జగన్ గడపలో చిరు

Tue Jan 10 2017 19:45:20 GMT+0530 (IST)

రాజకీయాలు వేరు. సినిమాలు వేరు. ఏ లెక్క ఆ లెక్కదే అన్నట్లుగా ఉంది తాజా వ్యవహారం చూస్తే. తొలిసారి ఒక సిత్రమైన కాంబినేషన్ ఒకటి ఆవిష్కృతమైంది. ఏపీ విపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి చానల్ లో చిరు ప్రత్యేక ఇంటర్వ్యూను టెలికాస్ట్ చేశారు. తన కెరీర్ కు మైల్ స్టోన్ లాంటి ఖైదీ నంబరు 150 చిత్రం మీద చిరు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అందుకే.. సినిమా ప్రచారానికి అవసరమైన ఏ చిన్న అవకాశాన్ని ఆయన వదిలిపెట్టటం లేదు. అందుకే కాబోలు.. ఎప్పుడూ లేని విధంగా జగన్ కు చెందిన సాక్షి టీవీ చానల్ లో ప్రత్యేక ఇంటర్వ్యూను  ఇచ్చారు. నిన్నటికి నిన్న టీవీ 9 రవిప్రకాశ్ కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చి.. బోలెడన్ని కబుర్లు చెప్పిన చిరు..ఈ రోజు సాక్షి ఛానల్ కు వచ్చి మరీ ఇంటర్వ్యూ ఇచ్చారు.

మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సాక్షి ఛానల్ కు వచ్చిన చిరును ఇంటర్వ్యూ చేసింది ఎవరో తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. జగన్ పార్టీ ఎమ్మెల్యే.. ఒకప్పుడు తనతో కలిసి యాక్ట్ చేసిన రోజా ప్రశ్నలు సంధిస్తే.. చిరు సమాధానాలు ఇవ్వటం అందరి దృష్టిని విపరీతంగా ఆకట్టుకుంటోంది. తాజా పరిణామం చూసినప్పుడు ఖైదీకి జగన్ ఫుల్ సపోర్ట్ ఇచ్చినట్లుగా కనిపించకమానదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/