Begin typing your search above and press return to search.

మోడీ జీ టూర్‌ తో చైనాలో క‌ల‌వ‌రం

By:  Tupaki Desk   |   26 Jun 2017 10:41 AM GMT
మోడీ జీ టూర్‌ తో చైనాలో క‌ల‌వ‌రం
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ భేటీకి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ చైనా వెన్నులో వ‌ణుకు ప‌డుతోంది. ఈ భేటీలో భాగంగా అమెరికా నిఘా డ్రోన్ల‌ను ఇండియాకు విక్ర‌యించే అంశంపై కూడా మోడీ - ట్రంప్ చ‌ర్చించ‌నున్నారు. ఇప్పుడిదే చైనాను క‌ల‌వ‌రపెడుతోంది. ఈ డ్రోన్ల వ‌ల్ల హిందూ మ‌హాస‌ముద్రంపై భార‌త్ నిఘా మ‌రింత ఎక్కువ‌వుతుంద‌ని చైనా కంగారు ప‌డుతున్న‌ట్లు ఆ దేశ నిరాయుధీక‌ర‌ణ‌ వ్యూహ‌క‌ర్త హాన్ హువా వెల్ల‌డించారు. మోడీ - ట్రంప్ భేటీని చైనా చాలా జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించనున్న‌ట్లు ఆమె చెప్పారు.

ఇద్ద‌రు అగ్ర‌నేత‌ల స‌మావేశం నేప‌థ్యంలో చైనా నిరాయుధీక‌ర‌ణ‌ వ్యూహ‌క‌ర్త హాన్ హువా మీడియాతో మాట్లాడుతూ ``చైనాలో ఇప్పుడు చాలా మంది ఆందోళ‌న‌లో ఉన్నారు. ఎఫ్‌-16 యుద్ధ విమానాల్లాంటి అత్యాధునిక టెక్నాల‌జీని రెండు దేశాలు పంచుకున్నా న‌ష్టం లేదు. కానీ భార‌త్‌కు హిందూ మ‌హాస‌ముద్రంలో నిఘాకు ప‌నికొచ్చే డ్రోన్ల విక్ర‌యంపై చైనా ఆందోళ‌నంతా. ఈ కొత్త డ్రోన్ల వ‌ల్ల ఇండియ‌న్ ఓషియ‌న్ మొత్తం నిఘా వేసే వీలు భార‌త్‌ కు ఉంటుంది`` అని హాన్ చెప్పారు. ఇలాంటి 22 డ్రోన్ల‌ను అమెరికా నుంచి కొనుగోలు చేయాల‌ని భార‌త్ భావిస్తోంది. దీనికి ఇప్ప‌టికే అమెరికాకు కూడా ఆమోదం తెలిపిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇండియా - అమెరికా పౌర అణు ఒప్పందంపై సంత‌కాలు చేసిన‌ప్ప‌టి నుంచే చైనా వ్యూహ‌క‌ర్త‌లు రెండు దేశాల మ‌ధ్య సంబంధాల‌ను జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తున్నార‌ని ఆమె తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/