారు.కంపెనీలో త‌మ‌పై ఉద్యోగులు కూడా భార‌తీయులేన‌ని, అందుకే వారు కావాల‌నే త‌మ‌ను ఇబ్బంది పెట్టి ఉద్యోగాల‌ నుంచి తొల‌గించార‌ని ఆరోపించారు. అంతేకాకుండా, ఆ సంస్థ‌లో పనిచేసే భార‌తీయ సూప‌ర్ వైజ‌ర్లు - స‌హోద్యోగులు త‌మకు ప్ర‌మోష‌న్లు రాకుండా అడ్డుకున్నార‌ని, తాము స‌రిగా ప‌నిచేయ‌డం లేద‌ని త‌మ‌ను నిందించార‌ని ఆరోపించారు. `ది సివిల్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 1964` ప్ర‌కారం త‌మ‌కు న్యాయం చేయాల‌ని వారు కోర్టును ఆశ్ర‌యించారు. అయితే, వారి ఆరోప‌ణ‌ల‌ను కాగ్నిజెంట్ సంస్థ ఖండించింది. జాతి వివ‌క్ష వ్యాఖ్య‌లు చేసిన‌పుడు మాత్ర‌మే ఆ చ‌ట్టం వ‌ర్తిస్తుంద‌ని ఆ సంస్థ కోర్టుకు తెలిపింది. కేవ‌లం హెచ్ 1బీ వీసాల ద్వారా ఉద్యోగాలు పొందిన భార‌తీయుల‌ను ల‌క్ష్యంగా చేసుకొనే వారు ఆరోప‌ణ‌లు చేశార‌ని సంస్థ వాదించింది. కాగ్నిజెంట్ వాద‌న‌ల‌తో తాను ఏకీభ‌విస్తున్నాన‌ని, ఆ కేసును విచార‌ణ జ‌ర‌ప‌కుండానే కొట్టివేస్తున్నాన‌ని లాస్ ఏంజెలిస్ లోని డిస్ట్రిక్ కోర్టు జ‌డ్డి జాలీ గీ తీర్పునిచ్చారు.