పవన్ గృహ ప్రవేశానికి అన్నావదినలు!

Fri Nov 09 2018 17:30:25 GMT+0530 (IST)

జనసేన అధ్యక్షుడు సినీ నటుడు పవన్ కల్యాణ్  హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయం సమీపంలో కొత్తగా ఓ ఇల్లు కట్టుకున్న సంగతి తెలిసిందే. నేడు నిర్వహించిన ఆ `గృహ ప్రవేశ` కార్యక్రమం బంధుమిత్రుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన సతీమణి సురేఖ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అన్నావదినలిద్దరితో పాటు పవన్ సన్నిహితులు కొంతమంది ఈ వేడుకకు హాజరయ్యారట. ఈ సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో  ఉన్న మెగా బ్రదర్స్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ కార్యక్రమానికి వచ్చిన చిరు...పవన్ తో చాలాసేపు ముచ్చటించారట. రాబోయే ఎన్నికలు రాజకీయాల గురించి అన్నదమ్ములు చర్చించుకున్నారట.చిరంజీవి త్వరలో జనసేనలోకి రాబోతున్నారని ఆ క్రమంలోనే కొంతకాలంగా  కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే చిరు...తన కాంగ్రెస్ సభ్యత్వాన్ని కూడా రెన్యువల్ చేసుకోలేదని తెలుస్తోంది. త్వరలోనే మెగా ఫ్యామిలీ మొత్తం జనసేనకు మద్దతుగా ప్రచారం కూడా నిర్వహించబోతోందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ముందుగా ..పవన్...అన్నావదినలు ఈ గృహ ప్రవేశ కార్యక్రమం ద్వారా ఎంట్రీ ఇచ్చారట. గతంలో పవన్ తో చిన్న చిన్న మనస్పర్థల కారణంగా...మెగా ఫ్యామిలీలో కొంత గ్యాప్ వచ్చిందని పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొంతకాలంగా ఆ గ్యాప్ తగ్గిపోయి...ఇపుడు మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటయింది. రాబోయే ఎన్నికల్లో `మెగా`హీరోలంతా పవన్ కు రాజకీయ మద్దతునివ్వబోతున్నారని టాక్ వస్తోంది.