సీఎం జగన్ అపాయింట్ మెంట్ అడిగిన చిరంజీవి?

Wed Oct 09 2019 16:47:35 GMT+0530 (IST)

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అపాయింట్ మెంట్ కోరారట మెగాస్టార్ చిరంజీవి. ఒకవైపు ‘సైరా’ సినిమా సక్సెస్ ఫుల్ గా నడుస్తూ ఉన్న నేపథ్యంలో.. చిరంజీవి ఉత్సాహంగా ఉన్నారు. సైరా నరసింహారెడ్డి సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో ఆయన బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అపాయింట్ మెంట్ ను కూడా కోరారట చిరంజీవి.వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చిరంజీవి కలవడం వెనుక ఆసక్తిదాయకమైన రీజన్లున్నాయని తెలుస్తోంది. సైరా సినిమా సక్సెస్ గురించి ముఖ్యమంత్రికి వివరించాలని చిరంజీవి భావిస్తున్నారట. అలాగే ముఖ్యమంత్రిగా ఎన్నికైనందుకు కూడా జగన్ కు కంగ్రాట్స్ చెప్పనున్నారట చిరంజీవి.

జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత చిరంజీవి ఆయనతో సమావేశం కాలేదు. చాలా కాలంగా వీరిద్దరూ కలిసింది కూడా లేదు. ఈ నేపథ్యంలో వీరి సమావేశం ఆసక్తిదాయకంగా మారే అవకాశం ఉంది. అయితే ఇంకా ఎప్పుడు కలిసేది అపాయింట్ మెంట్ తదితరాలు ఖరారు కాలేదని సమాచారం.