Begin typing your search above and press return to search.

సాహసాల కోసం భారత్ కు ఆ జంట

By:  Tupaki Desk   |   14 Feb 2016 4:13 AM GMT
సాహసాల కోసం భారత్ కు ఆ జంట
X
కొందరు సెలబ్రిటీల వైఖరి చాలా చిత్రంగా ఉంటుంది. తమకున్న స్టేటస్ ను అస్సలు పట్టించుకోకుండా వ్యవహరించే వారు కొందరు ఉంటారు. తమ స్టార్ డమ్.. స్టేటస్ ల్ని వదిలేసి తమదైన స్టైల్ లో ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటి వారిలో.. హాలీవుడ్ జంట క్రిస్ హేమ్స్ వర్త్.. ఎల్సా పాట్కీలు ఒకరు. పరిచయం అవసరం లేని వీరిద్దరిని సింఫుల్ గా పరిచయం చేయాలంటే.. సుత్తిని ఆయుధంగా చేసుకొని సినిమాల్లో ప్రత్యర్థులకు సింహ స్వప్నంగా వ్యవహరించే థోర్ హీరో క్రిస్ హేమ్స్ వర్త్ కాగా.. ఆయన సతీమణి కమ్ హాలీవుడ్ యాక్షన్ సినిమాల్లో చెలరేగిపే ఎల్సా పాట్కీ (ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫేం) లు తాజాగా ఇండియాకు వచ్చారు.

ఈ రియల్ లైఫ్ జంట పెళ్లి అయినప్పటికీ.. నేటికీ ప్రేమికుల్లా హుషారుగా కనిపించటం వీరి వరకూ ఒక ప్రత్యేకత. తాజాగా వారు తమ మధ్య బంధాన్ని మరింత మెరుగుపర్చుకునేందుకు భారత్ కు వచ్చారు. హాలీవుడ్ ప్రముఖ జంటల్లో ఒకరైన ఈ జంట తమ కుటుంబ సభ్యులతో ఇండియాకు వచ్చేశారు. అదరగొట్టే బుల్లెట్ మీద క్లోజ్ గా మూవ్ అవుతూ.. చూసినంతనే కళ్లు తిప్పుకోలేనట్లుగా ఉన్న వీరి ప్రేమను చూడాల్సిందే. ఇప్పటికే గోవా.. లఢాఖ్ ప్రాంతాల్ని చుట్టేసిన వారు.. వాలెంటీన్స్ డే రోజున హిమాలయ పర్వతాల్లో సాహస యాత్రకు సిద్ధం అవుతున్నారు. మరి.. జంటకు ఆల్ ద బెస్ట్ చెబుదామా?