Begin typing your search above and press return to search.

చైనా త‌లుచుకుంటే దుమ్ము రేగిపోతుంది మ‌రి!

By:  Tupaki Desk   |   23 Jan 2017 4:17 PM GMT
చైనా త‌లుచుకుంటే దుమ్ము రేగిపోతుంది మ‌రి!
X
ప్ర‌పంచంలో అత్యంత ఎక్కువ‌గా ముస‌లి జ‌నాభాతో ఇబ్బందులు ప‌డ్డ చైనాలో ఇపుడు సీన్ మారుతోంది. ఇద్ద‌రికి ఒక్క‌రు అనే పాల‌సీతో కొద్దికాలం క్రితం చైనా జ‌నాభా చాలా వ‌ర‌కు అదుపులోకి వ‌చ్చింది. అయితే ఏడాది క్రితం దంపతులు ఇద్ద‌రు పిల్లల్ని క‌న‌వ‌చ్చు అని తీసుకున్న నిర్ణ‌యం ఫ‌లించిన‌ట్లు తెలుస్తున్న‌ది. గ‌త 15 ఏళ్లతో పోలిస్తే, ప్ర‌స్తుతం చైనాలో శిశు జ‌న‌న రేటు పెరిగింది. 2000 సంవ‌త్స‌రం త‌ర్వాత గ‌త ఏడాది భారీ స్థాయిలో శిశు జ‌న‌న రేటు న‌మోదు అయిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. పిల్ల‌ల్ని క‌నే మ‌హిళల‌ సంఖ్య త‌గ్గినా, జ‌న‌న రేటు మాత్రం అధికంగా ఉంద‌ని రికార్డులు స్ప‌ష్టం చేస్తున్నాయి.

వ‌న్ చైల్డ్ పాల‌సీని ర‌ద్దు చేసిన ఏడాదిలోపే శిశు జ‌న‌న రేటు దూసుకెళ్లుతున్న‌ట్లు అధికారులు చెప్పారు. 2016లో సుమారు కోటి 80 ల‌క్ష‌ల 46 వేల మంది శిశువులు పుట్టిన‌ట్లు ఫ్యామిలీ ప్లానింగ్ క‌మీష‌న్ పేర్కొంది. 2015తో పోలిస్తే, శిశు జ‌న‌న రేటు 11.5 శాతం పెరిగిన‌ట్లు క‌మీష‌న్ వెల్ల‌డించింది. గ‌త ఏడాది పుట్టిన శిశువుల్లో 45 శాతం మందికి సోద‌రులు లేదా సోద‌రిలు ఉంటార‌ని అంచ‌నా వేస్తున్నారు. 2020 వ‌ర‌కు ప్రతి ఏడాది కోటి 70 ల‌క్ష‌ల నుంచి రెండు కోట్ల వ‌ర‌కు శిశువులు జ‌న్మించే అవ‌కాశాలున్న‌ట్లు అధికారులు తెలిపారు. 2050 వ‌ర‌కు దేశంలో మూడు కోట్ల అద‌న‌పు కార్మిక శ‌క్తి త‌యార‌వుతుంద‌ని అధికారులు అంటున్నారు. 1979లో వ‌న్ చైల్డ్ పాల‌సీని చైనా అమ‌లులోకి తీసుకువ‌చ్చింది.

చైనాలో నెటిజ‌న్ల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. 2016లో వీళ్ల సంఖ్య 6.2 శాతం పెరిగి 73.1 కోట్ల‌కు చేరింది. ఇది దాదాపు యూర‌ప్ ఖండ జ‌నాభాకు స‌మాన‌మ‌ని చైనా ఇంట‌ర్‌ నెట్ నెట్‌ వ‌ర్క్ ఇన్ఫర్మేష‌న్ సెంట‌ర్ వెల్ల‌డించింది. గ‌తేడాది నెటిజ‌న్ల సంఖ్య మ‌రో 4.3 కోట్లు పెరిగింద‌ని చెప్పింది. ప్ర‌స్తుతం నెటిజ‌న్ల సంఖ్య చైనా జ‌నాభాలో 53.2 శాతంగా ఉంది. పెరిగిపోతున్న స్మార్ట్‌ ఫోన్ల కార‌ణంగా ఇంట‌ర్నెట్ యూజ‌ర్లు కూడా భారీగా పెరుగుతున్నార‌ని షాంఘైకి చెందిన ఐటీ ఎక్స్‌ ప‌ర్ట్ లి యి తెలిపారు. మొత్తం నెట్ యూజ‌ర్ల‌లో స్మార్ట్‌ ఫోన్ ఆధారిత యూజ‌ర్లు 95.1 శాతంగా ఉన్నారు. అంత‌కుముందు ఏడాదితో పోలిస్తే ఇది ఐదు శాతం పెర‌గ‌డం విశేషం. మొబైల్ పేమెంట్‌ ను అల‌వాటుగా మార్చుకునే వారి సంఖ్య కూడా చైనాలో భారీగా పెరిగిపోతోంది. గ‌తేడాది 47 కోట్ల మంది మొబైల్ పేమెంట్స్ చేశారు. ఈ మొత్తం నెట్ యూజ‌ర్ల‌లో గ్రామీణ ప్రాంతాల నుంచి 20 కోట్ల మంది ఉన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/