బ్యాంకులోన్ కోసం నగ్నచిత్రాలు ష్యూరిటీ..

Wed Dec 05 2018 10:32:22 GMT+0530 (IST)

బ్యాంకుల్లో లోన్లు కావాలంటే ఓ పట్టాన మంజూరు కాదు.. దానికి సవాలక్ష కారణాలు చూపిస్తారు. ఇది బాగా లేదంటారు.. గవర్నమెంట్ నుంచి ఫలానా పత్రాలు కావాలంటూ వేధిస్తారు. చివరకు అన్ని తెచ్చినా తనఖాగా ఆస్తులను పెట్టుకొని ఇస్తారు. ఇలా బ్యాంకు రుణం పొందాలంటే తలప్రాణం తోకకు వస్తుంది. కానీ ఇక్కడ చైనా బ్యాంకు మాత్రం అలా కాదు.. కేవలం మహిళలకే లోన్లు ఇస్తుంది. దానికి ష్యూరిటీగా వారి నగ్న ఫొటోలు వీడియోలను సంస్థకు ఇవ్వాలి. ఇలా చాలా మంది  విద్యార్థినులు ఇలానే ఇప్పటివరకు లోన్లు తీసుకున్నారు.చైనాలోని ‘నేకెడ్ లోన్’ అనే సంస్థ ఆన్ లైన్ ద్వారా రుణాలు మంజూరు చేస్తామని ప్రకటన ఇచ్చింది. కేవలం మహిళలకు మాత్రమే లోన్లు ఇస్తామని తెలిపింది. మహిళా కస్టమర్లు తమ ఆస్తులు ఆర్థిక వివరాలు ఏమీ అప్పగించాల్సిన అవసరం లేదు.. కేవలం వారి నగ్న శరీరాన్ని ఫొటోలు తీసి.. వీడియోలు తీసి ఇస్తే చాలు రుణాలు మంజూరు చేస్తారు. మహిళలు తమ ఐడీ కార్డులను పట్టుకొని నగ్నంగా నిల్చొని సెల్ఫీలు తీసుకోవాల్సి ఉంటుంది. తమకు ఎంత డబ్బు  కావాలి.? పేరు ఊరు ఎప్పుడు చెల్లిస్తారనే విషయాలను వీడియోలో వివరించాలి. ఒకవేళ డబ్బులు చెల్లించకుంటే సంస్థ తమ నగ్న చిత్రాలను ఆన్ లైన్ లో విడుదల చేయవచ్చని ఒప్పందం ప్రకారం చెప్పాల్సి ఉంటుంది.  ఈ ఫొటోలు వీడియోలను ఆన్ లైన్ లో పంపగానే వారు ఆన్ లైన్ ద్వారానే రుణాలు మంజూరు చేయడం ప్రారంభించారు.

తాజాగా నేకెడ్ లోన్ సంస్థ నుంచి 10 జీబీ సైజ్ గల మహిళల నగ్న ఫొటోలు వీడియోలు లీక్ అయ్యాయి. ఈ ఫొటోలను జీదైబౌ అనే మరో ఆన్ లైన్ సంస్థ తాజాగా లీక్ చేసి ‘నేకెడ్ లోన్’ సంస్థ బండారం బయటపెట్టింది. మొత్తం 161 మంది మహిళలు నేకెడ్ లోన్ నుంచి రుణం పొందినట్లు వెల్లడించింది. వీరంతా 17 ఏళ్ల నుంచి 23 ఏళ్లలోపు కాలేజీ విద్యార్థినులే అని తేలింది. వీరంతా కాస్మోటిక్స్ ఇతర అవసరాల కోసం ఇలా తమ దేహాన్ని ఆన్ లైన్ లో పెట్టి డబ్బు తీసుకున్నట్టు తెలిసింది.

లోన్ చెల్లించలేని విద్యార్థినులు యాజమాన్యానికి లైంగిక కోర్కెలు తీర్చి రుణాలు కూడా తప్పించుకున్నారని జీదైబౌ సంస్థ వెల్లడించింది.